Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
కొత్తగా పెళ్లయిన వారిలో ఈ లైంగిక సమస్యలు కామన్.. హైరానా పడాల్సిన పని లేదు
పెళ్లి అంటే ఎన్నో ఆశలు, కోరికలతో కూడుకుని ఉంటుంది. కొత్త వ్యక్తిని జీవిత భాగస్వామి చేసుకోవడం అంటే కొంత ఉత్సాహంగా, కొంత టెన్షన్ గా ఉంటుంది. కొత్త వ్యక్తితో కొత్త జీవితం ఎలా ఉంటుంది, ఇద్దరి మధ్య ఎలా సాన్నిహిత్యం పెరుగుతుంది, మనలో వాళ్లు బాగుంటారా, వారితో మనం అడ్జస్ట్ కాగలమా ఇలాంటి ప్రశ్నలు చాలానే మదిలో మెదలుతుంటాయి. అయితే పెళ్లైన కొత్తలో కొన్ని సమస్యలు మాత్రం సాధరణం. ఎందుకంటే కొత్త వ్యక్తి ఎలా ఉంటారన్నది అవగాహన ఉండదు, వారితో మనం ఎలా ఉండాలన్నది ఐడియా ఉండదు, కాబట్టి కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తాయి. అందులో శృంగార సమస్యలు కూడా ఉంటాయి.

పెళ్లి అయిన తర్వాత మూడు రాత్రులు ముచ్చటగా గడిచిపోతాయనుకుంటే పొరపడినట్లే. ఎందుకంటే చాలా మంది ఆ అనుభవానికి కొత్త కాబట్టి కొన్ని సమస్యలు వస్తాయి. సాన్నిహిత్యం అంత త్వరగా మొదలవ్వదు. మనం అనుకున్నంత త్వరగా కెమిస్ట్రీ సెట్ కాదు. ఎన్నో అనుమానాలు ఉంటాయి.
పెళ్లైన కొత్త జంటలు ఎలాంటి శృంగార సమస్యలు ఎదుర్కొంటారు, వాటి నుండి ఎలా బయట పడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

లైంగిక సంబంధిత సందేహాలు
కొత్త జంటలు సాధారణంగా వివాహం తర్వాత వారి లైంగిక కోరికలో చాలా హైలో ఉంటారు. ప్రతి రోజు 2, 3 అంతకంటే ఎక్కువ సార్లు శృంగారం చేయాలని కోరుకుంటారు. అసలు శృంగారం గురించి తెలియకముందు ఇలాంటి కోరికలు ఉంటాయి. బుక్స్ చదవడం, వీడియోలు చూసి ఏదో ఊహించుకుంటారు. శృంగారం గురించి తెలుసుకోవడం వేరు, అనుభవించడం వేరు. ఒకసారి అనుభవించిన తర్వాత మొదట అనుకున్న ఆశలు, కోరికలు మారిపోతాయి. ఇది కొంత అసంతృప్తి గురిచేసే అవకాశం ఉంటుంది.

గర్భ నిరోధకాలను ఉపయోగం
శృంగారం విషయంలో చాలా మంది పురుషులకు ఎలాంటి అనుభవం ఉండదు. కొంతమందికి కండోమ్ ఎలా వాడాలో కూడా తెలిసి ఉండకపోవచ్చు. అలాంటి పురుషులు శృంగారం సమయంలో చాలా ఇబ్బంది పడతారు. ఈ టెన్షన్ వల్ల అంగం కూడా సరిగ్గా స్తంభించదు. ఈ పరిస్థితికి ఎలా స్పందించాలో భార్యకు కూడా తెలిసి ఉండదు. పురుషులు ఈ పరిస్థితి చాలా అవమానంగా భావిస్తారు.

అభిరుచి లేకపోవడం
చాలా మంది పురుషులు స్ఖలనాన్ని ఎక్కువ సేపు ఆపుకోలేరు. శృంగారం ప్రారంభమైన కొద్దిసేపట్లోనే స్ఖలనం అవుతుంది. దీని వల్ల ఎన్నో ఆశలు, కోరికలతో శృంగారం చేయాలనుకున్న ఇద్దరు భాగస్వాముల్లోనూ అసంతృప్తి వచ్చేస్తుంది. త్వరగా స్ఖలనం కావడం పట్ల పురుషులు అవమానకరంగా ఫీల్ అవుతుంటారు.
దీని వల్ల మరోసారి కలవాలన్నా ఆ భయం వారిని వెంటాడుతుంది. క్రమంగా శృంగారం అంటే ఇష్టం లేకుండా పోతుంది. దాని నుండి తప్పించుకోవాలని చూస్తారు. ఈ సమస్యను పరిష్కరించడానికి మార్గం శృంగారంలో తరచూ పాల్గొనడమేనని వైద్యులు సూచిస్తున్నారు. స్ఖలనం త్వరగా పడిపోకుండా ప్రాక్టీస్ చేయడం చాలా మంచి ఫలితం ఇస్తుందని వారు సూచిస్తున్నారు.

అపోహలను నమ్మడం
మొదటి రాత్రి స్త్రీకి రక్తస్రావం జరుగుతుందన్న పురాతన కాలం నాటి అపోహను నమ్మడం. ఇలాంటి వాటిని నమ్మడం వల్ల శృంగార జీవితాన్ని ఆస్వాదించలేరు. వీటిని బలంగా నమ్మే వ్యక్తి భర్త అయితే వివాహంలో సమస్యలు మొదటి రాత్రి నుండే మొదలు అవుతున్నట్లు గమనించాల్సిందే.
అలాగే పురుషుడు స్త్రీని సంతృప్తి పరచలేకపోతే అతను అవమానాన్ని ఎదుర్కోవాల్సి రావొచ్చు. దాని వల్ల తీవ్రమైన ఒత్తిడి కూడా ఉంటుంది.

కమ్యూనికేషన్ లేకపోవడం
చాలా మంది కొత్త దంపతులు ఒకరితో ఒకరు మాట్లాడటానికి సిగ్గు పడుతుంటారు. శృంగారం విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. వారికి ఏం కావాలి అనేది చెప్పలేరు. ఎదుటివారికి ఏం కావాలో చెప్పడం వల్ల ఇద్దరూ సంతృప్తి పడవచ్చు. కాబట్టి కొద్దిగా చనువు తీసుకుని కమ్యూనికేట్ చేయడం చాలా ముఖ్యం. శృంగారానికి సంబంధించిన విషయాలను డైరెక్ట్‌గా చెప్పలేకపోతే సంజ్ఞలు, సంకేతాలు, రాతల ద్వారా అయినా తెలియజేయాలి.



Click it and Unblock the Notifications