For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆమెను డైరెక్ట్ గా అది అడిగాను.. మూతి మీద కొడతా.. ముప్పై రెండు పళ్లు రాలిపోతాయంది - #mystory187

నేను మాత్రం ముందుకు కదలకుండా అక్కడే నిలబడ్డాను. నాలో నేనే ఏదో గొణుక్కుంటూ ఉన్నా. తనకు చెప్పాలనుకుంటున్న విషయం ఎలా చెప్పాలో తెలీట్లేదు. ఆమెను డైరెక్ట్ గా అది అడిగాను.. మూతి మీద కొడతా అంది.

|

నాకు నాటకాలంటే ఇప్పటికీ కాస్త పిచ్చి. సినిమాల కాలం నడుస్తున్న ఈ కాలంలో నీలాంటి పిచ్చోళ్లు ఉంటారా అని మీరు అనుకోవొచ్చు. అవునండీ.. నాకు నిజంగా నాటకాలంటే పిచ్చి. అందుకే నేను థియేటర్ ఆర్ట్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను.

రవీంద్ర భారతి

రవీంద్ర భారతి

ఇక మా యూనివర్సిటీకి సమీపంలోనే రవీంద్ర భారతి ఉంటుంది. దీంతో నేను ఎప్పుడూ వీలైతే అప్పుడు అక్కడ వెళ్లి కూర్చొనేవాణ్ని. చివరకు నాటకాలతో పాటు ఎవరూ రవీంద్ర భారతిలో సమావేశం నిర్వహించినా కూడా అటెండ్ అయ్యేవాణ్ని.

నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు

నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు

ఒక రోజు ఒక మంచి నాటకాన్ని రవీంద్ర భారతిలో ప్రదర్శిస్తున్నారు. లాస్ట్ మినిట్ లో నా ఫ్రెండ్ నాటకం చూడడానికి వస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చాడు. దీంతో నా దగ్గర ఒక పాస్ అలాగే ఉండిపోయింది. రవీంద్ర భారతి బయట ఒక అమ్మాయి కనిపించింది.

అనుకున్నది రివర్స్

అనుకున్నది రివర్స్

చూస్తే చాలా పాష్ గా ఉంది. ఈ అమ్మాయి ఏం నాటకాలు చూస్తదిలే అనుకున్నా. కానీ నేను అనుకున్నది రివర్స్ అయ్యింది. నా చేతిలో ఉన్న పాస్ చూసిందేమో... ఆమె నా దగ్గరకు వచ్చి ఏమండీ నాకు ఈ నాటకం చూడాలని ఉంది. పాస్ ఉంటేనే లోనికి ఎంట్రెన్స్ అంటున్నారు.. మీకు ఏమైనా తెలిసిన వారు ఉన్నారా అంది.

కాస్త డ్రామా

కాస్త డ్రామా

మనం అంత ఈజీగా ఇచ్చేస్తే బాగుండదు కదా. అందుకే కా

స్త డ్రామా నడిపాను. చాలా కష్టమండీ అంటూ ఏవేవో క

థలు చెప్పాను. ఇక లాభం లేదనుకుని వెళ్లిపోతున్న ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి ఒక పాస్ ఇచ్చాను.

బైక్‌ మీద డ్రాప్‌ చేస్తా

బైక్‌ మీద డ్రాప్‌ చేస్తా

మొత్తానికి లోనికి వెళ్లి సీట్లో పక్కపక్కన కూర్చొన్నాం. మధ్యమధ్యలో భావోద్వేగాలకు గురయ్యాం. చివరకు నాటకం అయిపోయింది. బయటకొచ్చాం. సో మీరుండేదీ.. అమీర్ పేట్ కదా అన్నాను. అవునంది. నేనుండేదీ అక్కడే.. మైత్రివనం అన్నాను. మీకు అభ్యంతరం లేకపోతే నా బైక్‌ మీద డ్రాప్‌ చేస్తా అన్నాను. పర్లేదు. నే వెళ్తా అంది. మళ్లీ ఏమనుకుందో, వెనక్కి తిరిగి, సరే పదా వెళ్దాం అంది సిగ్గుపడుతూ.

