Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
స్టడీ : వారానికొసారైనా పడకగదిలో ‘ఆ’పని చేస్తే.. ఆయుష్ పెరుగుతుందట...!
వారానికి ఒక్కసారైనా ఆ కార్యంలో పాల్గొంటే ఆయుష్ పెరుగుతుందట.
కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు పడకగదిలో రతి క్రీడలో రెచ్చిపోతూ ఉంటారు. అయితే పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత మాత్రం అదే ఉత్సాహాన్ని కొనసాగించలేకపోతారు.

ఇంకా కొంతమంది పిల్లలు పుట్టాక ఆ కార్యానికి దూరమైపోతారు. దానికి అనేక కారణాలుంటాయి. పని ఒత్తిడి.. ఇతర బాధ్యతలు.. అనారోగ్య సమస్యలు.. శారీరక అలసట ఇలా చెప్పుకుంటూ పోతే ఏదో ఒక రీజన్ తో ఆ కార్యాన్ని వాయిదా వేయడమో.. లేదా దాన్ని మరచిపోవడమో చేస్తుంటారు చాలా మంది.

మరికొందరు పెళ్లి తర్వాత ఆ కార్యంలో పాల్గొనేందుకు అంతగా ఆసక్తి చూపరు. దాన్ని చాలా బోరింగ్ గా ఫీలవుతుంటారు. ఇంకా కొంతమంది అయితే నెలలో ఒకట్రెండు సార్లు అదీ ఏదో నామమాత్రంగా పాల్గొంటారు. మరికొందరు అసలు ఆ కార్యం గురించే మరిచిపోతుంటారు. ఇంకా కొందరు వయసు పెరిగేకొద్దీ పడకగదిలో రొమాన్స్ దూరంగా ఉండటమే ఆరోగ్యానికి మేలని భావిస్తుంటారు.

అయితే అన్నింటికీ అదే చక్కని మందని చాలా మంది తెలుసుకోలేకపోతారు. ఈ లోకంలో ప్రతి ఒక్క జీవికి ఆకలి, నిద్ర ఎంత ముఖ్యమో శృంగారం కూడా అంతే ముఖ్యమని తాజాగా ఓ సర్వేలో తేలింది. తాజా అధ్యయనం ప్రకారం.. బెడ్ రూమ్ లో కపుల్స్ కలయిక అనేది రెగ్యులర్ జరగాలని.. దీన్ని కేవలం శారీరక సుఖంగా భావించకూడదని చెబుతున్నారు. ఇంతకీ ఈ సర్వే చేశారు.. ఈ అధ్యయనంలో ఇంకా ఏయే విషయాలు చెప్పారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఒత్తిడి తగ్గుదల..
తాజా అధ్యయనం ప్రకారం.. బెడ్ రూమ్ లో కపుల్స్ ఆ కార్యంలో పాల్గొంటే.. ఒత్తిడి అనేది మటుమాయమవుతుంది. అంతేకాదు ఇమ్యూనిటీ పెరుగుతుంది. బిపి(బ్లడ్ ప్రెజర్) తగ్గిపోతుంది. హార్ట్ ఎటాక్ ప్రాబ్లమ్స్ నుండి ఉపశమనం లభిస్తుంది.

హెల్దీగా ఉండాలంటే..
చాలా మంది హెల్దీగా ఉండాలంటే.. డైటింగ్, జాగింగ్ రెగ్యులర్ గా చేయాలని.. అందుకు తగ్గ ఆహారాన్ని తీసుకోవాలని చెబుతుంటారు. కానీ అవి మాత్రమే కాకుండా.. మరో విషయాన్ని కూడా తెరపైకి తెచ్చారు పరిశోధకులు.

శృంగారాన్ని రెగ్యులర్ గా..
ప్రతి ఒక్కరూ హెల్దీగా ఉండాలంటే.. డైటింగ్, జాగింగ్, ఎక్సర్ సైజ్ తో పాటు శృంగారంలో కూడా రెగ్యులర్ గా పాల్గొనాలంట. దీని వల్ల దీర్ఘకాలిక రోగాలు అనేవి అస్సలు దరిచేరవని స్పష్టం చేశారు.

జీవనశైలిపై సర్వే..
న్యూ ఇంగ్లాండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పరిశోధనల్లో.. ప్రపంచవ్యాప్తంగా హార్ట్ ప్రాబ్లమ్స్ పెరిగినట్లు గుర్తించారు. 22 ఏళ్ల పాటు నిర్వహించిన ఈ అధ్యయనంలో 65 ఏళ్లలోపు వయసు ఉన్న 1,120 మంది మగవారు, ఆడవారి జీవనశైలిపై నిఘా పెట్టారు.

తగ్గిన అనారోగ్య సమస్యలు..
వీరిలో ప్రతిరోజూ ఎవరైతే శృంగారంలో పాల్గొన్నారో.. వారందరికీ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవే రాలేదట. అంతేకాదు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోయాయట. అదే సమయంలో అప్పుడప్పుడు శృంగారంలో పాల్గొనే వారికి సైతం మెరుగైన ఫలితాలే కనిపించాయట.

వారంలో ఒకట్రెండు సార్లు..
ఎవరైతే వారంలో ఒకట్రెండు సార్లు ఆ కార్యంలో పాల్గొన్నారో.. అలాంటి వారందరికీ హార్ట్ ఎటాక్ సమస్యల ముప్పు 27 శాతం కంటే తక్కువగా నమోదైంది.

అప్పుడప్పుడు కలిస్తే..
అయితే అప్పుడప్పుడు శృంగారంలో పాల్గొనే వారికి మాత్రం దాదాపు 8 శాతం పెరిగినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజూ ఆ కార్యం అంటే ఆసక్తి లేని జంటలు.. వారానికి కనీసం ఒకటి లేదా రెండుసార్లు చేసి ఆ ప్రయోజనాలు పొందొచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.

ఆయుష్ పెరుగుదల..
ఇలా వారంలో ఒకట్రెండు సార్లు పాల్గొనడం వల్ల మీ వయసు సుమారు 37 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. చూశారు కదా.. ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పటినుండైనా వారానికోసారి రతి క్రీడలో రెచ్చిపోండి మరి.



Click it and Unblock the Notifications