For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లాం ఉన్నా రాసలీలలు సాగించే మగవారికన్నా మహ్మద్ చాలా నయం..అతన్నే పెళ్లి చేసుకుంటా- My Story # 112

ఈ కాలంలో చాలామంది మగవారు పెళ్లి చూపులకు వచ్చేటప్పుడు చాలా మంచివారుగా కనపడతారు. పెళ్లి అయిన తర్వాత భార్యను నానా రకాలుగా టార్చర్ చేస్తారు.

|

నా పేరు రెహనా ఖాలిద్, నా వయస్సు 26. నాది పశ్చిమబెంగాల్. నేను డెంటల్ సర్జన్ గా పని చేస్తాను. అవి నేను బీడీఎస్ చదువుతున్న రోజులు. నేను ఒక రోజు ఫోన్ కొందామని మొబైల్ స్టోర్ కు వెళ్లాను. ఆ షాప్ ఓనర్ నాకు నాకు రకరకాల ఫోన్స్ చూపించాడు. ప్రతి ఫోన్ ఫీచర్స్ ను నాకు గంటపాటు ఓపికగా చెప్పాడు.

నిజాయితీగా నిర్వహించే తీరు నచ్చింది

నిజాయితీగా నిర్వహించే తీరు నచ్చింది

నేను కేవలం ఫోన్ చూసి మళ్లీ కొందామనుకున్నాను. కానీ ఒక కస్టమర్ తో అతను మాట్లాడిన తీరు, అతను తన వృత్తిని తన వ్యాపారాన్ని నిజాయితీగా నిర్వహించే తీరు నచ్చి ఫోన్ కొనుకున్నాను.

మహమ్మద్ నదీమ్

మహమ్మద్ నదీమ్

తర్వాత మరుసటి రోజు మళ్లీ అతని షాప్ కు వెళ్లాను. ఫోన్ కు పౌచ్ తీసుకున్నాను. ఆ షాప్ ఓనర్ తో మాటలు కలిపాను. అతని పేరు మహమ్మద్ నదీమ్ అట. చిన్న వయస్సులో బిజినెస్ స్టార్ట్ చేశాడు. సెల్ ఫోన్ వ్యాపారం లో బాగానే సంపాదిస్తున్నాడు.

నంబర్ తీసుకున్నాను

నంబర్ తీసుకున్నాను

తర్వాత నేను మహమ్మద్ నంబర్ తీసుకున్నాను. నాకు ఎప్పుడైనా ఫోన్ బ్యాలెన్స్ అవసరం అయితే ఫోన్ చేస్తాను లేదంటే మెసేజ్ చేస్తాను అన్నాను. సరే మేడం అన్నాడు. మేడం అనొద్దు రెహనా అని పిలువు అని చెప్పాను. ఒకే అన్నాడు.

ఇద్దరం కలిసి సినిమాలకు

ఇద్దరం కలిసి సినిమాలకు

అలా మొబైల్ తో మొదలైన మా పరిచయం తర్వాత చాటింగ్ చేసే వరకు వెళ్లింది. ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. రోజూ చాటింగ్ చేసేవాళ్లం. అప్పుడప్పుడు ఇద్దరం కలిసి సినిమాలకు కూడా వెళ్లేవాళ్లం.

పెళ్లి కూడా చేసుకుంటా

పెళ్లి కూడా చేసుకుంటా

అలా మా మధ్య స్నేహం పెరిగి ప్రేమకు దారి తీసింది. ఒక రోజు మహమ్మద్ నన్ను ప్రేమిస్తున్నానని.. నాకు ఇష్టం ఉంటే పెళ్లి కూడా చేసుకుంటానన్నాడు. నాకు కాస్త సమయం కావాలని చెప్పాను.

నా పెళ్లి ప్రస్తావన

నా పెళ్లి ప్రస్తావన

నాకు కూడా మహమ్మద్ అంటే ఇష్టం. కానీ పెళ్లి అంటే రెండు జీవితాలకు సంబంధించిన విషయం. అందుకే మా ఇంట్లో పెద్దవాళ్లతో నా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాను.

