For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Dhanush Divorce:కపుల్స్ మధ్య విడిపోయేంత దూరం పెరిగేందుకు ప్రధాన కారణాలేంటో తెలుసా...

|

సినిమా ప్రపంచంలో సెలబ్రిటీ కపుల్స్ ఎంత వేగంగా ప్రేమలో పడతారో తెలీదు.. ఆ బంధాన్ని పరిణయం దాకా తీసుకెళ్తారు. కానీ కొందరు ఎంత వేగంగా ప్రేమలో పడతారో.. అంతకన్న వేగంగా విడిపోతూ ఉంటారు..

మరికొందరు దీర్ఘకాలం పాటు రిలేషన్ షిప్ కొనసాగించి.. పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు తీసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇటీవలే మన టాలీవుడ్ లో అక్కినేని నాగచైతన్య, సమంత జంట ఏడేళ్ల తమ వివాహ బంధానికి విడాకులతో వీడ్కోలు పలికారు. ఇది మరచిపోకముందే.. తాజాగా మరో సెలబ్రిటీ కపుల్ తమ వివాహ బంధానికి ముగింపు చెబుతున్నట్లు ప్రకటించారు.

ఇప్పుడు తమిళ హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ తో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ స్టార్ కపుల్ విడిపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఎంతో కాలం పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు.. 18 సంవత్సరాల అనంతరం తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు.

ఇంతకాలం మంచి స్నేహితులుగా, భార్యభర్తల్లాగా.. పేరేంట్స్ గా.. పరస్పర శ్రేయోభిలాషులుగా కలిసి జీవించామని.. అయితే ఇప్పుడు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నామని.. తమ నిర్ణయాన్ని గౌరవించాలని సోషల్ మీడియా వేదికగా ఈ జంట విజ్ణప్తి చేశారు. ఈ సందర్భంగా విడాకులు తీసుకోవడానికి ప్రధాన కారణాలేంటి.. సాధారణంగా జంటలు ఎందుకని విడిపోవాలనుకుంటారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

స్వార్థపూరిత వ్యక్తుల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసా...

ఈగోల కారణంతో..

ఈగోల కారణంతో..

అకస్మాత్తుగా ధనుష్, ఐశ్వర్య కపుల్ విడిపోవడానికి కారణాలివేనంటూ చాలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కొన్ని సంవత్సరాల క్రితం సుచిలీక్స్ సంఘటనలో ధనుష్ ఫొటోలు కూడా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వారిద్దరి మధ్య గొడవలు జరిగాయట. అయితే అప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ జోక్యంతో వీరిద్దరూ కలిసిపోయారట. అయితే వీరిద్దరి మధ్య మరోసారి ఈగో ప్రాబ్లం తలెత్తిందని.. ఇటీవలి కాలంలో ధనుష్ ఓ హీరోయిన్ తో క్లోజ్ గా ఉంటున్నాడని.. అది ఐశ్వర్యకు తెలియడంతో వారిద్దరి దూరం మరింత పెరిగినట్లు తెలుస్తోంది..

మాటలు కరువైతే..

మాటలు కరువైతే..

చాలా సందర్భాల్లో ఆలుమగలిద్దరూ ఒకేచోట కూర్చుంటారు. అయితే చూడటానికి ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నప్పటికీ.. వారు లాప్ టాప్ లేదా ఫోన్ తో బిజీగా గడిపేస్తూ ఉంటారు. దీంతో వీరిద్దరి మధ్య మాటలు కరువవుతాయి.. ఇలాంటి కారణం వల్ల వారి మధ్య బంధంలో దూరం పెరుగుతుంది. పక్కపక్కనే ఉన్నప్పటికీ కూడా ఎవరి పనిలో వాళ్లు ఉండటం వల్ల వారి ప్రేమ మాయమైపోతుంది.

భావోద్వేగాలకు దూరంగా..

భావోద్వేగాలకు దూరంగా..

