For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ పనులు చేస్తే.. మీ భాగస్వామి మిమ్మల్ని జీవితాంతం ప్రేమిస్తారని తెలుసా...!

|

పెళ్లి(Marriage) లేదా ప్రేమ అనేది ఇద్దరి వ్యక్తుల మధ్య కొత్త బంధాన్ని ఏర్పరస్తుంది. మీ ఇద్దరి మధ్య ఇలాంటి బంధం స్టార్టయ్యాక.. ప్రారంభంలో ఎంతో కొత్తగా ఉంటుంది.

అసలు ప్రపంచంలో తామొక్కటే అన్న అనుభూతి కూడా కలుగుతుంది. అయితే హనీమూన్ తర్వాత లేదా పిల్లలు పుట్టిన తర్వాత ఆ ఉత్సాహం నెమ్మదిగా తగ్గిపోతుంది. పెళ్లికి ముందు లేదా ప్రేమలో పడటానికి ముందు ప్రియురాలిని ఇంప్రెస్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.

అయితే పెళ్లై, పిల్లలు పుట్టిన తర్వాత వారిని అంతగా పట్టించుకోరు. పెళ్లికి ముందు తమ ప్రయత్నాలలో ఎంతో బాగా సక్సెస్ అయ్యే మగాళ్లు.. పెళ్లి తర్వాత మాత్రం భార్యను ఆకట్టుకోవడంలో మాత్రం విఫలమవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో మీ భార్యతో బంధాన్ని మరింత బలపరచుకోవడానికి.. మీరు కొత్తలో ఉన్న ఉత్సాహాన్ని కొనసాగించడానికి ఏమి చేయాలి.. భార్యను ఇంప్రెస్ చేయడానికి గల సులభమైన మార్గాలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఇలా చేస్తే మీ ప్రియురాలు లేదా భార్యతో హ్యాపీగా గడపొచ్చు...!

బయటికి వెళ్లినప్పుడు..

బయటికి వెళ్లినప్పుడు..

మీరు మీ భార్యను లేదా ప్రియురాలిని ఇంప్రెస్ చేయాలంటే కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు. ఉదాహరణకు మీరు మీ భాగస్వామితో కలిసి బయటికి వెళ్లినప్పుడు సెల్ఫీలు దిగడం లేదా ఇతరులతో ఫోటోలు తీయించుకోవడం చేస్తూ ఉంటారు. అంతేకాదు వాటిని ఇన్ స్టా, ఫేస్ బుక్ తో పాటు ఇతర సోషల్ మీడియాలో ప్లాట్ ఫామ్స్ లో అప్ లోడ్ చేస్తుంటారు. అయితే ఇందులో కొన్ని జీవితాంతం గుర్తుండిపోయే ఫొటోలను దిగండి. ఉదాహరణకు ఫాలో మీ సీరిస్ లో తన ప్రేయసి కోసం వెనుక భాగం మాత్రం కనపించేలా ఆమె చెయ్యి పట్టుకుని తీసిన ఆ ఫొటో ఎంతో పాపులర్ అయ్యింది. మీరు కూడా ఇలా ట్రై చేయ్యండి.

పాట పాడేయండి..

పాట పాడేయండి..

ఈ ప్రపంచంలో మీరిద్దరూ తప్ప ఇంకెవరూ ఉండకూడదని మీకెప్పుడైనా అనిపించిందా? ఒకవేళ మీకు అలా అనిపిస్తే ఈ తరహా ముఖ్యం అని చెప్పొచ్చు. మీరిద్దరూ ఏకాంతంగా ఉండే చోటుకు వెళ్లండి. భూమికి అత్యంత ఎత్తైన ప్రదేశానికి వెళ్లండి. అక్కడ మీరిద్దరూ మాత్రమే ఉండేలా ఓ హోటల్ గదిలోని ఓ కాటేజీ బుక్ చేయండి. ఈ ప్రపంచానికి దూరంగా ఎక్కువగా జన సంచారం లేని ఆ ప్రాంతంలో ఆనందంగా గడపండి. ఇలా ఒక్కరోజు గడిపినా కూడా.. మీకు జీవితాంతం గుర్తుండిపోతుంది.

చుక్కలను లెక్కబెడుతూ..

చుక్కలను లెక్కబెడుతూ..

మీరు మెట్రో సిటీలో నివసిస్తుంటే.. నిత్యం వాహనాల రద్దీ.. కాలుష్యం, బిజీ లైఫ్ ఇతర కారణల వల్ల మీరు సంతోషంగా గడపడం కష్టమే. అయితే మీరు ఈ బిజీ లైఫ్ ని కాస్త పక్కనబెట్టి కాలుష్యం లేని పల్లెలు, లేదా ఏదైనా మంచి ప్రదేశాలకు ట్రిప్ వెళ్లండి. రాత్రి వేళ వెన్నెల్లో కూర్చుని చందమామ, చుక్కల అందాలన చూస్తూ వాటిని లెక్కబెడుతూ ముచ్చట్లు ప్రారంభించండి. ఇందుకోసం మీకు నచ్చిన బీచ్ కు లేదా మీ సొంతూరిలో పొలాల మధ్య మంచం వేసుకుని పడుకున్నా సరిపోతుంది.

