For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లయిన ప్రతి జంట ఎదుర్కొనే సమస్య అదే, పిల్లల విషయంలో సూటిపోటి మాటలతో సమాజం అవమానిస్తుంది, ఆ మాటలు

ఇక పెళ్లయిన తర్వాత అమ్మాయిలు చాలా వరకు తన భర్త జాబ్ చేసే సిటీకి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ తెలిసిన వారు ఎవరూ ఉండరు. ఇంటి పక్కన ఉండే వారితో పరిచయం ఏర్పరుచుకోవాల్సి వస్తుంది. ఇక మీ ఆయన ఆఫీస్ కు వెళ్లగాన

|

మనదేశంలో వివాహ విషయంలో కొందరకి చాలా సమస్యలు ఎదురవుతుంటాయి. పెళ్లికానంత వరకు పెళ్లెప్పుడు అని అడుగుతుంటారు. పెళ్లి అయిన తర్వాత పిల్లలు ఎప్పుడు అని సతాయిస్తుంటారు. వివాహం పూర్తయిన వెంటనే ఆ జంటను ఇంటి పొరుగువారు, స్నేహితులు, కుటుంబ సభ్యులందరూ ఏవేవో ప్రశ్నలు అడిగి ఇబ్బందులుపెడుతుంటారు. తరుచుగా కొన్ని రకాల ప్రశ్నలు పెళ్లయిన కొత్త జంటలు ఎదుర్కొంటూ ఉంటాయి.

వెంటనే పిల్లలు పుట్టాలని

వెంటనే పిల్లలు పుట్టాలని

పెళ్లయిన వెంటనే అందరూ అడిగే ప్రశ్న పిల్లల గురించి. మీరు ఇరవైఏళ్లలో ఉండగానే మీ చుట్టుపక్కల వారంతా మిమ్మల్ని అడిగి ఇబ్బందిపెడుతుంటారు. పెళ్లయిన ఏడాది రెండేళ్లలో వెంటనే పిల్లలు పుట్టాలని మీకు తెలిసిన వారంతా భావిస్తారు. పెళ్లయిన కొన్నాళ్లకే పిల్లలుపుడితేనే మీ చుట్టుపక్కల వారంతా మీకు గౌరవం ఇస్తారు లేదంటే లేదు. అలాంటి స్వభావం గల మనుషులు చాలా మందే ఉంటారు.

ఇంటిపక్కన ఉండే ఆంటీ

ఇంటిపక్కన ఉండే ఆంటీ

ఇక పెళ్లయిన తర్వాత అమ్మాయిలు చాలా వరకు తన భర్త జాబ్ చేసే సిటీకి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ తెలిసిన వారు ఎవరూ ఉండరు. ఇంటి పక్కన ఉండే వారితో పరిచయం ఏర్పరుచుకోవాల్సి వస్తుంది. ఇక మీ ఆయన ఆఫీస్ కు వెళ్లగానే ఇంటి పక్కన ఉండే ఆంటీ మీ ఇంటికి వస్తుంది. మిమ్మల్ని నానా ప్రశ్నలు అడిగి ఇబ్బందులుపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలు కనే విషయంలో మీరు చేసుకున్న ప్లాన్స్ మొత్తం ఆమె మిమ్మల్ని అడుగుతుంది. మీకు ఆ ఆంటీ అడిగే ప్రశ్నలు మొత్తం కూడా ఇబ్బంది కలిగించొచ్చు.

గైనాకాలజిస్ట్ కూడా

గైనాకాలజిస్ట్ కూడా

"సాధారణంగా నేను అప్పుడప్పుడు గైనకాలజిస్ట్ ని కలుస్తుంటాను. ఆమె కూడా పిల్లలకు సంబంధించిన విషయాలు బోలెడన్నీ చెబుతూ ఉంటుంది. వెంటనే పిల్లల్ని కనేసేయ్ అన్నట్లుగా మాట్లాడుతుంది. కాస్త లేట్ అయితే అండాలు విడుదల కావు అని భయపిస్తుంది. దాంతో నాలో ఆందోళన మొదలవుతుంది.ఆమె ఇచ్చే సలహాలు మంచివే కావొచ్చుగానీ పెళ్లయిన వెంటనే ఎలాంటి ఎంజాయ్ లేకుండానే పిల్లల్ని కనేస్తే ఇంకేముంటుంది." అని కొత్తగా పెళ్లయిన ప్రతి అమ్మాయి అభిప్రాయం.