మన సమాజంలో చాలా మంది జంటలు భావోద్వేగాలకు దూరంగా ఉంటారు. ఇలాంటి సంఘటనలు భార్యభర్తల మధ్య దూరాన్ని మరింత పెంచుతాయి. దీంతో సరైన కమ్యూనికేషన్ అనేదే ఉండదు. ఈ కారణంగా వివాహ బంధంలో అనేక సమస్యలు వస్తాయి. దీని వల్ల భార్యభర్తలు విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

పెళ్లికి ముందే మీ చిన్న చిన్న కోరికలన్నీ తీర్చేసుకోండి...!

బాధ్యతగా లేకపోతే..

బాధ్యతగా లేకపోతే..

భార్యభర్తల బంధం అంటేనే.. ఎన్నో బరువులు.. బాధ్యతలు ఉంటాయి.. ఈ బంధంలో ఇద్దరూ చాలా బాధ్యతగా వ్యవహరించాలి. ఇలాంటి సమయంలో ఏ ఒక్కరు బాధ్యతగా లేకున్నా.. అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. ఇలాంటప్పుడే వారు మిమ్మల్ని అస్సలు పట్టించుకోకుండా ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్యం.. ఆనందం వంటి విషయాల్లో పట్టించుకోకుండా ఉంటే.. అనేక సమస్యలు వస్తాయి.

చెడు అలవాట్లు..

చెడు అలవాట్లు..

మద్యం తాగడం.. పొగ తాగడం వంటి చెడు అలవాట్లకు బానిసగా మారడం.. నిత్యం భాగస్వామిని వేధించడం.. ఇలాంటి వాటిని కంట్రోల్ చేసుకోకపోయినా భార్యభర్తల మధ్య ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి.

రొమాన్స్ విషయంలో..

రొమాన్స్ విషయంలో..

చాలా మంది భార్యభర్తలకు రొమాన్స్ విషయంలో ఎంతో ఆసక్తిగా ఉంటుంది. అయితే పిల్లలు పుట్టిన తర్వాత భార్య లేదా భర్తలో ఎవరో ఒకరికి ఆ కార్యంపై ఆసక్తి తగ్గిపోతుంది. లేదంటే ఇద్దరూ కలిసి ఏకాంతంగా సమయం దొరకకపోవచ్చు. దీంతో హ్యాపీ లైఫ్ లో సమస్యలు ప్రారంభమవుతాయి. వీటివల్ల కూడా ఎక్కువ ఇబ్బందులొస్తాయి. ఇలాంటి కారణాల వల్ల భార్యభర్తల మధ్య దూరం పెరిగిపోయి.. విడిపోవచ్చు.

పక్కచూపులు..

పక్కచూపులు..

ప్రస్తుత సమాజంలో పెళ్లి చేసుకున్నప్పటికీ.. ఇతరులు తమ భాగస్వామి కంటే అందంగా ఉంటే చాలు.. వారి వైపు చూపు మళ్లుతుంది. ఆ సమయంలో ఆటోమేటిక్ గా తమ భాగస్వామిపై ఆసక్తి తగ్గిపోతుంది... ఇతరులపై మోజు పెరుగుతుంది. ఈ కారణంగా కూడా తమ భాగస్వామితో వివాహ బంధాన్ని తెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

తమిళ హీరో ధనుష్ ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రముఖ వ్యక్తి ఎవరు?

తమిళ హీరో ధనుష్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా, పరస్పర శ్రేయోభిలాషులుగా 18 ఏళ్లు పాటు హాయిగా బతికారు. అయితే జనవరి 2022లో మాత్రం విడిపోవాలని నిర్ణయించుకున్నారు.

English summary

Dhanush announce Divorce With Aishwarya Rajanikanth: Know Common Reasons Marriages End in Telugu

Here we are discussing about the dhanush divorce with aishwarya rajanikanth:know common reasons marriages end in Telugu.
Story first published: Wednesday, January 19, 2022, 14:11 [IST]
Desktop Bottom Promotion