For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆలుమగల మధ్య దూరం... మరింత పెరిగే విరహం... అదెలాగో మీరే చూడండి...

|

ఇటీవల కరోనా వంటి కష్ట కాలంలో కూడా మన దేశంలో లక్షల సంఖ్యలో వివాహాలు జరిగాయి. అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ సడలించడంతో చాలా మంది ఉద్యోగాల నిమిత్తం నగరాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు.

దీంతో చాలా మంది భార్యభర్తలు ఉద్యోగాలు, ఉన్నత చదువులు ఇతర కారణాల వల్ల తమ భాగస్వాములకు దూరంగా గడపాల్సి వస్తోంది. ఇలాంటి టైమ్ లో మనం చురుకుగా, హుషారుగా ఉండటం అనేది చాలా కష్టంగా మారుతుంది.

మీరు మీ భాగస్వామిని విడిచి ఉండాలంటే.. మరింత ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. అయితే లాంగ్ రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఎన్నో లాభాలుంటాయట. సైన్స్ ప్రకారం.. దూరం పెరిగే కొద్దీ ఆకర్షణ ఎలా పెరుగుతుందో.. భార్యభర్తల మధ్య కూడా అలాగే ప్రేమ పెరుగుతుందట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం రండి...

ఆ కార్యం గురించి అబ్బాయిలకు ఉండే అపొహలేంటో తెలుసా...ఆ కార్యం గురించి అబ్బాయిలకు ఉండే అపొహలేంటో తెలుసా...

కొత్తలో కొంచెం కష్టం..

కొత్తలో కొంచెం కష్టం..

కొత్తగా పెళ్లయిన వారికి భాగస్వామిని వదిలి ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడప్పుడే ఒకరినొకరు బాగా తెలుసుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా దూరమవ్వాలంటే.. ఎవరికైనా చాలా బాధగా ఉంటుంది. అయితే అది కూడా వారి బంధాన్ని మరింత బలంగా మారుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

వారి జ్ణాపకాలే..

వారి జ్ణాపకాలే..

పెళ్లి చేసుకున్న జంటలు తమ భాగస్వామి తమ దగ్గర ఉంటే చాలా బాగుంటుందని.. అనునిత్యం వారినే గుర్తు చేసుకుంటూ ఉంటారట. పదే పదే వారి జ్ణాపకాలే ఎక్కువగా గుర్తుకొస్తాయట. దీంతో వారికి భాగస్వామిపై మరింత ప్రేమ పెరుగుతుందట.

టెక్నాలజీ ద్వారా..

టెక్నాలజీ ద్వారా..

అయితే ప్రస్తుతం లాంగ్ రిలేషన్ షిప్ గురించి పెద్దగా దిగాలు చెందాల్సిన అవసరం లేదు. మీరు మీ భాగస్వామికి దూరంగా ఉన్నప్పటికీ.. వీడియో కాల్స్ లేదా ఫోన్ కాల్స్, వాట్సాప్ చాటింగ్ వంటి వాటి ద్వారా మంచి సంభాషణలు చేయగలరు. ఇలా ఇద్దరూ డిజిటల్, సోషల్ మీడియా ద్వారా మరింతగా దగ్గరయ్యే అవకాశం ఉంది.

ప్రతి విషయాన్నీ..

ప్రతి విషయాన్నీ..

టెక్నాలజీ ఉపయోగించి ప్రతిరోజూ ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎన్నో విషయాలను పార్ట్నర్ తో షేర్ చేసుకోవడానికి ఎంతగానో వీలు కలుగుతుంది. దీని వల్ల మీరు పక్కన లేకపోయినా అన్ని ఫీలింగ్స్ ను షేర్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో పార్ట్నర్ పక్కన ఉంటే కూడా మాట్లాడుకోవడానికి సమయం ఉండదు. ఒకవేళ సమయం ఉన్నప్పటికీ.. చెప్పడానికి కొంత మోహమాటపడటం వంటివి చేస్తుంటారు.

మీ రాశికి ఏ రాశి సరిపోతుందో మీకు తెలుసా?మీ రాశికి ఏ రాశి సరిపోతుందో మీకు తెలుసా?

భావోద్వేగ బంధం..

భావోద్వేగ బంధం..

