For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ భర్తకు మీరు పరిపూర్ణమైన భార్యగా ఉండాలని భావిస్తున్నారా ?

మీ భర్తకు మీరు పరిపూర్ణమైన భార్యగా ఉండాలని భావిస్తున్నారా ?

|

ఈ ప్రపంచంలో ఎవరూ పరిపూర్ణంగానూ, లేదా అసంపూర్ణంగానూ ఉండరు అన్న విషయం తెలిసినదే. అది మానవ నైజం. నిజమే కదా? ప్రతి మనిషీ తన జీవితంలో తప్పులు చేస్తుంటాడు. తప్పే చేయని మనిషి ఉంటే, అచేతనంగానో, లేదా మానసిక రోగిగానో ఉంటాడు. ఇది ముమ్మాటికీ నిజం. మేమే తప్పూ చెయ్యలేదు అని అనేవారు కూడా, మానసికంగా ఎక్కడో ఏదో వెలితి భావనతో ఉండడం సర్వసాధారణం.

కానీ స్త్రీ, ఒకరికి భార్యగా ఉన్నప్పుడు, పురుషులు పరిపూర్ణతని కోరుకుంటారు అన్నది జగమెరిగిన సత్యం. ఆగండి! వారు అపరిపూర్ణంగా ఉన్నాకూడా, వారి భార్యల నుండి మాత్రం కొన్ని ఆశిస్తుంటారు. మహిళలు కూడా అలాగే కోరుకుంటారనుకోండి. కానీ ఈ వ్యాసం భార్యలకు కేటాయించినది.

PERFECT WIFE: DO YOU FIT INTO IT? THINGS TO DO IN ORDER TO BE ONE

వివాహ జీవితంలో ఒక స్త్రీ తన భాగస్వామి పట్ల పరిపూర్ణమైన వ్యక్తిగా ఉండాలి అంటే అర్ధం చేసుకోవలసిన కొన్ని అంశాలు ఉన్నాయి.

ఇక్కడ మీరు అర్థం చేసుకోవలసినది రాకెట్ సైన్స్ కాదు. ఇవి తన భార్య నుండి ప్రతి భర్త కోరుకునే సాధారణ మరియు ప్రాథమిక విషయాలు. మీరు మీ భర్త సంతోషంగా ఉండాలని అనుకుంటే, ఈ సరళమైన విషయాల పట్ల అవగాహన కలిగి ఉండక తప్పదుమరి.

వివాహం అంటేనే కాస్త కష్టతరమైన అంశం, మనకు ఇది తెలుసు. అవునా కాదా? కానీ మీ భాగస్వామితో మీరుండే విధానం మీదనే, మీ సంతోషకరమైన జీవితం ఆధారపడి ఉంటుంది. భార్యా భర్తల మద్య సరైన అవగాహనా, మానసిక ఒప్పందం అనేది ఉన్న ఎడల, ఎటువంటి సమస్యలు లేకుండా సంతోషమయ జీవితాన్ని గడుపవచ్చు.

కాకపొతే మహిళలు కాస్త సంక్లిష్టంగా ఉంటారు మరియు పురుషులు సరళమైన వారిగా ఉంటారు. వివాహం అనేది మూడుముళ్ళు వేసేంత సమయం పట్టదు, కానీ జీవితం నడపడం మాత్రం అనుకున్నంత సులువు కాదని గ్రహించాలి.

కానీ కొన్ని ప్రాధమిక అంశాలను పరిగణనలోనికి తీసుకుని పాటించడం మూలంగా, వివాహంలో ఎటువంటి కలతలూ లేకుండా సంతోషమయమైన జీవనానికి పునాదులు వేయవచ్చు.

ఈ వ్యాసంలో, వారి సహజ జీవన విధానానికి మెరుగులుదిద్ది, భార్యగా మారాక ఏ అంశాలను పరిగణలోనికి తీసుకోవడం ద్వారా పరిపూర్ణంగా ఉండగలరో చెప్పడం జరిగింది. తద్వారా కలహాల సంసారానికి తప్పు ఎక్కడ జరుగుతుంది అని తెలుసుకునే వీలుంటుంది.

పరిపూర్ణమైన భార్యగా ఉండడానికి దోహదపడే ప్రాధమిక అంశాలను తెలుసుకుందామా.

