Latest Updates
-
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే!
నా ప్రేయసి ఆ కార్యాన్ని అవాయిడ్ చేస్తోంది? ఏం చేయమంటారు...!
తన గర్ల్ ఫ్రెండ్ తో పెళ్లికి ముందే ఆ కార్యంలో పాల్గొనడం కరెక్టా కాదా? నిపుణులు ఏమంటున్నారంటే...
ఈ విశ్వంలో వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ రొమాన్స్ అంటే చాలా ఎక్కువగా ఇష్టపడతారు. ఎప్పుడెప్పుడు ఆ కార్యంలో పాల్గొందామా? ఆ సుఖాన్ని ఎలా ఆస్వాదిద్దామా అని తహతహలాడుతూ ఉంటారు.

అయితే మన దేశంలో ఆ కార్యం గురించి తాజాగా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే చాలా మంది యువత పెళ్లికి ముందే ఆ ఘట్టాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారట.. ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు ఉండే మన దేశంలో ఇలాంటివి సాధ్యపడవని చాలా మందికి తెలుసు.

ఎందుకంటే మన దేశంలో బంధాలు.. అనుబంధాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వివాహానికి ముందు శృంగారం అనే విషయంపై ఓ సంస్థ సర్వే చేపడితే... అందులో చాలా మంది ఆసక్తికరమైన సమాధానాలిచ్చారట.

ఇలా చేయడం వల్ల తమ భాగస్వామితో భవిష్యత్తులో సుఖంగా ఉంటామా లేదా అనేది ముందుగానే తెలుసుకోవచ్చని ఆలోచిస్తున్నారట.. ఈ నేపథ్యంలో ఓ యువకుడు పెళ్లికి ముందు తన ప్రేయసితో ఆ కార్యం చేయాలని కోరుకుంటుంటే.. తనకు నిపుణులు ఏమని సమాధానం ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం....

రెండేళ్ల నుండి రిలేషన్లో..
హాయ్.. నాకు ఇరవై ఐదేళ్లు ఉన్నాయి. నేను నా ప్రేయసితో కలిసి రెండేళ్ల నుండి రిలేషన్ షిప్ మెయింటెయిన్ చేస్తున్నాను. మా రిలేషన్ షిప్ గురించి మేమిద్దరం చాలా సీరియస్ గానే ఉన్నాం. నాకు ఒక మంచి జాబ్ కూడా ఉంది.

పెళ్లికి రెడీగా ఉన్నాం..
మేమిద్దరం ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. పెళ్లితో పాటు వచ్చే బాధ్యతలను స్వీకరించడానికి ధైర్యం రాగానే ఆ పని చేయాలనుకుంటున్నాం. అయితే అకస్మాత్తుగా నాకొక సమస్య వచ్చి పడింది. దాని నుండి చాలా ఒత్తిడికి గురవుతున్నాను. నేను తనతో రెండేళ్ల నుండి రిలేషన్ లో ఉన్నప్పటికీ తనతో ఒక్కసారి కూడా కలయికలో పాల్గొనలేదు.

ఆ టాపిక్ వచ్చేసరికి..
నేను తనతో ఎప్పుడు ఆ టాపిక్ గురించి మాట్లాడినా తను చాలా కోప్పడుతుంది. అసలు తనకు రొమాన్స్ అంటేనే ఇష్టం అనేట్టు ప్రవర్తిస్తోంది. అసలు అలాంటి టాపిక్ ను ఎప్పుడూ అవాయిడ్ చేస్తూ ఉంటుంది. ఈ రెండేళ్లలో తనని నేను కనీసం తాకను కూడా తాకలేదు. నా గర్ల్ ఫ్రెండ్ నన్ను కనీసం ముద్దు పెట్టుకోడానికి కూడా ఒప్పుకోలేదు.

పెళ్లి తర్వాత..
తను వర్జిన్ అని నాకు తెలుసు. అయితే ఆమె పెళ్లి తర్వాత అయినా ఆ కార్యానికి ఒప్పుకుంటుందా? నాకు దీని గురించి ఆలోచిస్తుంటే చాలా భయమేస్తోంది. నా శారీరక అవసరాలను ఎలా తీర్చుకోవాలి. ఎందుకంటే నా ప్రియురాలి నుండి నాకు ఎలాంటి సహాయం రాదు.

