For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘ఆ’ బంధం బలపడాలంటే.. ప్రతిరోజూ ఓ కిస్.. ఓ కౌగిలింత... కావాల్సిందేనా...!

|

వివాహం లేదా ప్రేమ.. రెండింటిలో ఏ బంధం మొదలైనా.. ప్రారంభంలో అంతా ఆనందంగా ఉంటుంది. కానీ అలాంటి సంతోషం కాలం మారుతున్న కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. ముఖ్యంగా హనీమూన్ పూర్తయిన తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ తగ్గిపోవడం జరుగుతుంది.

ఇక పిల్లలు పుట్టిన తర్వాత దాదాపు సగం ప్రేమ తగ్గుతుంది. అయితే ఆ తర్వాత కూడా భాగస్వామితో ఆనందంగా ఉండాలంటే.. మీ రిలేషన్ షిప్ కొంచెం కొత్తగా ప్రయత్నించాలి. అందుకోసం ప్రతిరోజూ మీరు నిత్యం ఏదో ఒక కొత్త పని చేస్తూ.. మీ పార్ట్ నర్ తో స్పార్క్ కొనసాగించాలి. ఇందుకోసం తరచుగా అడ్వెంచర్లు చేస్తూ.. ప్రతి రోజూ ఓ హగ్.. ఓ కిస్.. వంటివి ఇస్తూ ఉండాలి.

ఇలా చేయడం వల్ల మీ భాగస్వామితో మీ ప్రేమ మరింత పటిష్టమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆలుమగలిద్దరూ ప్రతిరోజూ అలవర్చుకోవాల్సిన అలవాట్లేంటి.. నిపుణులు చెబుతున్న చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

'ఏడాదికి ఒకట్రెండు సార్లు మాత్రమే ఏకాంతంగా కలుస్తున్నాం.. రెగ్యులర్ గా కలవాలంటే.. ఏం చేయాలి..''ఏడాదికి ఒకట్రెండు సార్లు మాత్రమే ఏకాంతంగా కలుస్తున్నాం.. రెగ్యులర్ గా కలవాలంటే.. ఏం చేయాలి..'

ఆరోగ్యానికి ప్రాధాన్యత..

ఆరోగ్యానికి ప్రాధాన్యత..

ప్రస్తుత బిజీ ప్రపంచంలో వ్యాపారం రీత్యా లేదా ఉద్యోగ రీత్యా లేదా ఇంకేదైనా కారణంగా ఆలుమగలిద్దరూ చాలా బిజీగా ఉంటున్నారు. ప్రతి ఒక్కరికీ ఒత్తిడి, ఆందోళనలు పెరిగిపోతున్నాయి. అయితే చాలా మంది జంటల్లో ఇలాంటి వాటి వల్లే నిత్యం గొడవలు, అపొహలు, అనుమానాలు జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి వాటికి చెక్ చెప్పాలంటే.. ప్రతి ఒక్కరూ మానసికంగా.. శారీరకంగా బలంగా ఉండాలని ఓ బ్రిటీష్ అధ్యయనం స్పష్టం చేసింది.

సానుకూల ఆలోచనలు..

సానుకూల ఆలోచనలు..

ప్రతిరోజూ సరైన సమయానికి ఆహారం తీసుకుంటే.. మనలో శక్తి, సామర్థ్యం పెరిగి.. మనకు సానుకూల ఆలోచనలు కలిగేలా చేస్తాయట. ఇవి మనలో పాజిటివిటీ పెంచి మనం మానసికంగా ఆనందంగా ఉండేందకు సహాయపడతాయట. జంటలిద్దరూ ఇలా మానసిక ఆరోగ్యాన్ని పెంచుకుంటూ.. సానుకూల ఆలోచనలతో ఉంటే వారి మధ్య ప్రేమ తప్ప మరే ఆలోచన రాదని చెబుతోంది ఆ అధ్యయనం.

చిలిపి గొడవలు..

చిలిపి గొడవలు..

ఏ జంట అయినా వారి మధ్య ప్రేమే కాదు.. అప్పుడప్పుడు చిలిపి గొడవలు.. సరదా తగాదాలు కచ్చితంగా ఉండాల్సిందేనని చెబుతున్నారు నిపుణులు. అప్పుడే వారి బంధం మరింత బలపడుతుందట. అయితే గొడవ పడిన ప్రతిసారీ ఎవరి తప్పు ఉంటే వారు క్షమించమని కోరుకోవడం వల్ల ఆ గొడవ సద్దుమణుగుతుందట.