1.విశ్వసనీయత

1.విశ్వసనీయత

అవును, విధేయత వివాహానికి అతి ప్రాముఖ్యమైనది. వివాహ జీవితంలో అన్నిటా, ఇప్పటికీ ఎప్పటికీ ఒకరికొకరు అన్నట్లుగా, ప్రతి విషయాలనందు భాద్యతని కలిగి ఉండి, చేదోడువాదోడుగా ఉండాల్సి వస్తుంది. కానీ ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోతే? ఊహించడానికే కష్టంగా ఉంటుంది అవునా ? మీ వివాహ జీవితం ఏ స్టేజ్లో ఉంది అన్నది అప్రస్తుతం, కానీ మీ కాపురం సజావుగా సాగాలి అంటే ఒకరిపై ఒకరికి పూర్తి విశ్వసనీయత ఉండాలి. అనుమానాలతో, అపార్ధాలతో నడిపే కాపురాలు కలిగి ఉండడం నరకంతో సమానం. మీరు ఎంత నమ్మకంగా ఉన్నారు అన్న అంశం మీదనే మీ భాగస్వామికూడా నమ్మకాన్ని ప్రదర్శిస్తుంటాడు. మిమ్మల్ని మీ భాగస్వామి మోసం చేయడంలేదని అన్ని విధాలా నిర్ధారించుకోండి, తద్వారా అతనిపై ఒక భావన ఏర్పడుతుంది. ఏదైనా క్లిష్టమైన సమస్యని మీ భర్త ఎదుర్కుంటున్న పరిస్థితుల్లో సామరస్యంగా పరిష్కరించే తల్లి పాత్రను పోషించే వారిలా ఉండండి. ఎటువంటి క్లిష్టపరిస్తితుల్లోనూ వెంటనుంటానన్న భరోసాని మీ భర్తకు కలిగించండి. మీరెంతగా ప్రేమిస్తారో, అంతే ప్రేమను తిరిగి పొందగలరు. ఈ విషయాన్ని మరువకండి. విశ్వసనీయత కలిగి ఉండడం పరిపూర్ణమైన భార్యకు మొదటి అలంకరణ.

2. నిజాయితీ

2. నిజాయితీ

నిజాయితీని కలిగి ఉండడం ద్వారా జీవితంలో ఎప్పుడూ ఒక అత్యున్నత స్థానంలో ఉండగలరన్న విషయాన్ని మరువకూడదు.

ఒక పరిపూర్ణ భార్యగా ఉండాలంటే, మీ పరిస్థితి ఎంత క్లిష్టతరంగా ఉన్నా మరియు పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నా నిజాయితీని మాత్రం విడువకూడదు. నిజాయితీ అనేది విజయవంతమైన వివాహానికి చక్కటి మార్గం.

ప్రతి వివాహ జీవితంలోనూ అత్యంత ముఖ్యమైన కీలకమైన అంశాలలో ఒకటి. కేవలం భార్యే కాదు, భర్త కూడా నిజాయితీగా ఉండాలి. భాగస్వాములలో ఎవరు నిజాయితీని వీడినా, ఆ కాపురం తెరచాపలేని నావే.

భార్యాభర్తల సమస్యల వెనుక ఉన్న కారణాలను అర్ధం చేసుకుంటే, ఖచ్చితంగా సంబంధం పట్ల నిజాయితీ లేకపోవడం, మోసం వంటి అంశాలే ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి అనడం జగమెరిగిన సత్యం. కాదంటారా? పరిపూర్ణమైన భార్యగా ఉండాలి అంటే, నిజాయితీని వీడకూడదు మరి.

3. సంరక్షణ:

3. సంరక్షణ:

పుట్టుకతో ఒక స్త్రీ పురుషుని కంటే ఎక్కువ ఉదార భావాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటుంది. కానీ వివాహితురాలు కేవలం తాను జాగ్రత్తగా ఉండడమే కాకుండా, భర్తను కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. తనను ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటున్న భార్యని ఏ భర్త ఇష్టపడడు చెప్పండి. ఇక్కడ అలా జాగ్రత్తని కలిగి ఉండడం అంటే, వారి పట్ల మీ ప్రేమను వ్యక్తపరచడమే. తద్వారా మీ సంబంధం మరింత పటిష్టవంతంగా తయారవుతుందని వేరే చెప్పనవసరం లేదు.

