క్రికెటర్లతో మూడు ముళ్లు వేయించుకున్న బాలీవుడ్ అందాల భామలెవరో తెలుసా...

ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ కింగ్ కోహ్లీ స్టార్ బ్యాట్స్ మెన్ గా, పరుగుల యంత్రంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.

క్రికెట్ అనే జెంటిల్మెన్ గేమ్ కు మన దేశంలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత సినిమాలను ఎక్కువ మంది ఇష్టపడతూ ఉంటారు. ఈ రెండింటీకి ప్రజల్లో విపరీతమైన గ్లామర్ కూడా ఉంది. మరీ ఈ రెండూ ఓ చోట చేరితే అంతకన్నా అదృష్టం ఎవరికి ఉంటుంది.

Cricketers who married Film actresses

మనలో సామాన్యుల నుండి సెలబ్రిటీల దాకా క్రికెటర్లను పెళ్లి చేసుకోవాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటారు.అయితే అలాంటి అవకాశం అందరికీ దక్కదు. అయితే కొందరు బాలీవుడ్ తారలకు మాత్రం వద్దన్నా కూడా క్రికెటర్ల నుండి పెళ్లి ప్రతిపాదనలు.. లవ్ ప్రపోజ్ లు వస్తుంటాయి.

Cricketers who married Film actresses

అందుకే మన దేశంలో అనేక మంది వీరి గురించి ఏ చిన్న రూమర్ వచ్చినా తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపుతుంటారు. ఇటీవలే తెలుగు హీరోయిన్ అనుష్క పెళ్లి ఓ ఇండియన్ క్రికెటర్ తో జరగబోతున్నట్లు పుకార్లు షికారు చేశాయి. అయితే ఇదంతా అబద్ధమని తేలిపోయింది.

Cricketers who married Film actresses

అయితే కొందరు క్రికెటర్లు మాత్రం తమ వ్యక్తిగత జీవితంలో మొత్తం గ్లామర్ కే చోటు కల్పించారు. దీంతో ఇలాంటి వాటి గురించి తెలుసుకోవడానికి సామాన్యులు చాలా ఇంట్రెస్ట్ చూపుతుంటారు. ఈ సందర్భంగా ఇండియన్ టీమ్ లో ఆడిన క్రికెటర్లలో ఎవరెవరు సినిమా రంగానికి చెందిన అందాల ముద్దుగుమ్మలను పెళ్లి చేసుకున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం...

విరుష్క...

విరుష్క...

ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ కింగ్ కోహ్లీ స్టార్ బ్యాట్స్ మెన్ గా, పరుగుల యంత్రంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే విరాట్ కోహ్లీ తన లవ్ ట్రాక్ ను కూడా అంతే స్పీడ్ గా నడిపాడు. క్రికెట్ లో గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలోనే బాలీవుడ్ అందాల భామ అనుష్క శర్మతో ప్రేమాయణం నడిపాడు.

2017లో వివాహం..

2017లో వివాహం..

అయితే విరుష్క జంటను చూసి అందరూ మెచ్చుకున్నారు. అయితే అంతే స్థాయిలో వీరిద్దరూ విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. కోహ్లీ క్రికెట్ లో తక్కువ పరుగులకు అవుటైన ప్రతిసారీ అనుష్కనే కారణమని అందరూ నిందించేవారు. అయితే వీటన్నింటిని అధిగమించి విరుష్క జంట 2017లో వివాహ బంధంతో అందరి నోళ్లు మూయించారు. ప్రస్తుతం వీరిద్దరూ క్రికెట్ ఆడటానికి విదేశాలకు వెళ్తుంటే.. అనుష్క శర్మ కూడా తనకు తోడుగా వెళ్తూ అక్కడి టూర్లను ఎంజాయ్ చేస్తోంది.

సిక్సర్ల కింగ్...

సిక్సర్ల కింగ్...

ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టి సింగ్ ఈజ్ కింగ్ అని యువరాజ్ సింగ్ ఎప్పుడో నిరూపించాడు. ఈ యువ రాజ కుమారుడు చాలా మంది హీరోయిన్లతో ప్రేమ వ్యవహారాలు నడిపినట్టు కూడా వార్తలు వెలుగులోకి వచ్చాయి.

