మేడం ఒక్క బీర్ తాగు అన్నాడు అజయ్.. మూడు బీర్లు తాగాను, సెక్స్ గురించి మాట్లాడుకున్నాం- My Story #101

Written By:
Subscribe to Boldsky

నాకు పెళ్లి అయిన తర్వాత ఒక్కసారైనా మంచి ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకున్నాను. నేను బ్యాంక్ ఎంప్లాయిని. మా ఆయన కూడా బ్యాంక్ ఎంప్లాయ్. అయితే మా ఆయన ప్రైవేట్ బ్యాంక్ లో పని చేస్తాడు కాబట్టి ఆయనకు కాస్త ఎక్కువగా ప్రెజర్ ఉంటుంది. మా బ్యాంక్ అలా కాదు కాబట్టి నాకు అంతగా ఉండదు.

ఖండాలకు వెళ్లాలని ఉండేది

ఖండాలకు వెళ్లాలని ఉండేది

అయితే నాకు ఎన్నో రోజుల నుంచి ఖండాలాకు వెళ్లాలని ఉండేది. మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉండే ఈ ప్రాంతం అంటే నాకు బాగా ఇష్టం. ముంబైకి 101 కిలోమీటర్ల దూరంలో ఉండే ఖండాలకు చాలా సార్లు ప్లాన్ చేశాను కానీ వెళ్లలేకపోయాను.

మా ఆయనతో వెళ్లాలనుకున్నా

మా ఆయనతో వెళ్లాలనుకున్నా

ఖండాలా హిల్‌ స్టేషన్‌ గురించి నా ఫ్రెండ్స్ చాలా గొప్పగా చెప్పేవారు. నేను మా ఆయనతో అక్కడికి టూర్ ప్లాన్ చేద్దామనుకున్నాను. అయితే కుదరలేదు.

వీలు ఉండేది కాదు

వీలు ఉండేది కాదు

ఖండాలాతో పాటు లోనవాలాకు వెళ్లాలని నాకు ఎప్పటి నుంచో ఉండేది. లోనవాలా కూడా అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ విషయాలన్నీ తెలుసుగానీ అక్కడికి వెళ్లేందుకు వీలుకాకుండా ఉంది.

ఒక్కదాన్నే వెళ్తాను

ఒక్కదాన్నే వెళ్తాను

ఇక ఈ సారి ఎలా అయినా సరే ఖండాలాకు ప్లాన్ చేద్దామని నిర్ణయించుకున్నాను. ఆఫీస్ లో లీవ్ అడిగాను. బాస్ ఒకే అన్నాడు.

మా ఆయనను కూడా లీవ్ అడగమని చెప్పాను. తనకు కుదరదన్నాడు. నేను ఒక్కదాన్నే వెళ్తానని చెప్పాను. ఫస్ట్ కాస్త ఆలోచించాడు. తర్వాత ఒకే అన్నాడు.

పూణే వరకు ఫ్లైట్ లో

పూణే వరకు ఫ్లైట్ లో

హైదరాబాద్ నుంచి ఖండాలాకు బయల్దేరాను. హైదరాబాద్ నుంచి పూణే వరకు విమానంలో వెళ్లాను. పూనే నుంచి ట్రైన్ లో (69 కిలోమీటర్లు) లోనవాలాకు వెళ్లాను. లోనవాలా నుంచి ముంబై చేరేందుకు కేవలం 3 గంటల సమయం పడుతుంది.

రైలు ప్రయాణం సూపర్

రైలు ప్రయాణం సూపర్

అదే విధంగా లోనవాలా నుంచి పూనే వెళ్లాలంటే మాత్రం నాలుగు గంటలు ప్రయాణించాలి. ఈ మార్గంలో రైలు ప్రయాణం అంటే మాటల్లో వర్ణించలేం. ఎవరికి వారు ఆస్వాదించాల్సిందే.

అందాలను చూసి

అందాలను చూసి

ఇక ఖండాలకు వెళ్లాక అక్కడి అందాలను చూసి నన్ను నేను మరిచిపోయాను. నాకు తోడుగా ఎవ్వరైనా ఉండి ఉంటే ఎంత బాగుండు అనిపించింది. ఖండాలా గుహలు చూస్తే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. చాలా అందంగా ఉంటాయి అవి.

ఖండాలా అదిరిపోయింది

ఖండాలా అదిరిపోయింది

ప్రకృతి సౌందర్యం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. కళ్లు తిరిగే లోయలు ఓవైపు, ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉండే పర్వతాలు మరోవైపు చూసి నన్ను నేను మరిచిపోయాను. లెక్కలేనన్ని ప్రకృతి సౌందర్య విశేషాలతో ఖండాలా అదిరిపోయింది.