పురుషులు తన భార్యలో ఒక స్నేహితుని, ప్రేమికురాలిని, తల్లిని చూడాలని కోరుకుంటాడు. మీరు చూపించే జాగ్రత్తలోనే అవన్నీ సాధ్యమవుతాయి తద్వారా పరిపూర్ణమైన భార్యకు మరొక అడుగు పడినట్లే.

4. దయాగుణం:

4. దయాగుణం:

ఇది వివాహ జీవితంలో ఒక ప్రాథమిక అవసరంగా చెప్పబడింది. వాత్సల్యం మీకు దయాగుణాన్ని, జాలిని చూపేలా చేస్తుంది మరియు ప్రతి మనిషి ఒక దయగల భార్య కోసం ఎదురుచూస్తాడు. వివాహ జీవితమన్నాక కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవక తప్పదు. కొన్ని క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పడు మీరు సమస్యలు తగ్గించేలా ప్రయత్నించాలి కానీ, పెంచేలా కాదు. మీరు చూపే దయాగుణం మీ భవిష్యత్తులో సంతోషకర జీవితానికి మైలురాయి అవుతుంది. మీరు అతని భావోద్వేగాల పట్ల దయ చూపించి, అతనిని అర్థం చేసుకుని ప్రవర్తించే వారే అయితే, మీ భర్త కళ్ళలో ఇప్పటికే కాదు ఎప్పటికీ మీ స్థానం పదిలంగా ఉంటుంది అనడంలో ఆశ్చర్యమే లేదు.

5. సాన్నిహిత్యం

5. సాన్నిహిత్యం

ప్రతి పురుషుడూ మరియు స్త్రీ, తమ వివాహ జీవనంలో సాన్నిహిత్యాన్ని కలిగి ఉండాలి అన్నది ప్రాధమిక విషయం. మీ భర్తతో సన్నిహితంగా ఉండటం పరిపూర్ణ భార్యకు కీలకమైన అంశంగా చెప్పబడింది. సాన్నిహిత్యం అనేది భౌతికంగానే కాదు మానసికంగా కూడా ఉండాలి. సంకేతాలలో కూడా సాన్నిహిత్యం ఉంటుంది. సంబంధం లో సాన్నిహిత్యం ఉన్నంత కాలం, ఒక వివాహం విచ్ఛిన్నం అవ్వడం జరగని పనే. సాన్నిహిత్యం కోల్పోవడం వివాహంలో విభేదాలను సృష్టిస్తుంది మరియు విచ్చిన్నతకు దారితీస్తుంది.

పరిపూర్ణమైన భార్య ఆమె వివాహ జీవితం నందు, ఖచ్చితంగా భాగస్వాములిద్దరి మద్య ఈ ప్రాధమిక అంశాలను పరిగణనలోనికి తీసుకుని ముందుకు నడుస్తుంది. ఈ పై విషయాల్లో ఏ ఒక్కటైనా మీసంబంధంలో లోపంగా అనిపిస్తే ,ఖచ్చితంగా దానిని అనుసరించండి.

గుర్తుంచుకోండి, ఇదేమీ రాకెట్ సైన్స్ కాదు, ఒకరికొకరు నిజాయితీతో అర్ధం చేసుకోవడమే. ఈ ప్రాధమిక సూత్రాల ద్వారా జీవనాన్ని కొనసాగిస్తే, ఎటువంటి కలహాలు లేకుండా సంతోషంగా ఆదర్శ దంపతులుగా ఉండగలరు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. మీకేమన్నా సమస్యలు ఉంటే క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి. మరిన్ని వివరాలకై ఈ పేజీని తరచూ సందర్శించండి.

English summary

PERFECT WIFE: DO YOU FIT INTO IT? THINGS TO DO IN ORDER TO BE ONE

PERFECT WIFE: DO YOU FIT INTO IT? THINGS TO DO IN ORDER TO BE ONE,Perfect wife: do you fit into it? Things to do in order to be one. We have all heard no humans are perfect and imperfection is a beauty. Do we believe it? Yes, we do. Every human makes mistakes. So, no one is perfect.
Story first published:Thursday, May 24, 2018, 13:59 [IST]
Desktop Bottom Promotion