తల్లిదండ్రులు కూడా

తల్లిదండ్రులు కూడా

ఇక చివరకు నా తల్లిదండ్రులు కూడా నాకు పెళ్లయిన కొన్ని రోజులకే పిల్లల విషయంలో నన్ను భయపెట్టడం మొదలుపెట్టారు. ఇంకెన్నాళ్లు వెయిట్ చేస్తావు వెంటనే కనేసెయ్ ఓ పని అయిపోతుంది అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. రానురాను వయస్సు పెరిగిపోతుందిగానీ తగ్గదు కదా అంటూ నన్ను నిరుత్సాహాపరిచేవారు. మనువడిని, మనువరాలిని ఇంకెప్పుడు ఇస్తావంటూ నన్ను మా అమ్మనాన్నలు కూడా ఇబ్బందిపెడుతున్నారంటూ కొత్త పెళ్లయిన చాలా మంది అమ్మాయిలు బాధపడుతుంటారు.

MostRead:కొబ్బరి నీళ్లతో అంగ స్తంభన సమస్యకు చెక్, ఆ సామర్థ్యం బాగా పెరుగుతుందిMostRead:కొబ్బరి నీళ్లతో అంగ స్తంభన సమస్యకు చెక్, ఆ సామర్థ్యం బాగా పెరుగుతుంది

శుభవార్త

శుభవార్త

పెళ్లయిన తర్వాత అందరూ అడిగే ప్రశ్న ఒక్కటే గుడ్ న్యూస్ ఏమైనా ఉందా అని. గుడ్ న్యూస్ అంటే మీ కెరీర్ విషయానికి సంబంధించిన విషయాలు, మీరు సాధించిన విజయాల గురించి కాదు. దాని అర్థం పిల్లలకు సంబంధించి ఏమైనా శుభవార్త చెబుతారా అని. పెళ్లయిన తర్వాత భార్యాభర్తలంతా ఇలాంటి ప్రశ్నతో చాలా ఇబ్బందిపడుతుంటారు.

దయచేసి అలా చేయకండి

దయచేసి అలా చేయకండి

అయితే పెళ్లయిన వెంటనే ప్రతి జంటను ఇలా అడిగి వారిని ఇబ్బందులకు గురి చేయకండి. ప్రతి భార్యాభర్త పిల్లలు విషయంలో కొన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వారి పరిస్థితులను బట్టి వారి నిర్ణయాలను గౌరవించాలి గానీ మీ సూటిపోటీ మాటలతో వారిని కించపరచకూడదు. పెళ్లయిన వెంటనే కాకుండా కొన్నాళ్లు వెయిట్ చేసి జీవితంలో కాస్త సెట్ అయ్యాక పిల్లల్ని కనాలనుకునే వారు చాలా మంది ఉంటారు. అలాంటి వారిని దయజేసి మీరు ఇబ్బందులుపెట్టకండి.

Most Read :శ్రీకృష్ణుడికి తనే గొప్ప భక్తుడిని అని అనుకున్న అర్జునుడికి ఒక సన్యాసి చెప్పిన కథ ఏమిటో తెలుసాMost Read :శ్రీకృష్ణుడికి తనే గొప్ప భక్తుడిని అని అనుకున్న అర్జునుడికి ఒక సన్యాసి చెప్పిన కథ ఏమిటో తెలుసా

వారి గర్భంపై కూడా పడే అవకాశం ఉంది

వారి గర్భంపై కూడా పడే అవకాశం ఉంది

మీరు ఒక వెల్ విషర్ గా పెళ్లయిన జంట జీవితం గురించి అడిగి తెలుసుకోండి. వారికి ఏవైనా కష్టాలు ఉంటే సలహాలు ఇవ్వండి. అంతేగానీ ఇంకెప్పుడు పుడతారబ్బా మీకు పిల్లలుఅంటూ వారిని ఎగతాళి చేసి మాట్లాడకండి. అలా మాట్లాడితే ముఖ్యంగా ఆడవారు మానసికంగా చాలా కుంగిపోతారు. వారు చాలా స్ట్రెస్ కు లోనవుతారు. ఆ ప్రభావం వారి గర్భంపై కూడా పడే అవకాశం ఉంది. అందువల్ల మానవత్వం మనుషులుగా మీరు ఆ ప్రశ్న మాత్రం అడగకండి.

English summary

Stop Asking Married People When They Will Have Children

Stop asking married people when they will have children
Desktop Bottom Promotion