Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
కపుల్స్‌కు అలర్ట్! ఈ పనులు చేయడం వెంటనే ఆపేయండి, లేదంటే..
దంపతుల అలవాట్లు కొన్ని ఇద్దరికీ ఇబ్బంది తెచ్చిపెడతాయి. విశ్వాసం, ప్రేమ, గౌరవాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తాయి. వాటి వల్ల బంధం విచ్ఛిన్నానికి కూడా దారితీయవచ్చు. అలాంటి అలవాట్లను మానుకోవడం మంచిది.
ప్రతి సంబంధంలో ఒడిదొడుకులు ఉంటాయి. గొడవలు జరుగుతూనే ఉంటాయి. దంపతులు ఒకే విషయంపై భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉండటం చాలా సాధారణం. అయితే దంపతుల అలవాట్లు కొన్ని ఇద్దరికీ ఇబ్బంది తెచ్చిపెడతాయి. విశ్వాసం, ప్రేమ, గౌరవాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తాయి. వాటి వల్ల బంధం విచ్ఛిన్నానికి కూడా దారితీయవచ్చు. అలాంటి అలవాట్లను మానుకోవడం మంచిది. దాంపత్య బంధంలో కలహాలు తెచ్చిపెట్టే, బంధాన్ని విడిపోవడానికి దారితీసే ఆ చెడు అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

విమర్శించడం, నిందించడం:
విమర్శించడం ఏమాత్రం తప్పు కాదు. ఏదైనా తప్పు జరిగినప్పుడు, తప్పు జరిగే అవకాశం ఉన్నప్పుడు విమర్శల ద్వారా వాటిని ఆపడానికి ప్రయత్నించే వరకు విమర్శ మంచిదే. అంటే సద్విమర్శ మంచిదే కానీ అదే పనిగా విమర్శిస్తూ ఉండటం, నిందిస్తూ ఉండటం వల్ల ఎదుటివారిపై మంచి భావన ఏర్పడదు. వారిపై అసంతృప్తి వచ్చేస్తుంది. ఈ ధోరణి క్రమంగా ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.
దానికి బదులు సమస్యలకు పరిష్కారాలను కనుక్కోవడంపై దృష్టి పెట్టాలి. సానుకూల నిర్మాణాత్మక వైఖరితో చర్చలను చేరుకోవాలి.

నాణ్యమైన సమయాన్ని విస్మరించడం:
దంపతులు కలిసి కొంత సమయం గడపాలి. అది కూడా నాణ్యంగా ఉండేలా చూసుకోవాలి. కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడం బలమైన సంబంధాన్ని నిర్మించుకోవడానికి మరియు నిర్వహించడానికి సహాయపడుతుంది.
బిజీ షెడ్యూల్ లతో, ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేయడం చాలా సులభం. కానీ క్రమం తప్పకుండా కలిసి సమయాన్ని గడపడానికి ప్రయత్నించడం మీ బంధాన్ని బలోపేతం చేస్తుంది.

వైరుధ్యాలను నివారించడం:
వైరుధ్యాలు ఏదైనా సంబంధంలో అనివార్యమైన భాగం. కానీ వాటిని నివారించడం హానికరం. వైరుధ్యాలను నేరుగా పరిష్కరించాలి. ఆరోగ్యకరమైన, గౌరవప్రదమైన పద్ధతిలో వ్యవహరించాలి. వివాదాలను నివారించడం ఆగ్రహానికి, లోతైన సమస్యలకు దారి తీస్తుంది.

ఆప్యాయతను నిలిపివేయడం:
బంధంలో ఆప్యాయతన చూపడం అనివార్యంగా చేయాల్సిన పని. కానీ ఆ ఆప్యాయతను నిలిపివేస్తే సమస్య మొదలవుతుంది. మాటల ద్వారా అయినా లేదా స్వర్శ ద్వారా అయినా ఆప్యాయత చూపాలి. మీ జీవిత భాగస్వామితో బహిరంగంగా ఆప్యాయత చూపడానికి ఏమాత్రం సంకోచించవద్దు. మీరు చూపే ఆప్యాయత వారికి మంచి భావన కలిగిస్తుంది. క్రమం తప్పకుండా మీ పార్ట్నర్ కు ప్రేమను వ్యక్తం చేస్తూ ఉండాలి. చిన్న చిన్న విషయాలైనా పర్లేదు ప్రశంసించడానికి ప్రయత్నించండి.

కమ్యూనికేషన్ లేకపోవడం:
ఏ సంబంధం అయినా కమ్యూనికేషన్ చాలా కీలకం. దంపతుల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోతే చాలా సమస్యలు తలెత్తుతాయి. ఇద్దరి మధ్య అపార్థాలు వస్తాయి. ఇవి పెద్ద సమస్యలకు దారి తీస్తుంది. అందుకే భాగస్వామితో తరచూ మీ భావాలను పంచుకుంటూ ఉండాలి. మీ మనసులో ఏమనుకుంటున్నారో స్పష్టంగా చెప్పాలి.
ఈ చెడు అలవాట్లు సంబంధంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. అయితే వాటిని ప్రయత్నం, సానుకూల మార్పులు చేయడానికి నిబద్ధతతో అధిగమనించవచ్చు. దంపతులు ఈ అలవాట్ల గురించి తెలుసుకోవడం, బలమైన, ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి కలిసి పని చేయడం చాలా ముఖ్యం. పరస్పరం గౌరవించుకోవడం, ఆప్యాయత చూపుకోవడం, ప్రేమను వ్యక్తం చేయడం లాంటివి దంపతుల మధ్య బంధాన్ని బలోపేతం చేస్తాయి.



Click it and Unblock the Notifications