For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భార్యల చేష్టలు ఏ విధంగా వివాహ వినాశనానికి దారితీస్తాయి?

భార్యల చేష్టలు ఏ విధంగా వివాహ వినాశనానికి దారితీస్తాయి?

|

స్త్రీల విషయానికొస్తే, వారిలోని కొన్ని ప్రాధమిక అంశాలలో లోపం వలన వివాహబంధం నాశనం అవుతుంది. వివాహ బంధాన్ని పదికాలాల పాటు పదిలంగా నిలిపి ఉంచుకోవడానికి, భార్య తన వంతు పాత్రను పోషించడంలో జాగరూకత వహించాలి.

భార్య కారణంగా ఒక బంధం నాశనమవ్వబోతుందని తెలిపే కొన్ని సూచనలను గురించి ఈ వ్యాసంలో మీకు తెలియజేయబోతున్నాం.

ఒక సంసారం యొక్క పతనానికి భర్తతో పాటు భార్య కూడా సమాన బాధ్యతను కలిగిఉంటుంది.

ఇప్పుడు మనం భార్యలు చేసే ఎటువంటి తప్పులు, ఒక పచ్చని సంసారంలో చిచ్చుపెడతాయో తెలుసుకుందాం! దీని మూలాలను తెలుసుకోవడానికి చదవడం మొదలుపెట్టండి.

1. అవాస్తవిక అంచనాలు:

1. అవాస్తవిక అంచనాలు:

భార్యలకు తమ వివాహ బంధంపై రెండు రకాల అంచనాలు ఉంటాయి. మొదటివి న్యాయంగా మరియు నిజాయితీతో కూడుకుని ఉంటాయి, రెండోవి అసంబద్ధంగా మరియు అవాస్తవికంగా ఉంటాయి.

ఈ రెండవ రకమైన అంచనాల మూలంగా బంధం బీటలువారుతుంది. ఎదుటివ్యక్తి పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ, అందుకు తగ్గట్టు అతని ప్రవర్తన లేదంటూ, పదేపదే అసహనం వ్యక్తం చేయడం వలన ఒక వివాహం తొందరగా నాశనమవుతుంది. అతను మీ అంచనాలను అందుకోలేకపోతే , అతనితో కలిసి కూర్చుని చర్చించి వాస్తవ స్థితిగతులను గమనించండి. మీ అంచనాలు మీ స్థాయి తగ్గట్లు కుదించుకుంటే ఆనందం మీ వాకిట్లోనే ఉంటుంది. వాస్తవాలను గుర్తించి, అందుకు తగిన అంచనాలను ఏర్పరుచుకుంటే, సమస్యలు మన చెంత చేరవు.

మీ భాగస్వామి మిమ్మల్ని సంతోషపెట్టాలని ఆశిస్తుంటే, అది మీ అమాయకత్వాన్ని తెలియజేస్తుంది. ఆనందం మరియు దుఃఖం అనేవి మీ ఆలోచన సరళిని అనుసరించి, మీకు మీరుగా కలుగ చేసుకునే భావనలు మాత్రమే! మీ భర్త మీకు పరిపూర్ణతను మరియు శాశ్వతమైన ఆనందాన్ని అందజేయాలని ఆశిస్తున్నట్లయితే, మీరు అతని ఓటమికి రంగం సిద్ధం చేస్తున్నట్లు మాత్రమే కాదు, మిమ్మల్ని మీరు నిరుత్సాహపరచుకోబోతున్నారని కూడా అర్ధం. ఇటువంటి అవాస్తవిక అంచనాలను ఏర్పరచుకుంటే, దాని ఫలితాలు అత్యంత దారుణంగా ఉంటాయి.

2. వ్యంగ్యంగా వ్యవహరిస్తూ ప్రతికూలమైన చేష్టలు మరియు భావాలను వ్యక్తీకరించడం:

2. వ్యంగ్యంగా వ్యవహరిస్తూ ప్రతికూలమైన చేష్టలు మరియు భావాలను వ్యక్తీకరించడం:

హాస్యచతురత మరియు వ్యంగ్య ధోరణి కలిగి ఉండటం మంచిదే, కాని మీ భాగస్వామి ఆత్మన్యూన్యతకు లోనై ఉన్నప్పుడు వ్యంగ్యంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు. ఇలా చేయడం వలన మీరు అతనిని లేదా అతని అభిప్రాయాలను గౌరవించడం లేదని సులువుగా గుర్తించవచ్చు. పురుషులు తమపై వెల్లువెత్తే విమర్శలను ప్రతికూలంగా తీసుకుంటారు. అటువంటి భార్యతో తమ అంతరంగాన్ని పంచుకోవడానికి ఇష్టపడరు. ఇటువంటి కారణాల వలనే వివాహేతర సంబంధాలను కోరుకుంటారు. మీరు మీ భర్త పట్ల వ్యంగ్య మరియు విమర్శనాత్మక ధోరణితో వ్యవహరిస్తున్నప్పుడు, వారు తమకు తగిన గౌరవమర్యాదలు లభించట్లేదని భావిస్తారు.

