Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
నన్ను పెళ్లి చేసుకుని ఇంకొకడితో వెళ్లిపోయింది.. మళ్లీ ఇప్పుడు వస్తానంటోంది #mystory190
నా జీవితం తను నాశనం చేసి వెళ్లిపోయింది. నేను కుమిలిపోయాను. అలా నన్ను పెళ్లి చేసుకుని నాతో బాబును కని ఇంకొకడితో వెళ్లిపోయింది. భార్య మోసం, మోసం చేసిన భార్య, ప్రియురాలి మోసం.
నా పేరు విజయ్. నా డిగ్రీ పూర్తవ్వగానే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. చిన్న వయస్సులో జాబ్ రావడంతో అందరూ నన్ను మెచ్చుకున్నారు. మా బంధువుల్లో నాకు మంచి పేరుంది. దీంతో మా బంధువుల్లో చాలా మంది నాకు అమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యడానికి రెడీ అయ్యారు. అందులో భాగంగానే మహేశ్వరి సంబంధం కూడా వచ్చింది.

పెళ్లి బాగా ఘనంగా జరిగింది
మా పెళ్లి బాగా ఘనంగా జరిగింది. నేను నా భార్యను చాలా బాగా చూసుకునేవాణ్ని. మా అన్యోన్యానికి గుర్తుగా ఒక బాబు పుట్టాడు. ఇద్దరం ఎలాంటి గొడవలు లేకుంా హాయిగా బతికేవాళ్లం. మా కాపురంలో ఎప్పుడూ ఏ కలహాలు రాలేదు. నా భార్యకు నేనంటే ప్రాణం అనుకున్నాను. కానీ అది అబద్దమని తెలిసేసరికి నా ప్రాణం పోయినంత పనైంది.

ప్రవర్తన మారిపోయింది
బాబు పుట్టిన తర్వాత మహేశ్వరి ప్రవర్తన మారిపోయింది. నాతో చిన్నచిన్న విషయాలకే గొడవ పెట్టుకునేది. మొదట్లో నన్ను ఎంతో ప్రేమించే నా భార్య తీరులో తర్వాత చాలా మార్పు వచ్చింది. మొదట్లో నువ్వు నాతో ఉంటే చాలు.. నాకు గంటలు కూడా సెకన్ల మాదిరిగానే గడిచిపోతాయనేది.

చాలా మండిపడేది
ఆ తర్వాత నేను తన పక్కకు వెళ్తే చాలా మండిపడేది. ఎప్పుడూ ఫోన్ చూసుకుంటూ ఉండేది. యూట్యూబ్ లో వంటల వీడియోలు చూసేది. సరే అలా అయినా తనకు కాలాక్షేపం అవుతుంది కదా అని నేను కూడా ఏమీ అనేవాణ్ని కాదు.

ఫోన్లు మాట్లాడేది
అయితే తను నాకు తెలియకుండా ఫోన్లు మాట్లాడేది. గంటల తరబడి చాటింగ్ లు చేసేది. బాబును కూడా సరిగ్గా పట్టించుకునేది కాదు. ఇరవై నాలుగు గంటలు ఫోన్ తోనే గడిపేది. తను ఎవరితో చాటింగ్ చేస్తుంది.. ఎవరితో ఫోన్లో మాట్లాడుతుందనే విషయాలను నేను ఆరా తీశాను.

బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు
మహేశ్వరికి నాతో పెళ్లికాకముందే ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. వారిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులట. వారి ఇద్దరూ చాలా ఏళ్లుగా ప్రేమించుకున్నారట. అయితే వారి ప్రేమను పెద్దలు ఒప్పులేదట. దీంతో మహేశ్వరి తన బాయ్ ఫ్రెండ్ తో లేచిపోవడానికి కూడా ప్లాన్ వేసిందట.

పరువు పోతుందని
తన కూతురు లేచిపోతే ఎక్కడ పరువు పోతుందోనని మహేశ్వరిని అప్పటికప్పుడు నాకిచ్చి పెళ్లి చేశారు. ఈ విషయం నాకు తెలియదు. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే మహేశ్వరి నాన్న చనిపోతానని బెదిరించడంతో ఆమె తప్పని పరిస్థితుల్లో నన్ను పెళ్లి చేసుకుందని తెలిసింది.