మీరు మీ భాగస్వామికి దూరంగా ఉండటం వల్ల మీరు శారీరకంగా కలవకపోవచ్చు. కానీ భావోద్వేగ బంధం మాత్రం కచ్చితంగా దగ్గరవుతుంది. దీంతో ఇద్దరి మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది. మీ మాటల ద్వారా మీ ఫీలింగ్స్ ను సులభంగా చెప్పుకోవచ్చు. శారీరక బంధంలో ఉండకపోయినా.. భావోద్వేగంగా మీరు ఎంతగానో ఎటాచ్ అయ్యి ఉంటారు.

కొత్త ఆలోచనలు..

కొత్త ఆలోచనలు..

మీరు మీ భాగస్వామితో దూరంగా ఉంటే.. అప్పుడు వారు మీకు మంచి సలహాలు ఇవ్వగలరు. అదే విధంగా వారు మీ విజయాన్ని అభినందిస్తారు. అంతేకాదు మీరు మరెన్నో కొత్త ఐడియాలతో మీ బంధాన్ని విజయవంతంగా కొనసాగిస్తారు. ఇవి ఎంతో బాగా వర్కవుట్ అవుతాయి. మీరిద్దరూ ఒకరికొకరు పక్కపక్కన లేకపోయినా ఒకరి గురించి మరొకరు బాగా తెలుసుకుంటారు. అదే విధంగా ఒకరి ప్రయత్నాలను మరొకరు అభినందిస్తారు. ఇలా మీ భాగస్వామి దూరంగా ఉన్నా కూడా ధైర్యంగా ఉంటుంది.

స్వచ్ఛమైన ప్రేమ..

స్వచ్ఛమైన ప్రేమ..

లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్ లో స్వచ్ఛమైన ప్రేమను మనం చాలా సినిమాల్లో చూశాం. రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి వాటిని మనం ఎక్కువగా చూడొచ్చు. మీరు మీ భాగస్వామికి ఎంత దూరంగా ఉంటే.. అంత ప్రేమిస్తున్నారని తెలుస్తుంది. ఇందులో కోరికలేమీ లేకుండా.. స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది. మీరు ప్రేమ కోసం ఎంత దూరం వెళ్లగలరనే విషయం కూడా మీకు అర్థం అవుతుంది.

గొడవలు తక్కువ..

గొడవలు తక్కువ..

మీరిద్దరూ దూరంగా ఉండటం వల్ల గొడవలు అనేవి ఎక్కువగా జరగవు. అదే అనునిత్యం పక్కపక్కన ఉంటే మాత్రం కచ్చితంగా గొడవలు పెరుగుతాయి. అయితే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్ లో మాత్రం గొడవలు చాలా తక్కువగా వస్తాయి. అంతేకాదు ఈ దూరపు బంధం వల్ల అర్థం చేసుకునే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మీ భవిష్యత్తులో కూడా తక్కువ గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్ ఎంతో బలంగా ఉంటుంది.

బోర్ కొట్టదు..

బోర్ కొట్టదు..

లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్ అనేది ఎప్పటికీ అద్భుతంగా ఉంటుంది. ఈ రిలేషన్ లో అస్సలు బోర్ కొట్టదు. ఇంతవరకు మీరిద్దరూ కలిసి తక్కువ సమయం గడిపారు కాబట్టి.. మీరు కలుసుకున్నప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. చాలా కాలం తర్వాత మీ భాగస్వామిని కలుస్తారు కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని ఆనందంగా గడుపుతారు.

దగ్గరగా ఉంటే..

దగ్గరగా ఉంటే..

అయితే అనునిత్యం దగ్గరగా ఉండే ఆలుమగలకు ఇలాంటి అవకాశం దక్కకపోవచ్చు. ఇలాంటి వాటిని మనం దగ్గరగా ఉండే వారితో చూడలేం. అయితే దూరంగా ఉన్నప్పుడు వీటితో పాటు మనకు ఇంకా ఎన్నో విషయాల గురించి తెలుస్తుంది. అందుకే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్ లో ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చు. దీని వల్ల మీ ఇద్దరి మధ్య బలం మరింత బలపడుతుంది.

English summary

Benefits Of Being In A Long-Distance Relationship in Telugu

Here are these benefits of being in a long-distance relationship in Telugu. Have a look
Story first published: Tuesday, August 3, 2021, 15:34 [IST]