అక్కడే స్వేచ్చగా

అక్కడే స్వేచ్చగా

నా మొబైల్ ఛార్జింగ్ కూడా సరిగ్గా లేదు. నెట్ వర్క్ సరిగ్గా రావడం లేదు. అయినా అన్నీ మరిచిపోయి నేను అక్కడ స్వేచ్ఛగా గడపాలని డిసైడ్ అయ్యాను.

అజయ్ పరిచయం

అజయ్ పరిచయం

ఆ సమయంలో నాకు ఖండాలాలో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. అతని పేరు అజయ్. తనది విజయవాడనట. తను కూడా ఒంటిరిగానే వచ్చాడు. ఇద్దరి అభిరుచులు ఒక్కటే కావడంతో కొద్ది సేపట్లోనే ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం.

హోటల్ లో రూమ్ తీసుకున్నాం

హోటల్ లో రూమ్ తీసుకున్నాం

అజయ్ నాకు అక్కడ పరిచయం కావడం చాలా మేలు అయ్యింది. ఇద్దరం ప్రతి క్షణం ఎంజాయ్ చేశాం. సాయంత్రం వరకు అక్కడే ఉన్నాం. బాగా అలిసిపోయాం. అక్కడే హోటల్ లో రూమ్ తీసుకున్నాం.

ఇద్దరం కూర్చొని

ఇద్దరం కూర్చొని

రూమ్ లో ఫ్రెష్ అప్ అయ్యాం. ఇద్దరం కూర్చొని ఒకరి గురించి ఒకరం పూర్తిగా తెలుసుకున్నాం. తను ఒక యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తాడంట. ఎప్పటి నుంచో తను కూడా ఖండాలా చూడాలని అనుకునేవాడంట.

బీర్ తెచ్చుకోవొచ్చా

బీర్ తెచ్చుకోవొచ్చా

అజయ్ కి పెళ్లి కాలేదు. బాగా అలిసిపోయాం.. కాస్త రెస్ట్ తీసుకుందామా అజయ్ అన్నాను. ఒకే అన్నాడు. నేను బయటకు వెళ్లి ఫుడ్ రూమ్ లోనికే పార్సిల్ తీసుకొస్తా అన్నాను. ఒకే అన్నాను. నేను రూమ్ కు బీర్ తెచ్చుకోవొచ్చా అన్నాడు. ఒకే అన్నాను.

కేస్ బీర్లు పట్టుకొచ్చాడు

కేస్ బీర్లు పట్టుకొచ్చాడు

తను ఒకేసారి ఒక బీర్ కేస్ పట్టుకొచ్చాడు. ఏంటి ఇంతలా తెచ్చావ్ అజయ్ అన్నాను. ఇద్దరం తాగుదాం అన్నాడు. నాకు అలవాటు లేదు అన్నాను. ఏం కాదలెండి. ఇక్కడున్న చల్లటి వాతావారణానికి ఒక్క బీర్ కొడితే ఆ కిక్కే వేరుంటుంది అన్నాడు.

ఒక్క బీర్ తో స్టార్ట్ చేశాను

ఒక్క బీర్ తో స్టార్ట్ చేశాను

అతను బాగా ఫోర్స్ చెయ్యడంతో నేను కూడా బీర్ తాగుతూ కంపెనీ ఇచ్చాను. రూమ్ లో మేం ఇద్దమే ఉన్నాం. బీర్ చాలా చేదుగా అనిపించింది. అయినా రుచి చూశాను.

ఇలా చేస్తానని అనుకోలేదు

ఇలా చేస్తానని అనుకోలేదు

అస్సలు నా జీవితంలో నేను ఇలా ఒక పెళ్లికానీ అబ్బాయితో రూమ్ లో ఉంటానని, అతనితో కలిసి బీర్ తాగతానని అస్సలు అనుకోలేదు. నా భర్తకు, ఇంటికి దూరంగా.. తెలియని ఒక మనిషితో తెలియని ప్రదేశంలో కాలం గడపటం చాలా హ్యాపీగా అనిపించింది.

నా కోరిక నెరవేరింది

నా కోరిక నెరవేరింది

ఉద్యోగంలో ఉండే ప్రెజర్ ను తగ్గించుకునేందుకు ఏడాదిలో కనీసం ఒక్కసారైనా ఇంటికి దూరంగా ఉండి ఎంజాయ్ చేయాలనే నా కోరిక ఈ రోజు నెరవేరింది.

నా భర్తతో రాకపోవడానికి కారణం అదే

నా భర్తతో రాకపోవడానికి కారణం అదే

ఇక నా భర్త రాకున్నా కూడా నేను ఇక్కడి రావడానికి కారణం ఆయన అతి జాగ్రత్తనే. మేమిద్దరం ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేస్తే అతని చూపే అతి జాగ్రత్తకు నాకు మండుతుంది. అస్సలు ఒక్క ప్లేస్ ను సరిగ్గా చూడనివ్వడు. అందుకే ఇలా ప్లాన్ చేశాను.

