Latest Updates
-
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం!
నా ఫొటోలను ఆ సైట్లలో పెట్టారు, పట్టుచీరలో ఉన్న నన్ను పోర్న్ బేబీగా మార్చారు #mystory221
వాళ్లు అసలు నిందితున్ని పట్టుకున్నారు. అతను ఎవరా అని చూస్తే మా పెళ్లికి ఫొటోలు తీసిన వ్యక్తే. వీడు ఇంత దుర్మార్గుడా అని అనిపించింది. నా ఫొటోలను ఆ సైట్లలో పెట్టారు, పట్టుచీరలో ఉన్న నన్ను పోర్న్ బేబీగా.
నేను ఒకసారి మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్లాను. పెళ్లిలో ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్ ఎంజాయ్ చేశాను. సెల్ఫీలు దిగి ఫేస్ బుక్ లో పెడితే వందలాది మంది కామెంట్స్ పెట్టారు. ఇక ఆ పెళ్లిలో పెళ్లికూతురిని దింపిన ప్రతి ఫొటోలో నేనూ ఉన్నాను. ఆల్బమ్ వచ్చాక ఆ ఫొటోలను చూసి నేను చాలా మురిసిపోయాను.
ఫొటోగ్రాఫర్ పెళ్లికూతురు కంటే నన్నే చాలా అందంగా తీశాడు. దీంతో ఫొటో గ్రాఫర్ కు నేను థ్యాంక్స్ చెప్పాను. తర్వాత అదే ఫొటో గ్రాఫర్ ను నా పెళ్లికి ఫొటోలు తీయమని చెప్పాను. తను ఒకే అన్నాడు. నా పెళ్లిలో తను తీసిని ఫొటోలు నాకు బాగా నచ్చాయి.

అడల్ట్ సైట్ లో నా ఫొటోలు
అయితే మా ఆయనకు ఒక అడల్ట్ సైట్ లో నా ఫొటోలు కనపడ్డాయి. దీంతో మా ఆయన నాపై విపరీతమైన కోపంతో ఆఫీస్ నుంచి ఆఫ్టర్ నూన్ వచ్చేశారు. ఏంటే ఇదే అంటూ మండిపడ్డాడు. ఆ ఫొటోలను చూసి నేను షాక్ అయ్యాను.

నా బాడీ మార్చేశారు
అందులో ఫేస్ ఒక్కటి నాది పెట్టి నా బాడీ మార్చేశారు. పట్టుచీరలో ఉన్న నన్ను నగ్నంగా మార్చారు. ఈ ఫొటోలను ఎవరో మార్ఫింగ్ చేశారండి మా ఆయనకు చెప్పాను. ఆయన అర్థం చేసుకున్నాడు. తర్వాత మా ఆయన సైబర్ పోలీసులకు కంప్లైట్ ఇచ్చాడు.

పెళ్లికి ఫొటోలు తీసిన వ్యక్తే
వాళ్లు అసలు నిందితున్ని పట్టుకున్నారు. అతను ఎవరా అని చూస్తే మా పెళ్లికి ఫొటోలు తీసిన వ్యక్తే. వీడు ఇంత దుర్మార్గుడా అని అనిపించింది. తర్వాత నెట్ లో నుంచి నా ఫొటోలు మొత్తం తీయించేశారు. జీవితాంతం గుర్తుగా ఉంటాయని మనం ఫొటోలు దిగితే వాటిని ఇలా మార్చేసే దుర్మార్గులు కూడా ఉంటారా అని నాకు అనిపిస్తూ ఉంటుంది.

పోర్న్ ఫొటోలుగా మార్చి
మన పక్క రాష్ట్రంలో ఇప్పుడు వరదలతో అల్లాడిపోతున్న స్టేట్ లో కూడా ఇలాంటి కేసులు బయటపడ్డాయి. పెళ్లి కూతుర్ల ఫొటోలను పోర్న్ ఫొటోలుగా మార్చిన సంఘటనలు చాలానే బయటపడ్డాయి. వాటిని అడల్ట్ సైట్లలో పెట్టి డబ్బులు గుంజాలనే చూసేవాళ్లు కొందరు ఉంటారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి.

నా న్యూడ్ ఫొటోలు నెట్ లో పెట్టడంతో
అందరూ ఫొటో గ్రాఫర్లు అలానే ఉంటారని నేను అనడం లేదు. మానవత విలువలు లేని కొందరు మాత్రమే ఇలాంటి పనులకు ఒడిగడుతారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. నా న్యూడ్ ఫొటోలు నెట్ లో పెట్టడంతో ఇప్పుడు నాకు ఫేస్ బుక్ తో పాటు ఏదైనా సోషల్ మీడియా యూజ్ చెయ్యాలంటే భయం వేస్తుంది. అలాగే నాకు తెలిసిన వారు ఎవరైనా నా ఫొటోలు చూశారేమోనని సిగ్గుతో చచ్చిపోతున్నా.



Click it and Unblock the Notifications
