Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
వావ్! మాఘ మాసంలో మంచు కురిసే వేళలో... కొండ కోనలను దాటుకుని మగువను మనువాడిన మగాడు...
సరిగ్గా అప్పుడే ఆ ప్రాంతంలో మంచు వర్షం జోరుగా కురిసింది. అంతే అక్కడి రోడ్లు అన్నీ మంచు దప్పటితో కప్పుకున్నాయి.
మన దేశంలో హిందూ సంప్రదాయ వివాహాలు ఎంత కట్టుబాట్లతో ఉంటాయో అందరికీ తెలిసిందే. ఒక పెళ్లి చేయాలంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు వరకు అన్నింటినీ చూసి పెళ్లిని నిర్ణయిస్తారు. ఇక ప్రేమ పెళ్లి అయితే ఇవేవీ ఉండవు.

అసలు ప్రేమలో మునిగిపోతే... వారికి ఎలాంటి హద్దులు అనేవే లేకుండా రెచ్చిపోతుంటారు. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే స్టోరీలో తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు పెద్దలను ఒప్పించాడు ఓ యువకుడు.
పెద్దలందరూ కలిసి మాఘ మాసంలో మంచి ముహూర్తాన్ని సైతం చూసి పెళ్లికి డేట్ ఫిక్స్ చేశారు. అయితే అప్పుడే తన పెళ్లికి మంచు తుఫాను రూపంలో పెద్ద అడ్డంకి వచ్చింది. అయితే ఆ పెళ్లికొడుకు ఈ మంచు వర్షానికి భయపడలేదు.
తనకు కాబోయే భార్య కోసం సాహస యాత్ర చేశాడు. అది కాస్త ఎవరో సోషల్ మీడియాలో పెట్టేసరికి అది తెగ వైరల్ అయిపోయింది. అందుకు సంబంధించిన వివరాలేంటో మీరు చూడండి...

వివాహ వేడుక కోసం..
సాధారణంగా మన దేశంలో భారతీయ వివాహ వ్యవస్థలో పెళ్లి కొడుకు గానీ లేదా పెళ్లి కూతురు గానీ వారి ఇంటి నుండి మరో ఇంటికి వెళ్లేందుకు వాహనాలను, లేదా గుర్రాలను వాడటం వంటివి మీరు చూసే ఉంటారు.

వధువు ఇంటికి వెళ్లేందుకు..
వీరు కూడా అందరిలాగానే కొత్త బట్టలు, వాహనాలను సిద్ధం చేసుకుని పెళ్లి కూతురు ఇంటికి వెళ్లడానికి రెఢీ అయ్యారు.

అకస్మాత్తుగా కురిసిన మంచు..
సరిగ్గా అప్పుడే ఆ ప్రాంతంలో మంచు వర్షం జోరుగా కురిసింది. అంతే అక్కడి రోడ్లు అన్నీ మంచు దప్పటితో కప్పుకున్నాయి. దీంతో అక్కడ ఎవ్వరూ కనీసం బయటకు కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది.

కొండ కోనల నడుమ..
అయితే ఆ కొత్త పెళ్లి కొడుకు మంచు వర్షానికి భయపడలేదు. తను మనువాడాల్సిన మగువ కోసం పెద్ద సాహసమే చేశాడు. ఆ ప్రాంతానికి ఆ సమయంలో ఎలాంటి రవాణా సదుపాయం లేకపోవడంతో కొండ కోనల నడుమ కాలినడకన బయలుదేరాడు.

ఆటంకాలను అధిగమిస్తూ..
మనం మామూలుగా ఉన్న వాతావరణంలోనే కొండ కోనల్లో నడించేందుకు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటిది తనకు కాబోయే అర్థాంగి కోసం ఆ కుర్రాడు మంచు వర్షాన్నిసైతం లెక్క చేయకుండా ఏకంగా 4 కిలోమీటర్లకు పైగా కాలినడకన వెళ్లి వధువు ఇంటికి చేరుకున్నాడు.

ఆకట్టుకున్న కొత్త పెళ్లికొడుకు..
ఇదే సమయంలో ఆ కొత్త పెళ్లి కొడుకు అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. వధువు ఇంటికి చేరుకునే సమయంలో మధ్య మధ్యలో హూషారుగా డ్యాన్స్ కూడా చేశాడు.

సోషల్ మీడియాలో..
ఈ సంఘటనను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త బాగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘ప్రేమ వలలో పడ్డ పెళ్లికొడుకు‘ ‘ప్రేమ తెచ్చిన కష్టాలు‘ ‘రొమాంటిక్ కపుల్‘ ‘పెళ్లికొడుకుతో వారి బంధువులు ఈ పెళ్లిని ఎప్పటికీ మరచిపోలేరు‘ ‘ఈ ఏడాది అత్యుత్తమ అవార్డు ఇతనికే‘ అని రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
ఇదంతా ఎక్కడంటే...
మన దేశంలోని ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లా బిజ్రా అనే గ్రామంలో జరిగింది.



Click it and Unblock the Notifications