మీ వ్యంగ్యాత్మకమైన ముఖ కవళికలు లేదా కళ్ళను తిప్పడం అతనిపై ఉన్న అగౌరవాన్ని సూచిస్తాయి. ముఖాన్ని పదేపదే చికాకుగా పెట్టడం వలన మీ భర్త అసహనానికి గురవుతారు. ఏదైనా తప్పు జరిగి ఉంటే, అతనితో పరుషంగా ప్రవర్తించడం కన్నా చర్చిండం మేలని అతను భావిస్తాడు. వివాహంలో మీరెప్పుడు బంధాన్ని కూలదోయడానికంటే కూడా నిలిపిఉంచుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సునాయాసంగా మీ సమస్యలను పరిష్కరించుకోవాలంటే, మాట్లాడుకుని, చర్చించుకుని, తప్పును సరిదిద్దుకోవడమే సరైన పద్దతి. భార్యలు తామెల్లప్పుడూ ఆకర్షణ కేంద్రంగా ఉండాలని కోరుకుంటారు కనుక సులువుగా సమసిపోయే గొడవలను కూడా పెద్ద అంశంగా మారుస్తారు.

3. మీ భర్తతో సన్నిహితంగా మెలగకపోవడం:

3. మీ భర్తతో సన్నిహితంగా మెలగకపోవడం:

కొన్ని సమయాలలో భార్యలు తమ భర్తలతో సన్నిహితంగా లేదా ఏకాంతంగా గడపడానికి ఆసక్తి చూపించకపోవడం, వారి మధ్య అవాంతరాలకు దారితీస్తుంది.. ఇటువంటి సందర్భాలలో, భర్త తన భార్య పట్ల కామోద్రేకాన్ని ప్రదర్శించడు. ఈ కారణం వలన వారిద్దరి మధ్య పూడ్చుకోలేని అగాధం ఏర్పడుతుంది. వివాహమనే శిఖరం కుప్పకూలిపోతుంది. పురుషులు శృంగార సాన్నిహిత్యం ద్వారా భౌతిక ఒత్తిడికి దూరమవ్వాలని కోరుకుంటారు. అతని ఈ కనీస అవసరాన్ని మీరు గుర్తించకపోతే, మీ మధ్య దూరం పెరుగుతుంది. మీరు మీ భర్త అవసరాలను కనిపెట్టుకోలేకపోతే, అది అతని పట్ల, అతని అవసరాల పట్ల మీకు గౌరవం లేదని తెలియజేస్తుంది. మీరు ఎలా అయితే అతని నుండి భావోద్వేగపరమైన మద్దతును ఆశిస్తారో, అతను కూడా మీ నుండి శృంగారపరమైన మద్దతును ఆశిస్తారు. ఈ విధంగా ఆయన ఆలోచన ధోరణి ఉంటుంది.

4. మీ భర్తతో మీరు ఆనందంగా లేకపోవడం:

4. మీ భర్తతో మీరు ఆనందంగా లేకపోవడం:

మిమ్మల్ని మీరు మీ భర్త సాంగత్యంలో ఆనందంగా లేనట్లు చిత్రీకరించుకుంటే, మీ వివాహ బంధం అంతమైనట్లే! మీరు, మీ భాగస్వామి అటువంటి బంధానికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమయినట్లే! మీ భర్తను ప్రతి విషయానికి నిష్టూరమాడటం వలన అతను మీరిద్దరూ కలిసి నిర్మించుకున్న కాపురం పై అతను ఆసక్తిని కోల్పోతాడు. మీ కలిగే అన్నిరకాల అసంతృప్తులకి అతన్నే కారణం చేయటం వలన, మీ వివాహ బంధం ముగిసిపోతుంది.

English summary

THINGS THAT WIVES DO THAT DESTROYS THEIR MARRIAGE

THINGS THAT WIVES DO THAT DESTROYS THEIR MARRIAGE,A woman can make or break a house. We see a lot of trouble coming our way if there is no stability. Things that wives do that destroys their marriage.
Story first published:Tuesday, May 8, 2018, 17:45 [IST]
Desktop Bottom Promotion