టెన్త్ వరకే చదివాడు

టెన్త్ వరకే చదివాడు

అయితే మహమ్మద్ ను నేను పెళ్లి చేసుకోవడానికి మా ఇంట్లో ఒప్పుకోలేదు. మహ్మద్ టెన్త్ వరకే చదివాడు. మా ఇంట్లో అందరూ డాక్టర్లే. మా నాన్న, అమ్మ, మా అన్నయ్య, వదిన ఇలా అందరూ వైద్యులే.

అన్నీ విషయాలు వివరించాను

అన్నీ విషయాలు వివరించాను

దాంతో మహమ్మద్ ను మా ఇంట్లో వాళ్లు అస్సలు అంగీకరించలేదు. మహ్మద్ గురించి మా వాళ్లకు తెలియక అలా మాట్లాడుతున్నారని అన్నీ విషయాలు వివరించాను. చదువుకున్న ప్రతి అబ్బాయి తాను చేసుకున్న అమ్మాయిని బాగా చూసుకుంటాడని నమ్మకం లేదు కదా నాన్న అన్నాను.

నానా చిత్రహింసలు

నానా చిత్రహింసలు

బాగా చదువుకున్న వారు కూడా పెళ్లాల్ని నానా చిత్రహింసలు పెట్టే విషయాల్ని మనం రోజూ పేపర్లలో చూస్తూనే ఉంటాం. అయితే మహ్మద్ మాత్రం నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు అతన్నే కచ్చితంగా పెళ్లి చేసుకుంటానన్నాను.

డాక్టర్ తో నాకు సంబంధం

డాక్టర్ తో నాకు సంబంధం

అయినా మా వాళ్లు వినడం లేదు. నన్ను చాలా రోజులు ఇంట్లో నిర్బంధించారు. ఒక డాక్టర్ తో నాకు సంబంధం నిశ్చయించారు. ఈ తల్లిదండ్రులు ఎందుకు ఇంత మూర్ఖంగా ఆలోచిస్తారో నాకు అర్థం కావడం లేదు.

అలాంటి భర్త దొరకాలంటే

అలాంటి భర్త దొరకాలంటే

నాకు నిశ్చిర్థార్థం అయ్యినా ఇప్పటికీ నేను మహ్మద్ నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మహ్మద్ లాంటి భర్త దొరకాలంటే ఆమె గత జన్మలో ఏ పుణ్యమో చేసి ఉండాలి.

నానా రకాలుగా టార్చర్ చేస్తారు

నానా రకాలుగా టార్చర్ చేస్తారు

ఈ కాలంలో చాలామంది మగవారు పెళ్లి చూపులకు వచ్చేటప్పుడు చాలా మంచివారుగా కనపడతారు. పెళ్లి అయిన తర్వాత భార్యను నానా రకాలుగా టార్చర్ చేస్తారు. పరాయి ఆడదాన్ని డైరెక్ట్ గా ఇంటికే తీసుకొచ్చుకుని రాసలీలలు సాగిస్తారు. అందుకు ఏ మగాడు మినాహాయింపు కాదు.

మహ్మద్ ను పెళ్లి చేసుకుంటే

మహ్మద్ ను పెళ్లి చేసుకుంటే

ఒక పేరుగాంచిన ఆటగాడు కూడా తన భార్యతో కాకుండా వేరే వాళ్లతో రాసలీలు సాగిస్తూ పట్టుబడిని విషయం మనం అందరూ చూస్తూనే ఉన్నాం. కానీ నా మహ్మద్ అలాంటోడు కాదు. ఎవడో దిక్కుమొక్కు తెలియని వాణ్ని పెళ్లి చేసుకోవడం కంటే మహ్మద్ ను పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉంటాను. మహ్మద్ నాకు పరిచయం కావడం నా అదృష్టం. నా ప్రాణాలైనా విడుస్తానేమోగానీ మహ్మద్ ను కాకుండా మరొకరిని పెళ్లి చేసుకోను.

English summary

when love is pure by all means and true to its definition

when love is pure by all means and true to its definition
Story first published:Monday, March 12, 2018, 13:24 [IST]
Desktop Bottom Promotion