Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఆమెకు 12.. ఆయనకు 34.. అయినా వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది...
దిలీప్ కుమార్, సైరా భాను నిజమైన ప్రేమ కథ గురించి తెలుసుకుందామా...
ఆమెకు 12 సంవత్సరాలు.. ఆయనకు 34 సంవత్సరాలు. వారిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువున్నా ముందుగా వారి చూపులు కలిశాయి.. ఆ తర్వాత మనసులు కూడా ఒక్కటయ్యాయి..

అంతే వారి ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చేసుకున్నారు. వారిద్దరి మధ్య ఏకంగా 22 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న కూడా అందరూ అంత ఏజ్ గ్యాపా అని అనుకూంటూ ఉంటే.. 'మాది దేవుడు కలిపిన బంధం' అంటూ చిలకా గోరింకల్లా కలిసిపోయారు.

వారెవరో కాదు బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ - సైరా భాను. తొలిచూపులోనే ప్రేమలో పడిన వీరిద్దరూ తమ బంధాన్ని పరిణయం వరకు తీసుకెళ్లేందుకు మాత్రం సుమారు ఆరు సంవత్సరాలు పట్టింది. తమ 54 సంవత్సరాల వివాహ జీవితంలో ఎన్నో మధుర క్షణాలున్నాయని.. ఎంతో మంది కొత్త జంటలకు వీరు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఈ ప్రేమ జంట లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం...

12 ఏళ్లకే ప్రేమలో..
‘ఎంతోమంది అమ్మాయిల కళ్లు అతని వైపే చూస్తున్నా.. తొలి చూపులోనే తనను నా భర్తగా ఊహించుకున్నా'నంటూ దిలీప్ గురించి ఓ ఇంటర్వ్యూలో సైరా భాను చెప్పుకుని మురిసిపోయారు. తనకు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు.. దిలీప్ కు 34 సంవత్సరాలు. అనంతరం నాలుగేళ్ల తర్వాత తనను తొలిసారిగా కలిసే అవకాశం వచ్చిందని.. ఆ సమయంలో దిలీప్ తనను కళ్లతో పలకరించాడని ఓ సందర్భంలో చాప్పారు.

నా మనసుకు రెక్కలు..
‘దిలీప్ నా వైపు చూసి ఓ నవ్వు నవ్వాడు. ఈ అమ్మాయి ఎంతో అందంగా ఉందన్నట్లుగా చెబుతోంది ఆ చూపు. అంతే నా మనసుకు రెక్కలొచ్చినట్టయ్యింది. అప్పటికే నా మనసు లోతుల్లో ముద్రపడిపోయిన అతని ప్రతిరూపాన్ని ఆరాధించడం మొదలుపెట్టా. అతన్నే నా నా భర్తగా ఊహించుకున్నా' అంటూ తన మధురక్షణాలను గుర్తు చేసుకున్నారు సైరా.

అప్పట్లో చూపులతోనే..
అప్పటి కాలంలో ప్రేమలన్నీ ఎక్కువగా చూపులతోనే ఉండేవి. తమకిష్టమైన వారిని ఎంతగా ప్రేమిస్తున్నా.. పెదవి దాటి మాట బయటకు వచ్చేది కాదు. కళ్లతోనే మాట్లాడుకోవడం.. వంటివి చేసే వారు. సైరా-దిలీప్ కూడా కొంతకాలం పాటు మూగ ప్రేమను కొనసాగించారట. అయితే వీరిద్దరి ప్రేమను పరిణయం దాకా తీసుకెళ్లిన ఘనత మాత్రం సైరా తల్లి నసీమ్ భానుకే దక్కుతుంది. వీరిద్దరూ కలవడానికి ఆమె కీలక పాత్ర పోషించారనే చెప్పాలి.

1996లో వివాహం..
అలా ఓ మంచి సమయం చూసి సైరాకు దిలీప్ తన ప్రేమ విషయాన్ని చెప్పడంతో.. అప్పటికే తన మనసులో భర్తగా దిలీప్ ను ఊహించుకున్న ఆమె తన ప్రేమకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అలా వీరిద్దరూ 1996లో ఒక్కటయ్యారు.

అంత ఏజ్ గ్యాపా..
వీరిద్దరూ పెళ్లి చేసుకున్నాక అప్పట్లో అందరూ వీరి గురించే మాట్లాడుకునేవారట. ఏకంగా 22 సంవత్సరాల ఏజ్ గ్యాప్ వల్ల వీరు విడిపోతారేమో.. అంత గ్యాప్ ఉంటే కచ్చితంగా గొడవలు వస్తాయని భావించేవారు. కానీ ఈ జంట మాత్రం అలాంటి వాటిని అస్సలు పట్టించుకోలేదు. ప్రేమలో నిజాయితీ ఉంటే చాలు.. వయసుతో పనేముంది అని తమ అనుబంధంతో నిరూపించారు.

హీరోయిన్ గా తిరస్కరణ..
దిలీప్ కుమార్ తను రాసుకున్న ‘Dilip Kumar:The Substance and the Shadow' అనే ఆత్మకథలో సైరా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. తనను హీరోయిన్ గా చాలా సార్లు తిరస్కరించారట. ఎందుకంటే తన కంటే వయసులో చాలా చిన్నగా ఉండటమే ఇందుకు కారణమట. అయితే హీరోయిన్ గా తిరస్కరించినప్పటికీ.. తన అందమైన రూపాన్ని మాత్రం మనసులో నుండి తొలగించలేకపోయాను అని రాసుకొచ్చాడు దిగ్గజ నటుడు దిలీప్.

‘నా కొహీనూర్ డైమండ్’
దిలీప్ ను సైరా భాను ముద్దుగా కోహినూర్ అని పిలుచుకునే వారట. అయితే పెళ్లి తర్వాత అంటే 1972 సంవత్సరంలో తొలిసారి ప్రెగ్నెన్సీ తర్వాత ఆమెకు ఎనిమిదో నెలలో అబార్షన్ అయ్యింది. పుట్టిన బిడ్డ కూడా వెంటనే మరణించాడు. ఆ తర్వాత మళ్లీ ప్రెగ్నెన్సీ రాలేదు. ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదని డాక్టర్లు స్పష్టం చేశారు. దీంతో పలు కారణాల వల్ల హైదరాబాద్ కు చెందిన ఆస్మా రెహ్మాన్ అనే మహిళను దిలీప్ రెండో వివాహం చేసుకున్నారు. కానీ ఆ బంధం రెండేళ్లకే కూలిపోయింది. ఇంత జరిగినా కూడా దిలీప్ నా వాడే అంటారు సైరా.

54 ఏళ్ల వైవాహిక జీవితం..
తమ 54 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎన్ని కష్టాలెదురైనా.. అన్నింటినీ అధిగమించింది ఈ జంట. భర్త అనారోగ్యానికి గురైనప్పుడల్లా తనకు సేవలు చేస్తూ ఉత్తమ భార్య అని నిరూపించుకున్నారు. ఇలా క్షణమైనా ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా ప్రేమను నింపుకున్నారు ఈ ఐకానిక్ కపుల్.



Click it and Unblock the Notifications