నాకు బైక్‌ లేదు

నాకు బైక్‌ లేదు

నేను మాత్రం ముందుకు కదలకుండా అక్కడే నిలబడ్డాను. నాలో నేనే ఏదో గొణుక్కుంటూ ఉన్నా. తనకు చెప్పాలనుకుంటున్న విషయం ఎలా చెప్పాలో తెలీట్లేదు. మీకో విషయం చెప్పాలి... నాకు బైక్‌ లేదు. బస్‌ ఎక్కొచ్చా...అని బస్ పాస్ చూపించా. తను గట్టిగా నవ్వింది. మరి లిఫ్ట్‌ ఎలా ఇస్తానన్నారని అడిగింది. ఏదో సినిమాల్లో మాదిరిగా అడిగాను. రొమాంటిక్‌గా ఉంటుందనీ అన్నాను.

చిన్నగా నవ్వింది

చిన్నగా నవ్వింది

సరే.. నా స్కూటీ మీద వెళ్దాం.. పదండీ అంది. సరే పదా అన్నాను. కాసేపయ్యాక నాకో డౌట్‌ వచ్చింది. మీ దగ్గర స్కూటీ ఉంటే మరీ.. నా బైక్‌ ఎక్కుతా అన్నారు కదా అన్నాను. తను సిగ్గుపడుతూ చిన్నగా నవ్వింది. నేను కూడా నవ్వాను.

శ్రావణి అట

శ్రావణి అట

తన స్కూటీపై ఇద్దరం వెళ్తున్నాం. కొద్దిసేపు ఇద్దరం ఏం మాట్లాడుకోలేదు. ఇలా కాదని ఆ నిశ్శబ్దాన్ని నేనే బద్దలు కొడుతూ మాటలు కలిపాను. మీరుండేది అమీర్ పేట్... నేనుండేది మైత్రివనం. కానీ మీ పేరింకా నాకు తెలీలేదండీ అన్నాను. శ్రావణి అని చెప్పింది. వావ్ నైస్‌ నేమ్‌ అన్నాను.

పేరుదేముంది

పేరుదేముంది

ఏం బావుందీ.. నా పూర్తి పేరు తెలుసా నీకు అంది చెప్పు అన్నాను. శ్రీ శ్రావణ సుబ్రహ్మణ్య శ్రావణి అంది. తనకు అసలు ఆ పేరే నచ్చదని చెప్పింది ఆ అమ్మాయి. అయినా పేరుదేముంది? వదిలేసేయండి అన్నాను.

నాటాకాలు అంటే ఎందకంత పిచ్చి

నాటాకాలు అంటే ఎందకంత పిచ్చి

నీకో విషయం చెప్పనా? నాది హైదరాబాద్ కాదు. మాది వైజాగ్. ఇక నాకు ఏ బాయ్‌ఫ్రెండూ లేడు. ఇక్కడ చిన్న పని ఉంటే వచ్చాను. వారంలో వెళ్లిపోతాను అంది. కానీ నాకు హైదరాబాద్ అంతా తెలుసు. మరి రవీంద్ర భారతికి వచ్చారు.. నాటాకాలు అంటే ఎందకంత పిచ్చి అని అడిగాను.

నా ఫ్రెండ్ స్కూటీ తీసుకుని

నా ఫ్రెండ్ స్కూటీ తీసుకుని

నాకు చిన్నప్పటి నుంచి నాటకాలు అంటే చాలా ఇష్టం. ఈ రోజు మా ఫ్రెండ్స్ మొత్తం సినిమాకు వెళ్లారు. ఎవరూ నాటకం చూడడానికి రాలేదు. నేను నా ఫ్రెండ్ స్కూటీ తీసుకుని రవీంద్ర భారతికి వచ్చాను. కానీ నేను నాటకం గురించి చాలా చదివాను. అందుకే వచ్చాను అంది.

ఇటు వెళ్లిపోతా

ఇటు వెళ్లిపోతా

మాది హైద్రాబాదే.. నేను ఇక్కడే పుట్టా. ఇక్కేడ పెరిగా అని చెప్పాను. నీక్కూడా గర్ల్‌ఫ్రెండ్‌ లేదు కదా అని అడిగింది. కొన్ని క్షణాల ముందు వరకు నాకు గర్ల్‌ఫ్రెండ్‌ లేదండీ. కానీ అని చెప్పేలోపే.. ఒకే అండీ మీరు ఇక్కడ దిగండి నేను ఇటు వెళ్లిపోతా అంది... స్కూటీ ఆపేస్తూ.