పొగడ్తలు..

పొగడ్తలు..

ఈ లోకంలో పొగడ్తలకు పడిపోని వారు ఎవరుంటారు చెప్పండి. కాబట్టి మీరు మీ భార్యను ఆకట్టుకోవడానికి అప్పుడప్పుడు తన అందాన్ని.. తను చేసిన వంటకాలను మెచ్చుకోండి చాలు.. తను మీకు ఫిదా అయిపోతుంది. ‘రోజు రోజుకు నీ అందం మరింత పెరిగిపోతోంది.. నీ సౌందర్య రహస్యానికి కారణం ఏంటి' అనే డైలాగులు వాడితే చాలు వారు మీపై మరింత అభిమానం పెంచుకుంటారు.

వంట చేయండి..

వంట చేయండి..

మనలో చాలా మంది భార్యలే ఇంట్లో వంటలు చేస్తూ ఉంటారు. ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి మీకు, మీ పిల్లలకు ప్రతిరోజూ వెరైటీ వంటలను వండేందుకు ప్రయత్నిస్తుంటారు. కాబట్టి మీకు సెలవు ఉన్న రోజులో తన కంటే ముందే నిద్ర లేవండి. ఆమె లేచేసరికి కాఫీ లేదా టీ రెడీ చేసి ఇవ్వండి. వీలైతే టిఫిక్ కూడా చేయండి. దీంతో తను ఈజీగా ఇంప్రెస్ అయిపోతుంది.

సోషల్ మీడియాలో..

సోషల్ మీడియాలో..

మీ భాగస్వామి ఇప్పటివరకు సాధించిన గొప్ప విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేయండి. తను మీ జీవితంలో అడుగు పెట్టిన నాటి మీ ఆనందం ఎంతలా పెరిగిందనే విషయాలను షేర్ చేసుకోండి. ఒకవేళ అది వైరల్ అయితే.. ఆ విషయాన్ని మీ భార్యకు చెప్పండి. అంతే తను చాలా సంతోషిస్తుంది.

డ్యాన్స్ చేయండి..

డ్యాన్స్ చేయండి..

మీ ఇద్దరికీ డ్యాన్స్ అంటే ఇష్టమైతే.. మీరిద్దరూ కలిసి మంచి డ్యాన్స్ క్లాస్ లో చేరండి. ఇంకా కావాలంటే మీరిద్దరూ కలిసి ఏదైనా డ్యాన్స్ పోటీల్లోనూ పాల్గొనండి. దీని కోసం మీరిద్దరూ రెగ్యులర్ గా ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. దీంతో మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మరింత పెరిగిపోతుంది. ఇలాంటి పనులు మీ ఇద్దర్నీ మరింద దగ్గర చేస్తాయి. అయితే మీరు డ్యాన్స్ పోటీల్లో గెలవాల్సిన రూలేం లేదు. ఇలాంటి వాటి వల్ల మీరు మీ మనసులను మరొకరు గెలచుకుంటారు.

నలుగురిలో ప్రత్యేకంగా..

నలుగురిలో ప్రత్యేకంగా..

మీరు ఏదైనా ఫంక్షన్ కు లేదా ఏదైనా కార్యక్రమానికి వెళ్లినప్పుడు నలుగురిలో తనపై ప్రత్యేక ప్రేమను చూపండి. ముఖ్యంగా ఎక్కడికి వెళ్లినా తన చేతిని వదలకుండా తనకు దగ్గరగా ఉండండి. తనను మీరు ఎంతలా ఇష్టపడుతున్నారో తెలియజేయండి. అప్పుడప్పుడు అందరిలో తనకు ఏదైనా మంచి బహుమతి ఇచ్చి సర్ ప్రైజ్ చేయండి.

పడకగదిలో..

పడకగదిలో..

చివరగా.. పడకగదిలో మీరు ఎట్టి పరిస్థితుల్లో దూకుడుగా వ్యవహరించొద్దు. అలాగే ఆధిపత్యం కోసం కూడా ప్రయత్నించొద్దు. మీకు ఏది కావాలన్నా చాలా ప్రేమగా, సున్నితంగా సుకుమారంగా చేయండి. మీ చేతులను సున్నితమైన ఆమె చర్మాన్ని తాకేలా చూడండి. మీ చేతి వేళ్లతో తనను తాకిన వెంటనే తను రొమాంటిక్ మూడ్ లో వచ్చేలా చూడండి చాలు. ఆ తర్వాత చూడండి.. వారు మిమ్మల్ని ఎంతలా ఇష్టపడతారో ఇట్టే తెలిసిపోతుంది.

English summary

Easy Ways To Impress Your Wife in Telugu

Here are the easy ways to impress your wife in Telugu. Have a look
Story first published: Wednesday, August 4, 2021, 18:09 [IST]