For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెద్దలు చేసే పెళ్లిలో ముఖ్య ప్రయోజనాలు.. నష్టాలివే...!

|

ఇప్పటి తరం మహిళలు, మగాళ్లు పెద్దలు చూసిన సంబంధాలపై అంతగా ఆసక్తి చూపడం లేదు. ఈ జనరేషన్లో కూడా ఎవరైనా మీరు చూసిన వారిని పెళ్లి చేసుకుంటారా అని ప్రశ్నిస్తూ ఉంటారు.

పెద్దలు చూపే సంబంధాలలో ముక్కు, మొహం తెలియని వారిని ఎలా పెళ్లి చేసుకుంటారని.. వారితో జీవితాంతం ఆనందంగా ఎలా గడుపుతారని, అందుకే తమకు తెలిసిన వ్యక్తులను ప్రేమించడం.. వారిని పెళ్లాడటం మంచిదని మరీ చెబుతున్నారు. తమ ప్రమేయం లేకుండా తల్లిదండ్రుల ఇష్టానికి తగ్గట్టు పెళ్లి చేసుకోవడానికి చాలా మంది ఇష్టపడట్లేదు. కొంతమంది యువత పెద్దలను ఎదిరించి మరీ తమ మనసుకు నచ్చిన వారిని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

కానీ అలా తొందరపడిన వారు తమ వివాహ బంధానికి మధ్యలోనే గుడ్ బై చెప్పేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకునే యువత ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి.. పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా.. ప్రేమ పెళ్లి అయినా.. కపుల్స్ మధ్య సాన్నిహిత్యం, అర్థం చేసుకునేతత్వం, వారిద్దరి మధ్య ఉండే అనురాగమే ఆ బంధాన్ని జీవితాంతం ఆనందంగా ఉండేలా చేస్తాయి. అంటే మన పార్ట్నర్ ను ఎలా ఎంచుకున్నామని కాదు.. వారితో మన బంధం ఎంత బలంగా ఉందనే విషయాన్ని గుర్తించాలి. ఈ సందర్భంగా పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ల వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాల గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

లేడీస్ చేసే ఈ పనులతో మగాళ్లకు ఉత్సాహం ఉరకలేస్తుందట...!

సంప్రదాయ వివాహాలు..

సంప్రదాయ వివాహాలు..

మన దేశంలో పూర్వ కాలం నుండి కుటుంబంలోని పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటాయి. దీనికి కారణం మన పూర్వీకులు పెళ్లి విషయంలో కొన్ని బలమైన పునాదులు ఏర్పాటు చేసి వెళ్లారు. దీంతో కొన్ని యుగాలు, తరాల వారు అదే ఆనవాయితీని, సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. ఇది పిత్రుస్వామ్య వ్యవస్థను ప్రోత్సహిస్తుందని కొందరు అభ్యర్థనలు చెబుతున్నప్పటికీ, వివాహ సంప్రదాయాలు అలాగే కొనసాగుతున్నాయి.

మన కంటే ఎక్కువగా..

మన కంటే ఎక్కువగా..

పెద్దలు ఏదైనా పెళ్లి చేసే ముందు మీ ఇష్టాలకు, అభిరుచులకు తొలి ప్రాధాన్యత ఇస్తారు. అందుకు అనుగుణంగానే మీకు పార్ట్నర్ ను అన్వేషిస్తారు. ఇందుకోసం మీ తల్లిదండ్రులు చాలా ఎక్కువగా ఆలోచిస్తారు.. తెలిసిన వ్యక్తులతో మరియు తెలియని వ్యక్తులతో చాలా విషయాలను ఆరా తీస్తారు. అన్నింటికంటే ముందు మనం వారితో హ్యాపీగా ఉంటామా లేదా అని మన కంటే ఎక్కువగా ఆలోచిస్తారు. అదే మనమైతే కేవలం ప్రస్తుతం గురించి ఆలోచిస్తాం. భవిష్యత్తు గురించి పెద్దగా ఆలోచించం.

అందరితో కలిసోవచ్చు..

అందరితో కలిసోవచ్చు..

పెద్దలు చేసే పెళ్లిళ్లలో వధూవరులిద్దరికీ దాదాపు కుటుంబ కట్టుబాట్లు, సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాలకు దగ్గరగా ఉండేవారినే మీకు భాగస్వామిగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. దీంతో మీ భాగస్వామి చాలా త్వరగా అందరితో కలిసిపోతారు. అంతేకాదు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వాటికి అడ్జస్ట్ అవుతారు.

పెద్దలు కుదర్చిన పెళ్లి సక్సెస్ అయ్యేందుకు గల కారణాలేంటో తెలుసా...

పరిచయం లేకపోవడం వల్ల..

పరిచయం లేకపోవడం వల్ల..