వైజాగ్ వెళ్లిపోతుందేమో అనుకునే టైమ్‌లో

వైజాగ్ వెళ్లిపోతుందేమో అనుకునే టైమ్‌లో

మా పేర్లు తెలుసుకోవడం దగ్గర్నుంచి, ఇష్టాల్ని పంచుకునేవరకూ, ఆ ఇష్టాలను కలిసి ఆస్వాదించేవరకూ ఇద్దరం వచ్చేశాం. వారం రోజులు అయిపోతే తను వైజాగ్ వెళ్లిపోతుందేమో అనుకునే టైమ్‌లో నేను శ్రావణకి

అసలు విషయం చెప్పాలనుకున్నా. ఒక రోజు డిన్నర్‌కి పిలిచాను.

నేనేమైనా కొడతానా

నేనేమైనా కొడతానా

ఇంతకీ ఏదో చెప్పాలన్నావ్.. ఏంటీ అని అడిగింది శ్రావణి. నేను చాలా సేపు చెప్పకుండా జంకుతూ ఉండిపోయాను.

కమాన్‌.. చెప్పేసెయ్.. నేనేమైనా కొడతానా అంది. నేను గట్టిగా ఊపిరి పీల్చుకొని, డూ యూ లవ్‌ మీ శ్రావణి అని అనడిగాడు.

మూతి మీద కొడతాను

మూతి మీద కొడతాను

మూతి మీద కొడతాను.. ముప్పై రెండు పళ్లు రాలిపోతాయి అంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నాను. నాకు నీ వ్యక్తిత్వం నచ్చింది అంత మాత్రానా నేను నిన్ను ప్రేమించలేను కదా అంది. అంటే నేను జస్ట్‌ ఫ్రెండ్‌నా? అని అడిగాను. పోనీ బెస్ట్‌ఫ్రెండ్‌ అనుకో అంది.

టచ్‌లోనే ఉందాం

టచ్‌లోనే ఉందాం

మరి ఇప్పుడు మనమేం చేద్దామంటావ్‌? అని అన్నాను. టచ్‌లోనే ఉందాం అంది. నాకు కోపం వచ్చింది. మరి నాతో ఈ వారం పాటు బాగానే షికార్లు చేశావు కదా అన్నాను. దీంతో శ్రావణి కోపంగా అక్కణ్నుంచి లేచెళ్లిపోయింది. ఎంత బతిమిలాడినా వినిపించుకోలేదు. తర్వాత తాను వైజాగ్ వెళ్లిపోయింది. తను నాకు ఇచ్చిన నంబర్ ను తీసేసింది.

కొన్ని లక్షల సార్లు నేను గుర్తొచ్చానంటా

కొన్ని లక్షల సార్లు నేను గుర్తొచ్చానంటా

అలా ఇద్దరి మధ్య పెరిగిన దూరం నాకు తనపై ఉన్న ప్రేమను మరింత ఎక్కువ చేసింది. ఏడాది తర్వాత వైజాగ్ లో ఒక పెళ్లిలో తను మళ్లీ కలిసింది. ఈ ఏడాదిలో కొన్ని లక్షల సార్లు తనకు నేను గుర్తొచ్చానంటా. కోపంలో తను నా నంబర్ తీసుకోలేదు.. నాకు తను నంబర్ ఇవ్వలేదు. కానీ మా మధ్య ప్రేమ మాత్రం నిస్వార్థం లేకుండా పుట్టింది. మొదట నా ప్రేమను తను అర్థం చేసుకోలేకపోయింది. కానీ తర్వాత అర్థం చేసుకోగలిగింది. తన అభిరుచులు నా అభిరుచులు ఒక్కటే కావడంతో మేమిద్దరం మళ్లీ ఈజీగా కలిసిపోయాం. త్వరలో పెళ్లి చేసుకోవాలి.

English summary

she doesn't understand my love

she doesn't understand my love
Story first published:Friday, June 8, 2018, 11:17 [IST]
Desktop Bottom Promotion