For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లి తర్వాత ప్రేమ పుడుతుందా? భర్తతో కలిసి రైలులో వెళ్తుంటే క్లాస్ మేట్ కనిపించాడు.. ఆ తర్వాత?

పెళ్లి తర్వాత ప్రేమ అనేది మారుతుందా? భార్యగా మారిన తర్వాత మహిళలు ఎలాంటి విషయాలను గ్రహిస్తారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

సాధారణంగా పెళ్లి(Marriage) అయిన కొత్తలో ప్రతి ఒక్కరికీ చాలా కొత్తగా ఉంటుంది. అంతా ఆనందంగా గడిచిపోతూ ఉంటుంది. అయితే అందరూ కోరుకున్నట్టు వాస్తవ జీవితం మాత్రం అలా ఉండదు.

Does love changes after marriage

తన విషయంలో కూడా అదే జరిగిందంటూ ఓ వివాహిత తన మ్యారేజ్ లైఫ్ గురించి చెప్పుకొచ్చింది. తాను డిగ్రీ చదువుతున్నప్పుడే తన అభిప్రాయం లేకుండా పెళ్లి ఫిక్స్ చేశారు తల్లిదండ్రులు.. వారి మాటలకు కట్టుబడి పెళ్లి ఒప్పుకుందామె.
Does love changes after marriage

ఎందుకంటే తనకు అప్పటివరకు ఎలాంటి ప్రేమ బంధం లేదు. కేవలం విద్యపై ఎక్కువ ఫోకస్ పెట్టేదట. ఇక డిగ్రీ పూర్తయిన వెంటనే పేరేంట్స్ వారి భారం తగ్గించుకోవడానికి పెళ్లి చేసేశారట. పెళ్లైన కొత్తలో అంతా బాగానే ఉండేదట. ఏడాది తర్వాత తను ఒక పాపకు జన్మనిచ్చిందట. ఆ తర్వాతే అసలు కథ మొదలైందని గ్రహించిందట.

Does love changes after marriage

పాప పుట్టిన తర్వాత తన భర్త తనను ఏ మాత్రం పట్టించుకోవడం లేదట. తను ఎంతలా ప్రయత్నించినా.. సహకరించే వాడు కాదట. అలా ఓ రోజు తను ట్రైనులో ఊరికి వెళ్తుంటే.. తన కాలేజీ ఫ్రెండ్ కనిపించాడు.. క్యాజువల్ గా పలకరిస్తే.. బాగున్నా అన్నాడు. అయితే తను అప్పుడు చెప్పిన మాటలు నా మనసుకు ఎంతో బాధను కలిగించాయి.. అంతే ఆ క్షణం నుండి తన గురించే ఆలోచించడం మొదలుపెట్టింది. అక్కడితో ఆగకుండా తన భర్తకు విడాకులిచ్చి.. తనతో వెళ్లిపోవాలని భావించిందట.. అయితే తనకు ఎందుకని అలా అనిపించింది.. తన ఫ్రెండ్ ఏం మాట్లాడాడు? తన భర్తను వదిలి బాయ్ ఫ్రెండ్ తో వెళ్లిపోయిందా లేదా అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మీ భర్త 'ఇలా' ప్రవర్తిస్తే.. ఫేక్ రిలేషన్ షిప్ లో ఉన్నట్టే..!మీ భర్త 'ఇలా' ప్రవర్తిస్తే.. ఫేక్ రిలేషన్ షిప్ లో ఉన్నట్టే..!

ఎంత కో-ఆపరేట్ చేసినా..

ఎంత కో-ఆపరేట్ చేసినా..

హాయ్ ‘నా పేరు అనూష(పేరు మార్చాం). నాకు పెళ్లి జరిగి మూడేళ్లు అవుతోంది. నాకు ఒక పాప కూడా పుట్టింది. పాప పుట్టినప్పటి నుండి తను నాతో హ్యాపీగా ఉండటం లేదు. నాతో ఎందుకో దూరంగా ఉంటున్నాడు. నేను ఎంత కోఆపరేట్ చేసినా కోప్పడేవాడు. అయినా అన్నీ భరించి మౌనంగా ఉండేదాన్ని.

ఓ రోజు రైలులో..

ఓ రోజు రైలులో..

అయితే ఏదో పని నిమిత్తం నేను మా వారితో కలిసి రైలులో వెళ్తుండగా.. నాకు టాయ్ లెట్ వద్ద నా కాలేజీ ఫ్రెండ్ కనిపించాడు. తనను నేను గుర్తు పట్టలేదు. తను మాత్రం నన్ను గుండెల్లో గుడి కట్టుకున్నాడని ఆరోజే తెలిసింది. తన పేరు చెప్పి.. కాలేజీ కబుర్లు చెప్పి అన్నీ గుర్తు చేశాడు.

పెళ్లి చేసుకోలేదా?

పెళ్లి చేసుకోలేదా?