అబ్బాయిలు అందమైన అమ్మాయిల కన్నా ఆంటీలనే ఎందుకు ఇష్టపడతారో తెలుసా...అబ్బాయిలు అందమైన అమ్మాయిల కన్నా ఆంటీలనే ఎందుకు ఇష్టపడతారో తెలుసా...

గొడవలకు కారణం..

గొడవలకు కారణం..

నార్త్ వెస్ట్ యూనివర్సిటీ జరిపిన ఓ అధ్యయనం.. ప్రకారం.. భార్యభర్తల మధ్య గొడవలు పెరిగినప్పుడు.. లేదా మాట మాట పెరిగినప్పుడు వాటిని మధ్యలో ఆపేయకుండా.. పేపర్ పై రాసిపెట్టాలంట. ఎందుకంటే గొడవలు పడినప్పుడు, ఎవ్వరూ అంత సులభంగా తమ తప్పును ఒప్పుకోరు. పైగా తమదే కరెక్ట్ అన్నట్టు మాట్లాడతారు. కానీ కొంత సమయం తర్వాత తప్పెవరిదో తెలుసుకుంటారు. కాబట్టి గొడవలకు కారణమైన వాటి గురించి పేపర్లో రాసుకుంటే.. తర్వాత ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటాయట.

అన్యోన్యత పెరుగుదల..

అన్యోన్యత పెరుగుదల..

అంతేకాదు.. తరచుగా గొడవ పడే జంటలు తమ గొడవలను నోట్ చేసుకోవడం వల్ల తమ పార్ట్ నర్ ను మరింత బాగా అర్థం చేసుకుంటారని చెబుతోంది ఈ అధ్యయనం.. కాబట్టి ఇకపై జరిగే తగాదాలను అలా వదిలేయకుండా డైరీలో నోట్ చేసుకుని మీ మధ్య ఉన్న అన్యోన్యతను మరింత పెంచుకోండి.

ఓ కిస్.. ఓ హగ్..

ఓ కిస్.. ఓ హగ్..

ఆలుమగల మధ్య అనుబంధం చాలా భావోద్వేగంగా ఉంటుంది. ఇలా ఎప్పటికీ ఉండాలంటే.. మీరు ప్రతిరోజూ రొమాన్స్ లో పాల్గొనేటప్పుడు.. మీ రోటీన్ లైఫ్ లో ఓ కిస్.. ఓ హగ్ కచ్చితంగా చేయాలని చెబుతున్నారు నిపుణులు. మీరిద్దరూ ప్రతిరోజూ కనీసం ఒక్కసారైనా కౌగిలించుకోవడం వల్ల మీ బాడీలో ఆక్సిటోసిన్ అనే లవ్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది మీ ఇద్దరినీ మరింత దగ్గర చేస్తుంది. ఇక కిస్ చేసినప్పుడు మీ బాడీలో ఆక్సీటోసిన్, డోపమైన్, సెరటోనిన్.. అనే మంచి హార్మోన్లు విడుదలవుతాయి.

అనుబంధం పెంచుతుంది..

అనుబంధం పెంచుతుంది..

ఇలాంటి హార్మోన్ల వల్ల జంటల మధ్య ఉన్న ఒత్తిడి తగ్గిపోయి.. ఇద్దరి మధ్య అనుబంధాన్ని మరింతగా పెంచుతుంది. కాబట్టి కపుల్స్ ఎంత బిజీగా ఉన్నా సరే.. ప్రతిరోజూ ముద్దులు.. కౌగిలింతలకు తప్పనిసరిగా కొంత సమయం కేటాయించాలంటున్నారు నిపుణులు.

వారంలో ఒకసారైనా..

వారంలో ఒకసారైనా..

మీ వైవాహిక బంధం జీవితాంతం సాఫీగా సాగిపోవాలంటే.. వారానికి ఒకసారైనా ఆ కార్యంలో పాల్గొనాలట. అలాగే మీ రిలేషన్ షిప్ లో ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు. అదే సమయంలో ఫ్యూచర్ గురించి మీ ఇద్దరికీ ఓ స్పష్టత ఉండాలి. ఇవి పూర్తి కావాలంటే.. ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోవాలి.

English summary

Every Day Habits to Keep Your Relationship Strong In Telugu

Here are the every day habits to keep your relationship strong in Telugu. Have a look