Just In
- just now
వైరల్ వీడియో : మందు బాబులం.. మేమే మహారాజులం.. అంటున్న చిన్నారులు..
- 51 min ago
ఆ కార్యంలో కలకాలం కచ్చితంగా సక్సెస్ కావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి...
- 1 hr ago
డయాబెటిస్ ఉంటే పిల్లలు పుట్టే అవకాశం లేదా? మరి పరిష్కారం ఏంటి?
- 3 hrs ago
నిలబడి తినడం ఆరోగ్యానికి మంచిదా? కాదా? మీ సందేహానికి సమాధానం ఇక్కడ ఉంది
Don't Miss
- News
అత్యాచారానికి ఉరిశిక్ష... ఏపి దిశ చట్టానికి క్యాబినెట్ ఆమోదం
- Sports
కారణం తెలియదు!: చెన్నైలో కమల్ హాసన్‌ను కలిసిన డ్వేన్ బ్రావో
- Movies
నాగబాబు చేసిన పనితో ఆ నటుడి కోసం వెతుకుతున్న జబర్ధస్త్ టీమ్.. రీప్లేస్ చేయనిది అందుకే.!
- Technology
బేసిక్ రీఛార్జ్ రూ.49 ప్లాన్‌ను తొలగించించిన జియో
- Finance
అన్నీ ఇచ్చాం: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం షాక్, కొత్త పథకాలతో రెవెన్యూ లోటు పెంచారు!
- Automobiles
కియా సెల్టోస్ ముంబైలోని డీలర్షిప్ యొక్క మొదటి అంతస్తునుండి పడిపోయిన వీడియో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
శారీరక సంబంధం కోరుకునే అబ్బాయిలనే అమ్మాయిలు ఇష్టపడతారా?
ప్రశ్న : నేను బీటెక్ చదువుతున్నాను. నేను హైట్, వెయిట్, వైట్ బాగానే ఉంటాను. నేను ఇంటర్ నుంచి చాలా మంది అమ్మాయిలను ప్రేమలో పడేయడానికి ట్రై చేశాను. కానీ ఏ ఒక్క అమ్మాయి కూడా నాకు పడలేదు.
కానీ కొందరు అబ్బాయిలకు ఒకేసారి ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఫ్లాట్ అవుతున్నారు. అమ్మాయిలతో ఎలా వ్యవహరించాలి? అలాగే అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిల ప్రేమలో పడతారో కూడా తెలపండి. అమ్మాయిల దగ్గర ఎలా నడుచుకోవాలో చెప్పండి. అలాగే శారీరక సంబంధం కోరుకునే అబ్బాయిలనే అమ్మాయిలు ఇష్టపడతారా?

చాలా జాగ్రత్తలు
సమాధానం : ప్రతి అమ్మాయి బాయ్ ఫ్రెండ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కొందరు అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్ చాలా హాట్‌గా ఉండాలని కోరుకుంటారు.

అమ్మాయిలకు కొంత చిరాకు
ముఖ్యంగా స్నేహితులతో మందు కొట్టడం స్నేహితులతో పీకల్లోతు మందు పార్టీలో నిమగ్నమైపోయి కనీసం గర్ల్ ఫ్రెండ్ పక్కనుందనే విషయం పట్టించుకోని అబ్బాయిలంటే అమ్మాయిలకు కొంత చిరాకు.

అశ్లీల శృంగారాలను చూడటం
ఇంట్లో మద్యం సేవించడం ఒక వైపైతే, నలుగురి మధ్యలో తాగి తమ బాయ్ ఫ్రెండ్ అభాసు పాలవడం అమ్మాయిలకు నచ్చదు. అలాగే, రహస్యంగా అశ్లీల శృంగారాలను చూడటం అశ్లీల శృంగారాన్ని వీక్షిస్తున్న తన బాయ్ ఫ్రెండ్‌ని గమనించిన అమ్మాయికి అతనంటే చిరాకు ఏర్పడుతుంది.

షాపింగ్‌కి వెళ్లినపుడు
అలాగే, షాపింగ్‌కి వెళ్లినపుడు బాయ్ ఫ్రెండ్ సహనంగా ఉండాలని అమ్మాయి కోరుకుంటుంది. కానీ, అబ్బాయిఇలా ఉండలేడు కదా, త్వరగా షాపింగ్ పూర్తి చేయాలని తొందర పెడుతుంటాడు. ఈ వ్యవహారశైలిని ఆమె ఏమాత్రం అంగీకరించదు.