ఫోన్ చేసి టార్చర్ చేస్తాడు

ఫోన్ చేసి టార్చర్ చేస్తాడు

మా ఆయన లేకుండా నేను ప్లాన్ చేసిన నా మొదటి ప్రయాణం ఇది. అయినా నా ఫోన్ ఇప్పుడు పని చెయ్యడం లేదు కాబట్టి నాకు ఫోన్స్ రావడం లేదు. లేదంటే నిమిషానికొకసారి ఫోస్ చేసి ఎక్కడున్నావ్.. ఏం చేస్తున్నావ్ అంటాడు. నన్ను బాగానే ప్రేమిస్తాడు. కానీ మరి అంత అతి పనికిరాదు కదా.

అజయ్ అవాక్కు అయ్యాడు

అజయ్ అవాక్కు అయ్యాడు

నా భర్త గురించి నాలో నేను ఆలోచిస్తూనే ఒక బీర్ తాగేశాను. అజయ్ అవాక్కు అయ్యాడు. ఏంది మేడం మీరూ.. తాగను తాగను అంటూనే మొత్తం బీర్లు లేపి పడేస్తున్నారంటే జోక్ చేశాడు.

మూడు బీర్లతో ముగించాం

మూడు బీర్లతో ముగించాం

తర్వాత రెండో బీర్ స్టార్ట్ చేశాను. ఇద్దరం చెరో మూడు బీర్లు తాగి ముగించేశాం. తర్వాత చికెన్ బిర్యానీ తిన్నాం. అజయ్ తన లవ్ స్టోరీస్ గురించి చెప్పాడు. ఇద్దరం చాలా క్లోజ్ అయిపోయాం.

ఆంటీతో ఎంజాయ్

ఆంటీతో ఎంజాయ్

అతని ప్రతి విషయం నాకు చెప్పాడు. అజయ్ పెళ్లి మాత్రమే కాలేదుగానీ మిగతావన్నీ చూసేశాడు. తనకు ఒక ఆంటీతో పరిచయం ఉందట. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆమెతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడట.

నాతో సెక్స్ లో పాల్గొనాలనీ?

నాతో సెక్స్ లో పాల్గొనాలనీ?

అంకుల్ లేనప్పుడల్లా ఆంటీ పిలిపించుకుంటుందట. అలా తన సీక్రెట్స్ మొత్తం చెప్పాడు. నిజానికి అవి అన్నీ నిజంగా జరిగాయో లేదంటే నాతో సెక్స్ లో పాల్గొనాలని ఉంది అని అడగడానికి ఇన్ డైరెక్ట్ గా అలా చెప్పాడో నాకు మొదట అర్థం కాలేదు.

రాత్రి లేచాడు

రాత్రి లేచాడు

ఉదయం లేచి లోనవాలాకు వెళ్లాలని రాత్రి త్వరగానే పడుకున్నాం. అజయ్ రాత్రి పదకొండుకు లేచాడు. నాకు మెలకువ వచ్చింది. నేను బీర్ తాగి పడుకుంటాను అన్నాను. ఒకే అన్నాను.

అజయ్ చెడ్డవాడు కాదు

అజయ్ చెడ్డవాడు కాదు

అజయ్ ఎవరో నాకు తెలియదు. అయినా అతనితో రూమ్ తీసుకుని అంత ధైర్యంగా ఉంటున్నానంటే కారణం అతని నిజాయితీ. నిజంగా అజయ్ చెడ్డవాడు కాదు. తనను మొదటిసారి చూసినప్పుడే నాకు నమ్మకం కలిగింది. అందుకే అతనితో రూమ్ లో ఉండేందుకు ఒకే అన్నాను.

రూమ్ బుక్ చేశాం

రూమ్ బుక్ చేశాం

ఆ రాత్రి మీరనుకున్నట్లుగా నాకు అజయ్ కు మధ్య ఏమి జరగలేదు. ఉదయం లేచాకా లోనవాలాకు బయల్దేరాం. అక్కడ కూడా సేమ్ రిపీట్. రూమ్ బుక్ చేశాం.

సెక్స్ ఆలోచన రాలేదు

సెక్స్ ఆలోచన రాలేదు

బీర్లు తాగాం. ఫుల్ ఎంజాయ్ చేశాం. కానీ ఇద్దరి మనస్సులో సెక్స్ అనే ఆలోచన మాత్రం రాలేదు. అలా ఖండాలా, లోనవాలా ట్రిప్ ను నేను అజయ్ తో ఫుల్ ఎంజాయ్ చేశాను.

English summary

This Is Exactly Why Every Introvert Must Go On A Solo Trip At Least Once In Their Lifetime

this is exactly why every introvert must go on solo trip at least once in their lifetime