వేరే ఆప్షన్లు..
ఈ విషయం గురించి నా స్నేహితుడి దగ్గర ప్రస్తావించగా.. తను నాకు కొన్ని సలహాలిచ్చాడు. నా అవసరాలు తీరడం కోసం నేను మిగిలిన ఆప్షన్లను చూసుకోమని చెప్పాడు. అంటే ప్రాస్టిస్ట్యూట్ దగ్గరికి వెళ్లడంలో ఎలాంటి తప్పు లేదని చెబుతున్నాడు.

టెంప్ట్ అయ్యాను..
అయితే నేను ఆ విషయం విన్న వెంటనే టెంప్ట్ అయ్యాను. కానీ, ఇంకొకరితో ఆ కార్యంలో పాల్గొనాలంటే నాకే ఏదోలా అనిపించింది. నాకు నా ప్రేయసి అంటే చాలా ఇష్టం. కానీ, ఈ విషయాన్ని ఎలా డీల్ చేసుకోవాలో నాకు అర్థం కావటం లేదు.

నిపుణులు ఏమంటున్నారంటే...
చివరికి ఈ విషయంపై నిపుణులను సంప్రదించాడు ఆ యువకుడు. దీనికి వారు ఏమి చెప్పారంటే... పెళ్లికి ముందు శృంగారం అనేది ఇద్దరు వ్యక్తుల ఇష్టాఇష్టాలతో జరుగుతుంది. అందుకు అనేక కారణాలుంటాయి. అందులో కొన్ని మతపరమైనవి అయితే.. మరికొన్ని సంప్రదాయాలకు సంబంధించినవి. ఇందుకు మీ ఇద్దరి సంపూర్ణ అంగీకారం అవసరమవుతుంది.

అందుకు ఒప్పుకోవడం లేదని..
మీరు మీ ప్రేయసితో రెండేళ్ల నుండి రిలేషన్ షిప్ ఉన్నారనీ, ఆమెతో మీరు పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనడానికి అంగీకరించడం లేదని మాకు అర్థమైంది. మీరు ఆ టాపిక్ గురించి ఎప్పుడు మాట్లాడినా, ఆమె అవాయిడ్ చేస్తుందని మీరే చెప్పారు. కాబట్టి మీకు అక్కడే ఒక క్లారిటీ ఉండాలి. అసలు ఆమెకు శృంగారం అంటేనే ఇష్టం లేదా పెళ్లికి ముందు శృంగారం అంటే ఇష్టం లేదా? దీని గురించి ఆమె ఏమి చెబుతుందో అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి.

ఒప్పించే ప్రయత్నం చేయకండి..
ఆ విషయంలో మీకు ఒక క్లారిటీ వచ్చాక, ఒకవేళ ఆమె పెళ్లికి ముందు ఆ కార్యంలో పాల్గొనేందుకు ఇష్టపడకపోతే అది ఆమె ఆప్షన్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఆమెను మాత్రం ఒప్పించేందుకు ప్రయత్నం చేయకండి.

మరో నిర్ణయం..
మీ అవసరాలు.. మీ ప్రాధాన్యతలను బట్టి మీ రిలేషన్ షిప్ గురించి మీరే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. మీరిద్దరూ భవిష్యత్తులో కూడా కలిసి ఉండాలా వద్దా అని తేల్చుకున్నాక ఏ నిర్ణయమైనా మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది.

మీరు గౌరవించాల్సిందే..
పెళ్లికి ముందు ఆ కార్యం గురించి మీరు ఆమెకు ఎలాంటి నమ్మకాలు ఉన్నప్పటికీ వాటిని మీరు గౌరవించాల్సిందే. అంతేకానీ వాటిని మార్చలేరు. అయితే మీరు మీ స్నేహితుడు చెప్పినట్లు ఇతర ఆప్షన్ల వైపు మొగ్గు చూపితే.. మీరు మీ ప్రియురాలిని మోసం చేయడమే అవుతుంది. అది మీ రిలేషన్ షిప్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

భేదాభిప్రాయాలున్నప్పుడు..
మీ ఇద్దరి బాధ్యతల గురించి, మీకు ఉన్న అంచనాల గురించి మీరు ఒక క్లారిటీకి రావాలంటే మీరు మానసిక నిపుణులను కలిస్తే కచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఈ విషయం గురించి మీ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలున్నాయి. కానీ, ఇలాంటివి భవిష్యత్తులో కూడా వస్తాయని గుర్తించాలి.



Click it and Unblock the Notifications











