శోభనం గురించి మీ ఫ్రెండ్ మీతో అలా చెప్పాడా? అదంతా అబద్దమే!

Written By:
Subscribe to Boldsky

ఫస్ట్ నైట్ అంటే ఒక్కొక్కరిలో ఒక్కో ఆలోచన ఉంటుంది. పెళ్లి అయిన తరువాత మొదటి రాత్రి అనే సంప్రదాయం చాలా రిలీజియన్స్ లో ఉంది. ఏమంటే ఒక్కొక్కరు ఒక్కో పేరుతో ఆ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఇక మగవారు తమ తొలి రాత్రి గురించి ఏవేవో కలలుకంటారు. పడక గదిలో రెచ్చిపోవాలనుకుంటారు. కొందరేమో తన శృంగారంలో సంతృప్తి పరచగలనా లేదా అని అనుమానపడుతుంటారు.

సుఖపెట్టలేకపోయాం

సుఖపెట్టలేకపోయాం

ఫస్ట్ నైట్ పైన చాలా సర్వేల్లో కొన్ని నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. సెక్స్ అనుభవం లేని మగవారు వారి భార్య తో మొదటి రాత్రి చేసుకున్న వారి పైన చేసిన పలు పరిశోధనల్లో చాలా ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. మీరు మీ భాగస్వామి ని సుఖపెట్టారా అనే కొన్ని ప్రశ్నలను అడగగా చాలామంది మేము మొదటి రాత్రి రోజు మా భార్యని సుఖపెట్టలేకపోయామని చెప్పారు.

చాలా కారణాలు

చాలా కారణాలు

అందుకు చాలా కారాణాలుంటాయి. సినిమాల్లో చూపించినట్లుగా ఫస్ట్ నైట్ రోజు మీకు అంత మంచి వాతావరణం ఇంట్లో ఉండదు. శోభనం కోసం అన్ని ఏర్పాట్లు చేసే పనిలో ఇంట్లో వాళ్లు నిమగ్నమై ఉంటారు. మీరు దాన్ని ఎంతో రహస్యంగా చేయాలని భావించి ఉంటారు. కానీ ఆ రోజు మీ బెడ్ రూమ్ చుట్టూ బంధువులు ఉండి ఉంటారు.

ఏం చేయాలో అర్థం కాదు

ఏం చేయాలో అర్థం కాదు

ఆ టెన్షన్ లో మీకు ఏం చేయాలో అర్థం కాదు. ఏదో చేయాలని వెళ్తారు కానీ రెండు మూడు మాట్లాడి.. ఎంతో ధైర్యం చేసి ఒక ముద్దు పెట్టుకుని ఆ తంతంగాన్ని ముంగిచేస్తారు.

భయం.. సిగ్గు

భయం.. సిగ్గు

అలాగే కొందరు పురుషులు తొలి రాత్రి అనగానే మొహమాటానికి గురై సరిగా చేయలేకపోతారు. ఇంకొందరు ఏదో తెలియని భయం మరియు సిగ్గు వల్ల సరిగా చేయలేకపోతారు. మరికొందరు సెక్స్ చేశామంటే చేశాం అన్నట్లు క్షణాల్లో పని కానిచ్చేస్తారు.

సంతృప్తిపరచలేరు

సంతృప్తిపరచలేరు

మెదటి రాత్రి అనగానే అమ్మాయిల్లో చాలా అంచనాలు ఉంటాయి. దీంతో భార్య అంచనాలు మగవారు అందుకోలేక పోతారు. వాళ్లను శృంగారంలో అనుకున్నంత మేరకు సంతృప్తిపరచలేరు.

పోర్న్ చూసినా వేస్టే

పోర్న్ చూసినా వేస్టే

కొందరు మగవారు పోర్న్ వీడియోస్ బాగా చూసి ఉంటారు. అన్ని రకాల యాంగిల్స్ కూడా వారికి తెలుసు ఉంటాయి. వారు ఏమో హస్తప్రయోగాలు కూడా బాగానే చేసుకుని ఉంటారు. కానీ సెక్స్ ప్రాక్టికల్ గా ఫస్ట్ టైమ్ చేయడం వల్ల తొలి రాత్రిలో విఫలం అవుతారు.

స్నేహితులు నిజం చెప్పరు

స్నేహితులు నిజం చెప్పరు

ఇక శోభనానికి ముందు కొందరు స్నేహితుల సలహాలు సూచనలు, వారి అనుభవాలు తెలుసుకుంటూ ఉంటారు. అయితే స్నేహితులు ఏ ఒక్కరు కూడా శోభనం విషయంలో నిజం చెబుతారు అనే నమ్మకం లేదు. పరువు కోసం అయినా తమ శోభనం రాత్రి దుమ్ము రేపాము అంటూ చెబుతారు. కానీ వాస్తవానికి వాళ్లు కూడా ఆ రోజు ఏమి చేసి ఉండరు.

పెద్దలతో మాట్లాడండి

పెద్దలతో మాట్లాడండి

శోభనం రాత్రి అలా చేయాలి, ఇలా చేయాలి, స్పీడ్‌గా ఉండాలి, ఆమెను డామినెట్‌ చేయాలి అంటూ ఫ్రెండ్స్ సలహాలు ఇస్తారు. అలా చేస్తే అట్టర్‌ ఫ్లాప్‌ అవుతావు. శోభనానికి ముందు పెద్దలతో అంటే తాత వయస్సులో ఉన్న వారితో మాట్లాడితే మంచిది. వారి సలహాలు సూచనలు తీసుకుని శోభనంకు సిద్దం అవ్వాలి.

ముద్దు ముచ్చట్లతో

ముద్దు ముచ్చట్లతో

మొదటి రాత్రి రోజూ భార్య ఇష్టాలను తెలుసుకుంటూ భయపడకుండా మెల్లిగా వారిని వశపర్చుకుంటే ఎంజాయ్ చేయవచ్చు. ఎక్కువగా టెన్షన్ పడకూడదు. ఇద్దరూ ముద్దు ముచ్చట్లతో స్టార్ చేసి మెల్లిగా దాన్ని ఎంజాయ్ చేయాలి. అందుకే తొలిరాత్రిని ఎంజాయ్ చేయాలంటే కాస్త ప్లాన్ కూడా ఉండాలి. అప్పుడే మీ భార్యను సుఖపెట్టి సెక్స్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు.

English summary

why couples fail on the first night

why couples fail on the first night
Story first published: Saturday, January 13, 2018, 9:37 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter