For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేస్తున్న సెలబ్రెటీలెవరో తెలుసా...?

మన దేశంలోని చాలా మంది సెలబ్రెటీలు రెండు పదుల వయసులో కాకుండా నాలుగు పదుల వివాహంలో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

|

ప్రేమ, ఇష్క్, ప్యార్, ప్రీతి ఈ రెండక్షరాలకు ఎంతో శక్తి ఉంది. ఇది ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో తెలియదు. ఎందుకు పుడుతుందో తెలియదు. కానీ ఇందులో పడిన వారి మనసు పులకించిపోతుంది. ఇదిలా ఉంటే కళ్యాణం వచ్చినా.. కక్కు వచ్చినా ఆగదని... అలాగే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలని మన పెద్దలు చెబుతూ ఉండేవారు.

Celebrities who got married after 40

అయితే అదంతా గతం... ప్రస్తుతం చాలా మంది పెళ్లి అనగానే తాము జీవితంలో సెటిల్ అయిన తర్వాత అలాంటి వాటి గురించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే దీని వల్ల తర్వాత అనేక సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా ఇవేవీ లెక్క చేయకుండా చాలా మంది ప్రస్తుతం మూడు పదుల వయసు దాటిన తర్వాత మూడు ముళ్లు తంతుకు సిద్ధమవుతున్నారు.

Celebrities who got married after 40

ఇదిలా ఉంటే సాధారణ యువతీ యువకులే లేటుగా పెళ్లిళ్లు చేసుకుంటుంటే.. కొందరు ప్రముఖులు వీరి కన్నా ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు చాలా ఫేమస్ స్టార్లు, నిర్మాతలు, డైరెక్టర్లు నాలుగు పదుల వయసు దాటిన తర్వాత పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇంతకీ ఆ సెలబ్రెటీలెవరో మీరే చూడండి..

మీ రాశిని బట్టి ఏ వయసులో మీరు వివాహం చేసుకోవాలో తెలుసుకోండి...!మీ రాశిని బట్టి ఏ వయసులో మీరు వివాహం చేసుకోవాలో తెలుసుకోండి...!

దిల్ రాజు-వైఘారెడ్డి(తేజస్విని)

దిల్ రాజు-వైఘారెడ్డి(తేజస్విని)

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజు 49 ఏళ్ల వయసులో ఇటీవలే వైఘా రెడ్డి(తేజస్విని)ని రెండో వివాహం చేసుకున్నారు. ఆయన భార్య మూడేళ్ల క్రితమే అనారోగ్యంతో మరణించింది. అయితే వీరిద్దరి మధ్య అంతకుముందే సన్నిహిత సంబంధమే ఉండేది. అదే వీరిద్దరి మధ్య రెండో వివాహానికి దారి తీసిందని ఇండస్ట్రీలో టాక్. అయితే ఇక్కడ విశేషమేమిటంటే దిల్ రాజు కూతురే పెళ్లి పెద్దగా వ్యవహరించిందనే పుకార్లు వినిపించాయి.

బోణీకపూర్ - శ్రీదేవి

బోణీకపూర్ - శ్రీదేవి

బాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన బోణీ కపూర్ 40 సంవత్సరాల వయసులో అతిలోక సుందరి శ్రీదేవిని వివాహం చేసుకుని ప్రపంచానికి షాకిచ్చారు. వీరిద్దరూ 1996లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అంతేకాదు ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చారు. అయితే అతిలోక సుందరి ప్రస్తుతం మనందరినీ విడిచి వెళ్లిపోయింది.

సంజయ్ దత్-మన్యత

సంజయ్ దత్-మన్యత

బాలీవుడ్ ప్రముఖ హీరోల్లో ఒకరైన సంజయ్ దత్ తన కంటే 19 సంవత్సరాలు తక్కువగా ఉన్న జూనియర్ మన్యతను 2008లో వివాహం చేసుకున్నారు. అయితే ఈ నటుడు వివాహం చేసుకునే సమయంలో ఎకె-47 రైఫిల్స్ ను అక్రమంగా తరలిస్తున్న కేసులో చిక్కుకున్నాడు. ఆ సమయంలో మన్యత సంజయ్ కు అండగా నిలిచింది. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంజయ్ దత్ వివాహం చేసుకునే సమయానికి అతని వయసు 49 సంవత్సరాలు.

టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ రెండో పెళ్లి పెద్ద ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు...!టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ రెండో పెళ్లి పెద్ద ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు...!

అమీర్ ఖాన్-కిరణ్ రావు..

అమీర్ ఖాన్-కిరణ్ రావు..

బాలీవుడ్ లో సంచనాలకు మారుపేరు.. విభిన్న సినిమాలను తీసే హీరోల్లో అమీర్ ఖాన్ తర్వాతే ఎవరైనా. ఈ హీరో కూడా తన వ్యక్తిగత జీవితంలో 45 సంవత్సరాల వయసులో రెండో పెళ్లి చేసుకున్నాడు. తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి కిరణ్ రావు అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు.

ఊర్మిళ - అక్తర్..

ఊర్మిళ - అక్తర్..

రంగిళ, క్రిమినల్, ఒకే ఒక్కడు సినిమాల్లో నటించి కుర్రకారుల మతి పోగొట్టిన బాలీవుడ్ భామ ఊర్మిళ కూడా 42 సంవత్సరాల వయసులో కాశ్మీర్ యువకుడు మీర్ మొహ్సిన్ అక్తర్ ను వివాహం చేసుకోవాలని 2006లో నిర్ణయించుకుంది.

సైఫ్ అలీ ఖాన్ - కరీనా కపూర్

సైఫ్ అలీ ఖాన్ - కరీనా కపూర్

రేస్ హీరో సైఫ్ అలీ ఖాన్ - బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ పెళ్లికి ముందే సుమారు నాలుగు సంవత్సరాల పాటు డేటింగ్ చేసుకున్నారు. 41 సంవత్సరాల వయసులో సైఫ్ అలీఖాన్ కరీనా కపూర్ ను పటాడిలో అధికారికంగా వివాహం చేసుకున్నాడు. అయితే అప్పటికే తన మొదటి వివాహం జరిగింది. అయితే 2004లో తన మొదటి భార్యకు విడాకులిచ్చి, అకస్మాత్తుగా కరీనాతో కాపురం చేస్తున్నాడు.

వివాహ ఆచారాలలో ఇలాంటివి కూడా ఉంటాయా? శోభనం గదిలోకి ముగ్గురు వెళ్తారంట...!వివాహ ఆచారాలలో ఇలాంటివి కూడా ఉంటాయా? శోభనం గదిలోకి ముగ్గురు వెళ్తారంట...!

ప్రీతి జింటా - జీన్

ప్రీతి జింటా - జీన్

ఐపిఎల్ ఫ్రాంఛైజీలో పంజాబ్ ను ఛేజిక్కుంచుకున్న మరో బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఏకంగా విదేశీయుడిని వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అది కూడా 41 ఏళ్ల వయసులో అమెరికాకు చెందిన జీన్ గూడెనఫ్ 2016లో లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు.

ఫరా ఖాన్ - శిరీష్

ఫరా ఖాన్ - శిరీష్

విభిన్న సినిమాల డైరెక్టర్ ఫరా ఖాన్ నాలుగు పదుల వయసులో తన కంటే తక్కువ వయసు ఉన్న కుర్రోడు శిరీష్ కుందర్ ను వివాహం చేసుకున్నారు. ఈ డైరెక్టర్ తొలిసారి శిరీష్ ను సెట్స్ లో కలుసుకుని, ఆ పరిచయం ప్రేమగా మారి కొన్ని సంవత్సరాలకే వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అంతేకాదు ముగ్గురు పిల్లలకు కూడా జన్మనిచ్చారు.

జాన్ అబ్రహం - ప్రియా..

జాన్ అబ్రహం - ప్రియా..

బాలీవుడ్ సిక్స్ ప్యాక్ స్టార్ గా మంచి పేరు తెచ్చుకున్న జాన్ అబ్రహం 2014లో లాస్ ఏంజెల్స్ లో యుఎస్ లో ఫైనాన్షియల్ అనలిస్ట్ మరియు ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ ప్రియా రుచల్ ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ 2010లో డిసెంబర్ లో ముంబైలో కలిశారు. అయితే పెళ్లికి ముందు వరకు జాన్ బిపాసా బసుతో సుదీర్ఘ సంబంధంలో ఉన్నాడు. అయితే 42 సంవత్సరాల వయసులో ఓ రహస్య వేడుకలో ప్రియాను పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చాడు.

సుహాసిని ములయ్ - అతుల్

సుహాసిని ములయ్ - అతుల్

Image Curtosy

సుహాసిని ములాయ్ ఇంటర్నెట్ ద్వారా తన ప్రేమ ప్రయాణం మొదలెట్టారట. తన భర్త భౌతిక శాస్త్రవేత్త అయిన అతుల్ గుర్తును తొలిసారి ఆన్ లైన్ లో కలిశారట.

అలా వారిద్దరూ ప్రేమించుకున్న తర్వాత 60 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్నారు. తన భర్త వయసు అప్పటికి 65 సంవత్సరాలు.

కబీర్ బేడీ - దుసాంజ్

కబీర్ బేడీ - దుసాంజ్

కబీర్ బేడీ తన భాగస్వామి పర్వీన్ దుసాంజ్ తో మూడోసారి వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి సన్నిహితులు, కటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు అందరూ హాజరయ్యారు. వీరిందరి సమక్షంతో వీరిద్దరూ ఘనంగా వివాహం చేసుకున్నారు. తను మూడో వివాహం చేసుకునే సమయానికి అతని వయసు 70 సంవత్సరాలు.

English summary

Celebrities who got married after 40

Here are the celebrities who got married after 40. Take a look
Story first published:Thursday, May 14, 2020, 16:42 [IST]
Desktop Bottom Promotion