యువీ-హ్యజెల్ కీచ్...

యువీ-హ్యజెల్ కీచ్...

యువరాజ్ సింగ్ తర్వాత క్యాన్సర్ బారిన పడ్డాడు. అమెరికాలో చికిత్స తర్వాత మన యువీకి హ్యజెల్ కీచ్ తో పరిచయమైంది అయితే ఈ ఇద్దరిలో ప్రేమ ప్రస్తావన తెచ్చింది మాత్రం యువ రాజ కుమారుడేనట. దాదాపు రెండు సంవత్సరాల నిరీక్షణ తర్వాత హ్యజెల్ మన యువీ ప్రేమను అంగీకరించిందట. వీరి వివాహం 2016లో జరిగింది.

భజ్జీ-గీత బస్రా

భజ్జీ-గీత బస్రా

టర్బోనేటర్ హర్భజన్ సింగ్ కూడా బాలీవుడ్ అందాల భామ గీత బస్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ పెళ్లికి ముందే దాదాపు అయిదు సంవత్సరాల పాటు ప్రేమలో మునిగి తేలారు. వీరు కూడా చాలా మంది జంటల మాదిరిగానే ప్రేమలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. వీరిద్దరూ 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరి ప్రేమ బంధానికి ప్రతీకగా 2016లో హీనాయ పుట్టింది.

జహీర్-సాగరికా..

జహీర్-సాగరికా..

అందరి లాగానే జహీర్ ఖాన్-సాగరికా జంటపై వివాహానికి ముందు వివాదం నడిచింది. ముఖ్యంగా యువరాజ్ సింగ్ - హ్యజెల్ కీచ్ పెళ్లిలో జహీర్-సాగరికా కలిసి ఎంట్రీ ఇచ్చినప్పుడు వీరిద్దరి మధ్య ఉన్న సంబంధంపై ఎన్నో పుకార్లు వచ్చాయి. వీరిద్దరూ కూడా సుమారు 9 నెలల వరకు డేటింగ్ చేసుకుని, ఆ తర్వాత ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. వీరిద్దరూ కూడా 2017లో వివాహం చేసుకున్నారు.

అజార్-సంగీత

అజార్-సంగీత

మన దేశ క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ మరియు ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ క్రికెటర్ మాత్రం ఒక్క పెళ్లితో సరిపెట్టుకోలేదు. ఈ ఆటగాడు 1996లో హిందీ నటి & మిస్ ఇండియా అయిన సంగీత బిజ్లానీని రెండో వివాహం చేసుకున్నాడు. అయితే ఈమెతో కూడా విడిపోయినట్లు వార్తలు వచ్చాయి.

అలీఖాన్ పటౌడీ-షర్మిల

అలీఖాన్ పటౌడీ-షర్మిల

ఒక సినిమా తారను ఓ క్రికెటర్ పెళ్లి చేసుకోవడం అనేది మాత్రం వీరిద్దరి నుండి తొలిసారిగా ప్రారంభమైంది. షర్మిల ఠాగూర్ & మన్సూర్ అలీ ఖాన్ పటౌడీల వివాహం 1969లో జరిగింది. అప్పట్లో వీరి వివాహం దేశ వ్యాప్తంగా బాగా చర్చనీయాంశమైంది. వీరి బంధం ఎక్కువ రోజులు కొనసాగదు అంటూ వినిపించిన మాటలకు వీరిద్దరూ తమ ప్రేమ బంధంతోనే సమాధానం చెప్పారు. వీరిద్దరికి ముగ్గురు సంతానం కూడా ఉన్నారు. వీరిలో ఒకరు సైఫ్ అలీ ఖాన్ కాగా.. హీరోయిన్ గా సోహా అలీ ఖాన్ అద్భుతంగా రాణిస్తున్నారు.

చూశారు కదా.. స్టార్ క్రికెటర్లు మరియు సినీ తారల ప్రేమ & పెళ్లి బంధంతో ఒక్కటైన వీరి జోడిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ల విభాగంలో తెలియజేయగలరు.

Story first published: Monday, February 17, 2020, 17:56 [IST]
Desktop Bottom Promotion