బాబు పుట్టిన తర్వాత
మహేశ్వరి ప్రెగ్నెంట్ అయ్యాక పుట్టినింటికి వెళ్లింది. అక్కడ మళ్లీ మహేశ్వరి బాయ్ ఫ్రెండ్ రోజూ ఫోన్‌లో మాట్లాడడం మొదలుపెట్టాడు. బాబు పుట్టిన తర్వాత తను నా దగ్గరకు వచ్చింది. ఇక్కడికి వచ్చాక కూడా రోజూ తను ఫోన్లో చాటింగ్ చేసేది. ఈ విషయాలన్నీ తెలియడంతో నేను నా భార్యను ఒకరోజు నిలదీశాను.

తనకు ప్రాణమని చెప్పింది
నీకు ఇప్పుడు నాతో పెళ్లి అయ్యింది. నువ్వు ఇలా చేస్తే ఎలా అని అన్నాను. అయినా మనకు బాబు కూడా విన్నాడు. ఇప్పటికైనా నీ ప్రవర్తన మార్చుకో అన్నాను. తను వినలేదు. పైగా తన బాయ్ ఫ్రెండ్ తనకోసం మ్యారేజీ కూడా చేసుకోలేదని అతడంటే తనకు ప్రాణమని చెప్పింది.

డైరెక్ట్ గా ఇంటికే పిలిపించుకుని
నాకు నీతో కాపురం చెయ్యడం ఇష్టం లేదు అంది. నన్ను వదలిపెట్టేసెయ్ అంది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అని చెప్పింది. తర్వాత బాబును తీసుకొని పుట్టింటికి వెళ్లింది. ఊర్లో తను, తన బయ్ ఫ్రెండ్ ని డైరెక్ట్ గా ఇంటికే పిలిపించుకుని మాట్లాడుతుందని నాకు తెలిసింది.

నేనే ఊరెళ్లాను
తర్వాత నేను పెద్దలతో మాట్లాడి ఆమెను మళ్లీ నా ఇంటికి తీసుకొచ్చాను. కొన్నాళ్లు నాతో బాగానే ఉంది. తర్వాత మళ్లీ చెప్పకుండా ఊరిళ్లిపోయింది. ఎన్ని రోజులైనా తిరిగి రాలేదు. ఫోన్ చేసినా వస్తానులే అంటూ దాటవేసింది. నేనే ఊరెళ్లాను. ఎందుకిలా చేస్తున్నావంటూ అడిగాను.

నన్ను పట్టించుకోలేదు
తను ఏమీ రిప్లై ఇవ్వలేదు. నన్ను పట్టించుకోలేదు. తర్వాత నేను బయటకు వెళ్లి సిగరెట్ తెచ్చుకుందామనుకున్నాను. వెళ్తుంటే ఒక గ్యాంగ్ నాపై అటాక్ చేసింది. కానీ చుట్టుపక్కన అందరూ తెలిసిన వారే ఉండడంతో నన్ను కాపాడారు.ప్రమాదాన్ని తప్పించుకున్నాను.

పంచాయతీ పెట్టించాను
అయితే ఆ గ్యాంగ్ నా భార్య ప్రియుడుకు సంబంధించినది అని తెలిసింది. తర్వాత పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించాను. తను నాకు విడాకులు ఇచ్చి తన ప్రియుడితో వెళ్లిపోతానని నాతో చెప్పింది. నాకు ఏమీ అర్థం కాలేదు.నేను ఎంత చెప్పినా నాతో ఉండటానికి తను ఒప్పుకోలేదు. పెద్దలు కూడా ఎవరూ ఏమీ చేయలేకపోయారు.
బాబును నాకు అప్పగించి తను అతనితో వెళ్లిపోయింది. కొన్నాళ్లు నేను ఇంట్లో నుంచి బయటకు రాలేకపోయాను.

నా ఇల్లు ఏమీ ధర్మసత్రంకాదు
నా జీవితం తను నాశనం చేసి వెళ్లిపోయింది. నేను కుమిలిపోయాను. అలా నన్ను పెళ్లి చేసుకుని నాతో బాబును కని ఇంకొకడితో వెళ్లిపోయింది. మహేశ్వరిని ఆమె ప్రియుడి కొన్ని రోజులు బాగా యూజ్ చేసుకున్నాడు. తర్వాత అతను ప్లేట్ ఫిరాయించాడు. మహేశ్వరిని మోసం చేసి ఎటో వెళ్లిపోయాడు. మహేశ్వరికి బుద్ది వచ్చింది. మళ్లీ ఇప్పుడు తను నా దగ్గరకు వస్తానంటోంది. అయినా నా ఇల్లు ఏమీ ధర్మసత్రంకాదు కదా. అలాంటి అమ్మాయికి మళ్లీ ఆశ్రయం ఇవ్వడానికి.



Click it and Unblock the Notifications