పెద్దలు కుదర్చిన పెళ్లి చేసుకునే వారిలో చాలా మందికి ఓపిక ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీరు తమ పార్ట్నర్ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. వీరికి తమ పార్ట్నర్ విషయంలో పెద్దగా అంచనాలేవీ ఉండవు. ఎందుకంటే వీరికి పెళ్లికి ముందు ఒకరంటే ఒకరికి పెద్దగా పరిచయం ఉండదు. అందుకే వీరు తమ వ్యక్తిగత విషయాలను తెలుసుకునే పనిలో మునిగిపోతారు. దీంతో వీరికి బోర్ అనేదే కొట్టదు. అందుకే వీరిద్దరూ అంచనాలు పెంచుకోరు. కాబట్టి ప్రతి పెళ్లి తర్వాత ఆనందంగా గడిపేస్తారు.

ఏమి ఆశిస్తున్నారు..

ఏమి ఆశిస్తున్నారు..

పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకునే స్త్రీ, పురుషులకు చాలా విషయాల్లో స్పష్టత ఉంటుంది. పెళ్లి అనే రెండక్షరాల బంధంతో మీ పర్సనల్ లైఫ్ లోకి వచ్చే వ్యక్తి మీ నుండి ఏమి ఆశిస్తున్నారు.. మీతో ఏడడుగులు వేసేందుకు ఎందుకని ఆసక్తి చూపుతున్నారనే విషయాలపై ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి కారణాల వల్ల పెళ్లి తర్వాత మీ మధ్య గొడవలు, వాదనలు, మనస్పర్దలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

అన్ని విషయాలు..

అన్ని విషయాలు..

ఒకప్పుడు పెళ్లిళ్లు చేయాలంటే.. అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాల వారిని చూసేవారు. అయితే ఇప్పుడు అంతా ఓపిక, సమయం ఎవరికీ లేదు. కానీ ఉన్నంతలో.. తమకు తెలిసినంత వరకు ఇరు కుటుంబాల వారు అన్ని విషయాల గురించి ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలు, ఆస్తికి సంబంధించిన విషయాలు, తోబుట్టువులు, ఆడపడుచులు, ఇతర బంధువుల గురించి, వారి ఉద్యోగాలు, బిజినెస్ వంటి విషయాలన్నీ తెలుసుకుంటారు. అన్నింట్లోనూ తమకు అనుకూలం అనుకున్నప్పుడే ముందడుగు వేస్తున్నారు. దీని వల్ల పెళ్లి తర్వాత ఏదైనా సమస్య వచ్చినా అందుకు పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తారు.

ఆన్ లైనులో ఆ కార్యంలో పాల్గొనేటప్పుడు ఇవి మరిస్తే అంతే సంగతులు..!

సర్దుకుపోవడం కష్టం..

సర్దుకుపోవడం కష్టం..

పెద్దలు చేసిన పెళ్లిళ్లలో భార్యభర్తలిద్దరూ అన్ని విషయాల్లో సర్దుకుపోతే ఎలాంటి సమస్యా ఉండదు. అయితే ఎప్పుడైతే అడ్జస్ట్ అవ్వమని చెబితే.. అక్కడి నుండే అసలు పోరు షురూ అవుతుంది. అప్పటిదాకా తమ కుటుంబసభ్యులతో హాయిగా, స్వేచ్ఛగా గడిపిన తమకు ఒక్కసారిగా అత్తారింట్లో కొత్త సభ్యుల మధ్య అలా ఉండాలంటే కొంత ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాదు ఒకవేళ స్వేచ్ఛగా గడిపితే వారు ఏమనుకుంటారో అనే ఆందోళనా ఉంటుంది.

కొన్నిసార్లు త్యాగం..

కొన్నిసార్లు త్యాగం..

పెద్దలు చేసే పెళ్లిళ్లలో కొన్నిసార్లు వధూవరులిద్దరిలో.. వారికి ఇష్టం లేకుండానే పెళ్లి జరుగుతుంది. ఎందుకంటే పెద్దలు చిన్నప్పుడే తమ కూతురిని లేదా కుమారుడిని మీకిచ్చి పెళ్లి చేస్తామనే వాగ్దానాలు చేస్తుంటారు. ఆ మాట ప్రకారం పెద్దయ్యాక అలాగే చేస్తే.. అప్పుడు మన ఇష్టఇష్టాలను పట్టించుకోకుండా పెళ్లిళ్లు జరిగిపోతుంతాయి. తల్లిదండ్రుల కోసం ఈ విషయంలో త్యాగం చేయక తప్పదు.

కలిసి గడిపేందుకు..

కలిసి గడిపేందుకు..

పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ల కారణంగా.. భార్యభర్తలిద్దరికీ కొత్తలో ఏకాంతంగా కలిసి గడిపేందుకు అవకాశం దొరకదు. అస్తమానం ఎవరో ఒకరు కుటుంబసభ్యులు లేదా బంధువులు రావడం.. పోవడం వంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఇలాంటి సమయంలో కొంత బాధగా అనిపిస్తుంది. అంతేకాదు ఇద్దరూ కలిసి హాయిగా గడిపేందుకు కొంత సమయం ఇవ్వకపోవడమే కాకుండా.. పిల్లల గురించి శుభవార్త ఎప్పుడు చెబుతారని ఒకటే ఇబ్బంది పెడతారు.

English summary

Burdens and Benefits of Arranged Marriages in Telugu

Here we are talking about the burdens and benefits of arranged marriages in Telugu.
Story first published: Thursday, October 14, 2021, 16:52 [IST]