For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వివాహ బంధం విజయవంతమయ్యేందుకు.. ఈ వృద్ధ జంట చెబుతున్న రహస్యాలేంటో చూడండి...

ఓ వృద్ధ జంట తమ దీర్ఘకాలిక వివాహ జీవితం గురించి కొన్ని రహస్యాలను పంచుకున్నారు

|

మనలో చాలా మంది జీవితాల్లో ప్రతి ఒక్క బంధానికి ఎంతో కొంత ప్రత్యేకత ఉంటుంది. అయితే ఎన్ని బంధాలు ఉన్నప్పటికీ, వివాహ బంధం అనేది చాలా ముఖ్యమైనది. ఇద్దరు వ్యక్తులు పెళ్లి అనే ఘట్టంతో ఏడడుగులతో ఏకమై, తద్వారా వారు ఒక కుటుంబాన్ని సమాజానికి అందివ్వడం అనేది గొప్ప విషయమే.

Elderly Couple Shares the Secret for Their Long Marriage

ఇదిలా ఉండగా ఓ వృద్ధ జంట వివాహ బంధం గురించి తాజాగా ఇంటర్నెట్ లో తెగ వైరల్ అయ్యింది. ప్రస్తుత జనరేషన్లో విడాకుల శాతం పెరుగుతున్న వేళ ఓ వృద్ధ ఏకంగా 72 ఏళ్లుగా వివాహ బంధాన్ని విజయవంతంగా కొనసాగించారు. ఈ సందర్భంగా వారి భావాలను, భావోద్వేగాలను ఇలా పంచుకున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

బెడ్రూమ్ లో బోర్ కొట్టకుండా రెచ్చిపోవాలంటే... ఈ పద్ధతులు ఫాలో అవ్వండి...!బెడ్రూమ్ లో బోర్ కొట్టకుండా రెచ్చిపోవాలంటే... ఈ పద్ధతులు ఫాలో అవ్వండి...!

ఆదర్శ జంట..

ఆదర్శ జంట..

ప్రస్తుత తరంలో చాలా మంది జంటలు చీటికి మాటికి గొడవ పడుతుంటారు. అయితే అవి చిలికి చిలికి గాలి వానలా మారి విడాకుల వరకు వెళ్తున్నాయి. అయితే ఓ వృద్ధ జంట మాత్రం 7 దశాబ్దాలకు పైగా విజయవంతంగా తమ బంధాన్ని కొనసాగిస్తోంది. అంతేకాదు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

సోషల్ మీడియాలో..

సోషల్ మీడియాలో..

తమ 72 సంవత్సరాల వివాహ జీవిత రహస్యాలను ఆ వృద్ధ జంట ఇటీవల ఇంటర్నెట్లో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ వీడియోను చాలా మంది నెటిజన్లు ఇష్టపడుతున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేసిన కొన్ని గంటల్లో ఈ వీడియోకు సుమారు 10 మిలియన్ల వీవ్స్ వచ్చాయి. వస్తూనే ఉన్నాయి.

సంబంధంలో సాన్నిహిత్యం..

సంబంధంలో సాన్నిహిత్యం..

ఈ వీడియోలో వృద్ధ జంట తమ ఏడు దశాబ్దాల వివాహ బంధం విజయవంతం కావడం వెనుక రహస్యాలను పంచుకున్నారు. వీరిద్దరూ దక్షిణ బెంగళూరుకు చెందినవారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలోని భర్తకు 101 సంవత్సరాలు. భార్యకు 90 సంవత్సరాలు. ఈ జంట యువత తరం కోసం వారి సంబంధాలను బలోపేతం చేయడానికి మార్గాలను పంచుకున్నారు.

మీ పార్ట్ నర్ పై ప్రేమ పెరుగుతూ పోవాలంటే... ఈ చిట్కాలు ఫాలో అవ్వండి...మీ పార్ట్ నర్ పై ప్రేమ పెరుగుతూ పోవాలంటే... ఈ చిట్కాలు ఫాలో అవ్వండి...

కలిసి పనులు చేయడం..

కలిసి పనులు చేయడం..

ఈ వైరల్ వీడియోలో ఇద్దరూ కలిసి చేతులు పట్టుకోవడం నుండి కలిసి నడవడం, కలిసే భోజనం చేయడం వరకూ యువతకు సలహాలిస్తూ, కలిసి జీవించడంలో ఉంటే మాధుర్యాన్ని తెలియజేస్తున్నారు. ఈ వైరల్ వీడియోలో ‘బర్ఫీ' సినిమాలోని పాట కూడా ప్లే అవుతోంది. ఈ వీడియోను హ్యామన్స్ ఆఫ్ బాంబే పేజీ నుండి అప్ లోడ్ చేయబడింది.

పిల్లలు ఆటపట్టిస్తారు..

పిల్లలు ఆటపట్టిస్తారు..

ఆ వృద్ధుని మాటల ప్రకారం, ‘మా మనవడు, మనవరాళ్లు నా భార్య సలహా తీసుకోవడం లేదని చెబుతుంటారు. ఇది చూసిన కుటుంబసభ్యులు బాగా నవ్వుతుంటారు. దీంతో పాటు, తన భార్య కూడా ఇలా అన్నారు. తన జీవితంలోని ప్రతి రంగానికి అతని భార్య అతనికి మద్దతు ఇచ్చిన విధానం మరియు అతని కుటుంబాన్ని చూసుకున్న విధానం, ఈ విషయాలన్నీ వివరించారు. అలాగే ఆ జంట తన తమ పేదరికంలో గడిపిన రోజులను కూడా గుర్తు చేసుకుంది.

కలిసి భోజనం చేయడం..

వివాహ బంధం బలోపేతం కావాలంటే ముందుగా కొన్ని చిట్కాలను పాటించాలన్నారు. రోజుకు కనీసం ఒకసారైనా కలిసి భోజనం పని చేయాలి. ఏదైనా పొరపాటు జరిగినా 'క్షమించండి అని చెప్పే మొదటి వ్యక్తి నేను' అంటూ అని ఆ వృద్ధులు వివరించారు. 72 ఏళ్ల వీరి వివాహ జీవితంలో వీరికి ఇద్దరు పిల్లలు, నలుగురు మనవరాళ్లు మరియు మరో ఇద్దరు ముని మనవరాళ్లు ఉన్నారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీరి మాటలు విని ఆశ్చర్యపోతున్నారు. ఈ జంట కలకాలం ఇలాగే జీవించాలని శుభాకాంక్షలు చెబుతున్నారు.

All Images Credit to : Instagram

English summary

Elderly Couple Shares the Secret for Their Long Marriage

Here we are talking about the elderly couple shares the secret for their long marriage. Have a look
Story first published:Thursday, April 8, 2021, 13:33 [IST]
Desktop Bottom Promotion