Latest Updates
-
జీర్ణ సమస్యలకు చెక్ పెట్టే సంజీవని..100% కల్తీ లేని త్రిఫల చూర్ణం ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
మీ ఇంట్లో బొద్దింకలు పదే పదే కనిపిస్తున్నాయా? అయితే ఈ దోషం ఉన్నట్లే! -
జంక్ ఫుడ్ వద్దు.. సాయంత్రం వేళ పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే వేడివేడి సూప్ ఇదే! -
గ్రైండర్ అక్కర్లేదు..మిక్సీలో రుబ్బిన పిండితోనే పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ మినప వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు వెనక నుంచి పిలిస్తే అపశకునమా? -
నీరసాన్ని తరిమికొట్టే పవర్ స్నాక్..పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే డ్రై ఫ్రూట్ చిక్కీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
మేక పాలలోని ఈ రహస్యం మీకు తెలుసా? ఆ సమస్యకు ఇదే బెస్ట్! -
బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ అవ్వాలా? ప్రోటీన్,ఐరన్ పుష్కలంగా ఉండే ఈ దోసె బ్రేక్ ఫాస్ట్ కి బెస్ట్! -
కర్కాటకంలో గురు సంచారం.. అక్టోబర్ వరకు స్టడీస్, కెరీర్లో ఈ రాశుల వారికి ఎనలేని భాగ్యం.! -
లంచ్ బాక్స్‌లోకి క్విక్‌గా చేసుకునేలా ‘గీ రైస్’.. ముస్లిం వెడ్డింగ్ స్టైల్లో ఇలా చేసేయండి.!
మీ పార్ట్నర్ పడకగదిలో ఇలా చేస్తున్నారా? అయితే మీతో రతిక్రీడలో రెచ్చిపోతున్నట్టే...!
మీ పార్ట్నర్ మీతో నిజంగా ప్రేమలో పడ్డారని తెలిపే ప్రధాన సంకేతాలేంటో తెలుసుకునేందుకు ఇక్కడ ఓ లుక్కేయండి.
భార్యభర్తలిద్దరి మధ్య బంధం మరింత బలపడాలంటే శృంగారం అనేది తప్పనిసరి. ఈ కార్యమే ఇద్దరినీ ఒకటి చేసే ప్రక్రియ. అయితే దీన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే..

ఏ ఒక్కరి ఇష్టంతోనో కాకుండా.. ఆలుమగలిద్దరూ ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటూ మనస్ఫూర్తిగా ఇష్టపడుతూ లైంగికంగా కలవడం వల్ల స్వర్గపు అంచుల దాకా వెళ్లిన అనుభూతని సొంతం చేసుకోవచ్చు. ఇదంతా వినడానికి బాగానే ఉన్నా..

అసలు మీ పార్ట్నర్ మీతో కలిసి గడిపే సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారా? అని మీరు ఎప్పుడైనా గమనించారా? మీకు ఇలాంటి సందేహం ఉంటే.. మీరు భాగస్వామిని కాస్త లోతుగా పరిశీలిస్తే చాలు.

తను ఇచ్చే కొన్ని సంకేతాల ద్వారా తను ఏమీ చెప్పకపోయినా.. మీతో ఆ కార్యాన్ని ఆస్వాదిస్తున్నారా లేదా అనే విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చట. ఇంతకీ ఆ సంకేతాలేంటో మీరూ చూడండి...

మిమ్మల్నే తలచుకుంటే..
సాధారణంగా శృంగారంలో పాల్గొన్న సమయంలో ఎవరైనా కాస్త గట్టిగా అరవడం లేదా మూలగడం వంటివి చేస్తుంటారు. కానీ మీ పార్ట్నర్ మాత్రం మీ పేరే జపిస్తున్నారా? అయితే మీరు చాలా అదృష్టవంతులు. తను మీతో ఆ కార్యాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్నారని చెప్పడానికి ఇదొక సంకేతంగా చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా తను మీతో కలిసి ఆ కార్యంలో పాల్గొనే సమయంలో ఆనందాన్ని కంట్రోల్ చేసుకోలేక మీ పేరునే బిగ్గరగా మళ్లీ మళ్లీ చెబుతుంటారు.

చాలా హ్యాపీగా..
మీ పార్ట్నర్ మీతో కలిసి ఆ కార్యంలో పాల్గొన్నపుడు, ఆ తర్వాత చాలా హ్యాపీగా, ప్రకాశవంతంగా కనిపిస్తున్నారా? ఇది కూడా వారు సెక్సువల్ పరంగా హ్యాపీగా ఉన్నారని ఇన్ డైరెక్ట్ గా చెప్పే సంకేతమే. కాబట్టి మీరు వారి కళ్లలోకి చూస్తూ మీపై వారికి ఉన్న ప్రేమను తెలుసుకోండి. మీరు వారికి మరింత సహకరిస్తూ మీరిద్దరూ రతి క్రీడలో రెచ్చిపోండి.

మీరు తాకగానే..
మీ పార్ట్నర్ మీతో కలిసి ఆనందంగా గడిపేందుకు ఎదురుచూస్తున్నట్లయితే.. మీ స్పర్శను బాగా ఇష్టపడతారు. అంతేకాదు మీరు తనను తాకగానే.. తనలో కోరికలు అమాంతం పెరిగిపోతాయి. అంతే ఒక్కసారిగా వారు మిమ్మల్ని వారి బిగి కౌగిలిలో బంధించే ప్రయత్నం చేస్తారు. మీ ఇద్దరి మధ్య ఎంత ఎక్కువ ప్రేమ ఉంటే.. మీ బంధం అంత బలంగా ఉంటుంది.

ఆ కార్యం తర్వాత..
చాలా మంది మగాళ్లు ఆ కార్యంలో పాల్గొన్న తర్వాత టైడ్ అయిపోయి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అయితే కొందరు మాత్రమే ఆ కార్యం తర్వాత కూడా మిమ్మల్ని ప్రేమలో మునిగిపోయేలా చేస్తారు. ముఖ్యంగా మిమ్మల్ని గట్టిగా కౌగిలించుకుని నిద్రపోవడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి సంకేతం మీ పార్ట్నర్లో కనిపిస్తే మాత్రం తను మీతో ఆ కార్యాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టే.

కిస్ ఎక్కువగా..
సాధారణంగా కిస్ అంటే చాలా మంది లిప్ కిస్ అనే అనుకుంటూ ఉంటారు. అయితే కిస్సులంటే కేవలం పెదాలపై మాత్రమే కాదు.. సుకుమారమైన బుగ్గలు, మెడ, నుదురు, చేతులు ఇలా ఎక్కడైనా బాడీలో తన పెదాలతో కిస్ చేయాలని ప్రతి ఒక్క మగాడు ఆశిస్తాడు. అందుకే ఇలా కిస్సులతో మెల్లగా రతిక్రీడను ప్రారంభిస్తే మంచి ఫలితం ఉంటుంది.

సంతోషకర జీవితం..
మీ పార్ట్నర్ మీతో ఆ కార్యంలో రెగ్యులర్ గా కలుస్తూ ఉన్నారంటే.. తను మీతో ఆ కార్యాన్ని బాగానే ఎంజాయ్ చేస్తున్నట్టే. తను మిమ్మల్ని బాగానే ఇష్టపడుతున్నారని చెప్పొచ్చు. మీతో ఎక్కువ సార్లు ఆ కార్యంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపినా.. మీతో సెక్స్ లైఫ్ రోటీన్ మారినా.. మీ సుఖ దాంపత్యానికి ఇది ఒక సంకేతంగా చెప్పొచ్చు.



Click it and Unblock the Notifications