శారీరక సంబంధం
ఇకపోతే అమ్మాయిలకు డ్రెస్ సూట్ అయిందా లేదా ఏ డ్రెస్ సూట్ అవుతుంది అని చెప్పడాన్ని ఇష్టపడరు. ఈ అలవాటు అమ్మాయిలకు నచ్చదు. అలాగే, కొంత పరిచయం తర్వాత అబ్బాయిలు శారీరక సంబంధం కోరుతారు. కానీ, అమ్మాయిలకు శారీరక సంబంధం ఎమోషన్‌తో కూడుకున్నది. అందుకే ఇందుకోసం ఆరాటపడే అబ్బాయిలంటే అస్సలు నచ్చరు. కేవలం సెక్స్ కోసం ఆరాటపడే వారంటే అమ్మాయిలకు ఇష్టం ఉండదు.

ఆమెకు నచ్చినట్లుగా వ్యవహరిస్తే
అమ్మాయిలను అర్థం చేసుకోవాలంటే ఎవరితరం కాదు. ఒక్కో అమ్మాయి ఒక్కో మైండ్ సెట్ లో ఉంటుంది. మీరు ఏ అమ్మాయిని అయితే ప్రేమిస్తారో ఆ అమ్మాయి గురించి సంపూర్ణంగా తెలుసుకుని ఆమెకు నచ్చినట్లుగా వ్యవహరిస్తే ఆమె ప్రేమను పొందొచ్చు.

చాలా టెస్ట్ లు పెడుతుంది
అమ్మాయికి నచ్చనట్లుగా ప్రవర్తిస్తే మాత్రం చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. అమ్మాయి ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ను సెలెక్ట్ చేసకోవడానికే అతనికి చాలా టెస్ట్ లు పెడుతుంది. అయితే ఆమె డైరెక్ట్ గా ఏ ప్రశ్నలు అడగదు. నీ ప్రవర్తన తీరును బట్టే నిన్ను అంచనా వేస్తుంది.

నచ్చినట్లుగానే వ్యవహరించాలి
నీపై ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఆమెకు నచ్చితే నిన్ను బాయ్ ఫ్రెండ్ గా అంగీకరిస్తుంది. తర్వాత ప్రేమలో ఉన్నప్పుడు ఆమెకు నచ్చినట్లుగానే వ్యవహరించాలి. లేదంటే మళ్లీ గొడవ మొదలవుతుంది. చివరకు బ్రేకప్ కూడా చెప్పే అవకాశం ఉంది.

సీరియస్‌గా మాట్లాడకూడదు
అలాగే అమ్మాయిల దగ్గర మాత్రం సీరియస్‌గా మాట్లాడకూడదు. టెన్షన్ పడకుండా.. చక్కగా మాట్లాడేస్తే అమ్మాయిలను ఈజీగా బుట్టలో వేసుకోవచ్చు.

సెన్స్ ఆఫ్ హ్యూమర్
ఇంకా అమ్మాయిలను ప్రేమలో పడేయాలంటే.. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న మనిషైతే చాలు. హాస్యం పండించగలగడం.. సెటైర్లు విసరడం.. నిశ్శబద్ధంగా ఉన్నచోట నవ్వులు పూయించడం చేసే వ్యక్తి అంటే మహిళలు పడి చస్తారు.

కబుర్లు చెప్తూ నవ్విస్తే
సెన్స్ ఆఫ్ హ్యూమర్ మీలో ఉంటే మాత్రం మీకు నచ్చిన అమ్మాయి గుండెల్లో మీరు స్థానం సాధించినట్లే. కబుర్లు చెప్తూ.. నవ్విస్తే.. మీరు మీకు నచ్చిన అమ్మాయికి కొత్తగా కనిపిస్తారు.

సొగసైన మాటలు ఉపయోగిస్తూ
సాధారణంగా మాట్లాడే వాళ్లకంటే... తమపై సొగసైన మాటలు ఉపయోగిస్తూ అందమైన భావాలను వ్యక్తీకరించే వాళ్లనే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు. మాంచి కవిత్వాన్ని జోడిస్తూ అమ్మాయిల అందాన్ని పొగిడితే..ఇంక అంతే వాళ్లు మీ ఒడిలో పడిపోతారు.

ముక్కుసూటి మాటలు వద్దు
అమ్మాయిని కలిసినప్పుడు అనవసరమైన మాటలు, ముక్కుసూటి మాటలు మాట్లాడకూడదు. అలా మాట్లాడేవాళ్లంటే అమ్మాయిలకు అస్సలు నచ్చదు. మాట్లాడే మాటలకు కొంచెం సోంపు వేసి మాట్లాడే వాళ్లతోనే ఎక్కువగా గడపడానికి ఇష్టపడతారు.

చదువుపై శ్రద్ధ పెడితే
అయితే చదువుకునే వయస్సులో అమ్మాయిలను ఎలా పడేయాలని అని ఆలోచించే బదులు చదువుపై శ్రద్ధ పెడితే నీ భవిష్యత్తు బాగుంటుంది. ఆ తర్వాత ఏ అమ్మాయి అయినా నీకు పడుతుంది.