అప్పుడే తనను నీకెంత మంది పిల్లలు.. అని అడిగితే.. తను నేనింకా పెళ్లి చేసుకోలేదని.. నేను నిన్ను నిజాయితీగా ప్రేమించానని.. నా జీవితంలో నిన్ను తప్ప వేరొకరిని ఊహించుకోలేనని చెప్పాడు. జీవితాంతం ఇలాగే ఉంటానని చెప్పాడు. నాకు పెళ్లైందని, పాపు కూడా ఉందని చెప్పినా.. అది కూడా తనకు తెలుసని.. అయినా నన్ను ప్రేమిస్తూనే ఉన్నా అని చెప్పేసరికి నా కళ్లలో నీళ్లు తిరిగాయి.

కారులో ఆ కార్యం కానిచ్చేస్తున్నారా? అయితే ఇవి తప్పక తెలుసుకోవాల్సిందే...కారులో ఆ కార్యం కానిచ్చేస్తున్నారా? అయితే ఇవి తప్పక తెలుసుకోవాల్సిందే...

నేను ఒప్పుకుంటే..

నేను ఒప్పుకుంటే..

అంతేకాదు.. నేను ఒప్పుకుంటే ఈ క్షణం కూడా నన్ను పెళ్లి చేసుకునేందుకు రెడీ అన్నాడు. అప్పుడు నాకు చాలా బాధ కలిగింది. నా కోసం ఒక వ్యక్తి పెళ్లైనా వెయిట్ చేయడం చాలా ఇబ్బందిగా అనిపించింది.

కాలేజీ రోజుల్లో నాకు చాలా మందే ప్రపోజ్ చేశారు. కానీ నేను అప్పుడు కేవలం స్టడీస్ పైనే ఫోకస్ పెట్టడం వల్ల అన్నింటినీ రిజెక్ట్ చేశాను. కానీ నేను అప్పుడు వద్దన్నా.. నేనే లోకం అనుకుని జీవిస్తున్నాడు నా క్లాస్ మేట్.. అంతేకాదు నాకు జ్వరం వచ్చినప్పుడు, నాకు తెలియకుండా మా ఇంటికి మందులు కూడా పంపేవాడు.

తన గురించే ఆలోచనలు..

తన గురించే ఆలోచనలు..

ఆ క్షణం గురించి తన గురించే ఆలోచిస్తూ.. నేను ఒక నిర్ణయానికి వచ్చేశాను. నేను నా ప్రస్తుత భర్తకు విడాకులిచ్చేసి.. పాపతో కలిసి తనతో వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యాను. నేను డిగ్రీ చదివాను కాబట్టి.. ఏదో ఒక జాబ్ చేసి నేను నా కాళ్ల మీద నిలబడగలను అని భావించాను. అయితే ఎందుకైనా మంచిదని నిపుణులను సంప్రదించగా వారు కొన్ని ప్రశ్నలు వేశారు. దీంతో నేను మళ్లీ ఆలోచనలో పడ్డాను.

ఆ ప్రశ్నలతో..

ఆ ప్రశ్నలతో..

తను రైలులో కనిపించాడు కాబట్టి అలాంటి ఫీలింగ్ కలిగిందా? లేదా అంతకుముందే ఇలా అనిపించేదా? ఇప్పుడు భర్తతో బంధం బాగోలేదు కాబట్టి.. తనతో వెళ్తానంటున్నారు.. దీనికి మీ పేరేంట్స్ కు, సమాజానికి ఏం సమాధానం చెబుతారు? ఎందుకని మీ భర్తతో గొడవలు అయినప్పుడు ఇరు కుటుంబాల పెద్దలను కూర్చొబెట్టి మాట్లాడలేదు? వీరందరికీ మీరు సమాధానం చెప్పుకుంటాను.. అందరినీ కన్విన్స్ చేయగలను అనుకున్నా కూడా మీ పాప పెరిగి పెద్దయ్యాక తండ్రి ఎవరంటే ఏమి చెబుతారు? అని వరుసగా ప్రశ్నలడిగే సరికి నేను రియలైజ్ అయ్యాను. నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోకూడదని గ్రహించాను. మా భర్తతో ఉన్న సమస్యల గురించి పేరేంట్స్ తో మాట్లాడి సాల్వ్ చేసుకున్నాను. తనను కూడా ఓ మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పేశాను. తన గురించి ఇక ఆలోచించకు అని చెప్పాను' అంటూ తన మ్యారేజ్ లైఫ్ గురించి చెప్పుకొచ్చింది.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ పరిజ్ణానం కోసమే. ఇక్కడున్న సమాచారం ఎవరిని ఉద్దేశించినది కాదు. ఇందులో సూచనలు, సలహాలు అన్నీ వారి వ్యక్తిగత అభిప్రాయాలు అనే విషయాన్ని గుర్తుంచుకోగలరు. ఈ కథనానికి బోల్డ్ స్కై తెలుగుకు ఎలాంటి సంబంధం లేదని గమనించగలరు.

English summary

Does love changes after marriage? Things woman realised after becoming a wife in Telugu

Here we are talking about does love changes after marriage? things woman realised after becoming a wife in Telugu. Read on
Story first published:Thursday, March 24, 2022, 19:56 [IST]
Desktop Bottom Promotion