Just In
Don't Miss
- Sports
డబ్ల్యూటీఏ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు సొంతం చేసుకున్న ఆష్లే బార్టీ
- News
చంద్రబాబు, లోకేశ్‌పై సభలో తీర్మానం, ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన, జక్కంపూడి రాజా మద్దతు
- Finance
12,000 పాయింట్లకు పైగా నిఫ్టీ, 300 పాయింట్ల లాభంలో సెన్సెక్స్
- Technology
దీర్ఘకాలిక ప్లాన్లు, ఆఫర్లు, డిస్కౌంట్ల వైపు చూస్తున్న నెట్‌ఫ్లిక్స్
- Movies
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు: ఫస్ట్ డే రెస్పాన్స్.. వర్మ షాకింగ్ రియాక్షన్
- Automobiles
టయోటాకు మళ్లీ గట్టి ఎదురుదెబ్బ
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
నా భర్త రాత్రి ఆ పని చేసేటప్పుడు వద్దన్నా వినడు, అందరి ముందు నటిస్తాడు, అసలు రూపం అది #mystory394
మా నాన్న నాకు ఎక్కువ సంబంధాలు చూడలేదు. ఎందుకంటే మా అక్క కోసం చాలా సంబంధాలు చూసి చివరకు ఒక దూర బంధువుల వ్యక్తికి ఇచ్చి చేశారు. తన వివాహం చేసేటప్పుడు నాన్న చాలా రకాలుగా ఆలోచించాడు. దూరపు వాళ్లకు ఇస్తే పెద్దగా సమస్యలు ఉండవనుకున్నాడు.
కానీ మా బావ రోజూ మా అక్కను ఇబ్బందులకు గురి చేసేవాడు. తనకు నరకయాతన చూపించేవాడు. చాలాసార్లు పెద్ద మనుషుల దగ్గర పంచాయతీలు జరిగిన తర్వాత ఇప్పుడు కాస్త దారిలోకి వచ్చాడు.

నటిస్తాడు
అక్క కష్టాలను చూసిన మా నాన్న దూరం వాళ్లకు ఇవ్వకూడదనుకున్నాడు. అందుకే తనకు చిన్ననాటి మిత్రుడి కుమారుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అందరి ఎదుట మా ఆయన చాలా సైలెంట్ గా ఉన్నట్లు నటిస్తాడు. చిన్నపిల్లాడిలా యాక్ట్ చేస్తాడు. తనకు ఏమీ తెలియదు అన్నట్లుగా ఫేస్ పెడతాడు.

అసలు రూపం
కానీ ఆయన అసలు రూపం నాకు మాత్రమే తెలుసు. అతను చాలా దుర్మార్గుడు. అతని ఆలోచనలు చాలా క్రూరంగా ఉంటాయి. ఈ విషయాన్ని నేను చాలాసార్లు మా ఇంట్లో వాళ్లకు చెప్పాను.

అక్కకు చిత్రహింసలు
వాళ్లు మొదట్లో నమ్మలేదు. తర్వాత నమ్మారు. మా బావ చేతిలో మా అక్క ఎలా చిత్ర హింసలు అనుభవిస్తుందో అంతకంటే ఎక్కువ బాధలు నేను భరిస్తున్నా. మా నాన్న మా ఆయన పెట్టే టార్చర్ ను మా మామయ్యకు చెప్పాడు.

అవమానకంరంగా భావించి
దీంతో మా ఆయన ప్రవర్తన మరీ దారుణంగా మారిపోయింది. తాను రహస్యంగా చేసే పనులన్నీ వాళ్లకు నాన్న తెలిసిపోయాయని ఇది తనకు చాలా అవమానకరంగా ఉందని నన్ను రకరకాలు హింసిస్తున్నాడు.

రాత్రి పడకగదిలో
అతని హింసను ఎవరికీ చెప్పుకోలేను. నాతో మాట్లాడుతున్నట్లే నటిస్తాడు. నేనేంటే చాలా ఇష్టం అన్నట్లుగా ఉంటాడు. అలా అని రాత్రి పడకగదిలో అతనికి సహకరిస్తే ఒక రాక్షసుడిలా ప్రవర్తిస్తాడు.

వద్దూవద్దూ అంటే వినడు
కొద్దిసేపు తను ఆ పని చేశాక, నేను వద్దూవద్దూ అన్నా కూడా వినడు. అలాగే కొనసాగిస్తాడు. చాలా ఆటవికంగా నన్ను అనుభవిస్తాడు. అదంతా కూడా నాపై చూపే కోపం అని నాకు తెలుసు. కానీ నా సమస్యను ఎవరికీ చెప్పుకోలేను.
Most Read : సెక్స్ కు సంబంధించి ప్రమాదకరమైన సూచనలు వీటిని నిర్లక్ష్యం చేయకండి

తిట్టడు, కొట్టడు కానీ
మళ్లీ ఉదయం లేవగానే తనకు ఏమీ తెలియనట్లు ఉంటాడు. నన్ను తను డైరెక్ట్ గా తిట్టడు, కొట్టడు. రోజూ రాత్రి ఆ సమయంలో నాతో చాలా దారుణంగా, కర్కశంగా ప్రవర్తిస్తుంటాడు. ఇలాంటి మనుషులు కూడా సమాజంలో ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది. నాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు.