For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐపిఎల్ క్రికెటర్ల క్రేజీ లవ్ స్టోరీ.. వివాహ వేడుకల గురించి తెలుసా...

ఐపిఎల్ క్రికెటర్ల భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా...

|

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) స్టార్ క్రికెటర్లు కేవలం మైదానంలోనే కాదు.. మైదానం అవతల కూడా హీరోలుగా వెలుగొందుతున్నారు. అయితే అదెలాగో తెలుసా.. వీరు ఒక్క ఆటతోనే కాకుండా..

Girlfriends and Wives of IPL Cricketers

గ్లామర్ తోనూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. వారిలో కొందరు ఐపిఎల్ క్రికెటర్ల భార్యలు మరియు ప్రియురాళ్లు ఎవరో తెలియాలంటే ఇక్కడ ఓ లుక్కేయండి...

అత్యంత ప్రతిభావంతమైన మరియు అందమైన భారత క్రికెటర్ల భార్యల గురించి మీకు తెలుసాఅత్యంత ప్రతిభావంతమైన మరియు అందమైన భారత క్రికెటర్ల భార్యల గురించి మీకు తెలుసా

విరుష్క జంట..

విరుష్క జంట..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ కింగ్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ ఇటలీలోని టుస్కానీలో 2017, డిసెంబర్ 11న ఒక్కటయ్యారు. వీరి వివాహానికి ముందు వీరు కొన్నేళ్ల పాటు ప్రేమాయణం కొనసాగించారు. ఇటీవలే అనుష్క శర్మ ప్రెగ్నెన్సీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. త్వరలో వీరి కుటుంబంలో కొత్త వ్యక్తి ప్రవేశించనున్నట్లు విరాట్ ట్వీట్ చేశాడు.

తలైవా కపుల్..

తలైవా కపుల్..

చెన్నై సూపర్ కింగ్స్ తలైవా, కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన చిన్ననాటి స్నేహితురాలు సాక్షిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఓ పండంటి పాపాయి కూడా జన్మించింది.

యువీ-కీచ్..

యువీ-కీచ్..

సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ ఈ ఐపీఎల్ లో ఆడనప్పటికీ.. తను కూడా ఐపిఎల్ తో పరోక్షంగా సంబంధాలను కొనసాగిస్తున్నాడు. ఈ క్రికెటర్ విదేశీ మహిళ అయిన హాజెల్ కీచ్ ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ 2016, నవంబర్ 30వ తేదీన గురుద్వారాలో వివాహం చేసుకున్నారు.

జహీర్-సాగరిక..

జహీర్-సాగరిక..

ఇండియన్ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ సాగరికను ప్రేమ వివాహం చేసుకున్నారు. చక్ దేలో ఆమె తొలిసారి చూసినప్పుడడు సాగరికాతో ప్రేమలో పడ్డారట. ఆ తర్వాత వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి జంట చూడముచ్చటగా ఉంది కదా...

భజ్జీ-బాస్రా..

భజ్జీ-బాస్రా..

టర్బోనేటర్ హర్బజన్ సింగ్, గీతా బాస్రాను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ జలంధర్ లో భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుటుంబం సంప్రదాయ దుస్తులలో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు ముఖేష్ అంబానీ, నీతూ అంబానీ, ఆకాష్ కూడా హాజరయ్యారు.

ఇర్ఫాన్ - సఫా బేగ్..

ఇర్ఫాన్ - సఫా బేగ్..

ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఆల్ రౌండర్ గా ఓ వెలుగు వెలిగిన ఇర్ఫాన్ పఠాన్ 2016, ఫిబ్రవరి 7వ తేదీన జెడ్డాకు చెందిన 21 ఏళ్ల సఫా భేగ్ ను సింపుల్ మ్యారేజ్ చేసుకున్నాడు. టెస్టు క్రికెట్లో భారత క్రికెట్ తరపున దాయాది జట్టు పాకిస్థాన్ పై హ్యాట్రిక్ సాధించిన ఏకైక క్రికెటర్ గా పఠాన్ రికార్డులకెక్కాడు.

దినేష్ కార్తీక్ - దీపిక..

దినేష్ కార్తీక్ - దీపిక..

దినేష్ కార్తీక్ తన ప్రియురాలు దీపికతో ప్రేమాయణం కొనసాగించి.. ఆ తర్వాత వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ 2013లో మారథాన్ లో తొలిసారి కలుసుకున్నట్లు, వీరి లవ్ స్టోరీ వెరైటీగా స్టార్ట్ అయ్యిందని వీరు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇషాంత్ - ప్రతిమా..

ఇషాంత్ - ప్రతిమా..

భారతీ పేస్ బౌలర్లలో ఒకడైన ఇషాంత్ శర్మ 2011లో ఢిల్లీ యొక్క రీబాక్ ఐజిఎంఎ బాస్కెట్ బాల్ అసొసియేషన్ (రిబా) లీగ్ కు ముఖ్య అతిథిగా హాజరైనప్పుడు వీరిద్దరికీ పరిచయం అయ్యిందట. అలా మొదలైన పరచయం.. పరిణయం దాకా సాగింది.

గౌతమ్-నటాషా..

గౌతమ్-నటాషా..

కోల్ కత్తా నైట్ రైడర్స్ మాజీ కెప్టెన్, భారత క్రికెట్లో ఓపెనర్ గా ఓ వెలుగు వెలిగిన ఓపెనర్ గౌతమ్ గంభీర్. మైదానంలో ఎంతో ప్రమాదకరంగా కనిపించే ఈ క్రికెటర్.. తన పర్సనల్ లైఫ్ నటాషాతో పంచుకున్నాడు. అంతేకాదు బిజెపి తరపున ఎంపీగా కూడా గెలిచాడు.

రోహిత్-రితికా..

రోహిత్-రితికా..

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ రితికాను తొలిసారి ఓ స్పోర్ట్స్ ఈవెంట్ లో చూశాడట. అలా వారిద్దరి మొదలైన పరిచయం మొదట స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారింది. అలా వారిద్దరూ కొన్నాళ్లు ప్రేమాయణం కొనసాగించి తమ సంబంధాన్ని ముందుకు వేయాలని వివాహ బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారట. వీరిద్దరికీ ఓ బిడ్డ కూడా ఉంది.

గబ్బర్ సింగ్-అయేషా ముఖర్జీ..

గబ్బర్ సింగ్-అయేషా ముఖర్జీ..

ఢిల్లీ ఢేర్ డెవిల్స్ ఓపెనర్ గబ్బర్ సింగ్ (శిఖర్ ధావన్) ఆస్ట్రేలియా అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అయితే ఆమెకు ఇది వరకు పెళ్లి జరిగి పిల్లలు కూడా ఉన్నారు. అయినా కూడా ఆమెను ప్రేమించి.. వారినే తన పిల్లలుగా భావించిన గొప్ప త్యాగ పురుషుడు శిఖర్ ధావన్.

రైనా-ప్రియాంక

రైనా-ప్రియాంక

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ సురేష్ రైనా తన చిన్న నాటి స్నేహితురాలు ప్రియాంక చౌదరిని ఓ ప్రైవేట్ వేడుకలో పెళ్లి చేసుకున్నాడు. ఈ కార్యక్రమంలో అతికొద్ది మంది ఆహ్వానితులు హాజరయ్యారు. వీరి వివాహం ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్ లో జరిగింది.

వార్నర్-కాండీస్..

వార్నర్-కాండీస్..

సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన ప్రేయసిని తొలిసారి కలుసుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాడట. వీరిద్దరూ ఇటీవల తెలుగు పాటలకు డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశారు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

డివిల్లీయర్స్-డేనియల్..

డివిల్లీయర్స్-డేనియల్..

ఆర్సీబీ తురుపుముక్క అయిన ఎబి డివిల్లీయర్స్ డేనియల్ విలియర్స్ ను వివాహం చేసుకున్నాడు. తాను 32 ఏళ్ల జీవితంలో స్టంప్ అవుట్ అయ్యానని సరదాగా కామెంట్లు చేస్తుంటాడు.

గేల్-నటాషా..

గేల్-నటాషా..

కింగ్స్ పంజాబ్ భయంకరమైన బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ నటాషా బెర్రిడ్జ్ ను వివాహం చేసుకున్నాడు. ఈ ఇద్దరికీ ఓ పండంటి పాప జన్మించింది. వీరిలో విచిత్రమేమిటంటే.. గేల్ భార్యకు తన గురించి పెద్దగా ఏమి తెలియకుండా వివాహం చేసుకున్నారట. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకునేంత వరకు ఎవ్వరికీ తెలియదు.

మ్యాక్స్ వెల్ - కాండిస్ వ్యాట్..

మ్యాక్స్ వెల్ - కాండిస్ వ్యాట్..

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్, పంజాబ్ బ్యాట్స్ మెన్ మ్యాక్స్ వెల్ తన ప్రేమ గురించి కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో తన ఫీలింగ్ తెలియజేశాడు. తన ప్రేయసికి ప్రేమ వివాహం గురించి చెప్పడానికి చాలా భయపడ్డాడట. తను ఓకే అనడంతో ఎనలేని సంతోషం వచ్చిందట.

డ్వెన్ బ్రావో - రెజీనా రంజిత్..

డ్వెన్ బ్రావో - రెజీనా రంజిత్..

చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ డ్వాన్ బ్రావోకు రెజీనా రంజిత్ చిన్ననాటి నుండే పరిచయం ఉండేదట. ఆ చనువుతోనే వీరిద్దరూ బాగా కలిసి ఉండేవారట. అంతేకాదండోయ్ రెజీనా 22 ఏళ్ల వయసులో మిస్ వరల్డ్ -2013లో పోటీదారుల్లో ఒకరు. వీరిద్దరూ బార్బడోస్ లో ఎక్కుగా నివసిస్తూ ఉంటారు.

వాట్సన్ -లీఫ్లురాంగ్..

వాట్సన్ -లీఫ్లురాంగ్..

చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ షేన్ వాట్సన్ ఆస్ట్రేలియాకే చెందిన ఫ్లురాంగ్ ను 2006లో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరు రిచెస్ట్ కపుల్స్ మరియు హాటెస్ట్ కపుల్స్ జాబితాలోను చోటు సంపాదించారు.

స్టెయిన్-కీట్జ్మాన్..

స్టెయిన్-కీట్జ్మాన్..

ఆర్సీబీ బౌలింగ్ గన్ గా పేరుగాంచిన స్టెయిన్ తన వ్యక్తిగత జీవితం గురించి చాలా అరుదుగా చెబుతుంటాడు. అయితే తన కుటుంబానికి మాత్రం చాలా దగ్గరగా ఉంటాడు. సౌతాఫ్రికాలో ప్రసిద్ధ మోడల్ మరియు నటి అయిన జీన్ కీట్జ్ మన్ ను వివాహం చేసుకున్నాడు. అయితే వీరిద్దరూ కొన్ని కారణాల వల్ల విడిపోయారట. విడిపోయే ముందు వరకు వీరిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారంట.

మురళీ విజయ్ - నికితా..

మురళీ విజయ్ - నికితా..

మురళీ విజయ్-నికితా విజయ్ 2012లో వివాహం చేసుకున్నారు. వీరి వైవాహిక జీవితం అప్పటి నుండి ఇప్పటివరకు చాలా హాయిగా ఆనందంగా కొనసాగుతోంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అయితే నికితా విజయ్ అంతకుముందు దినేష్ కార్తీక్ తో వివాహం చేసుకుంది. ఆ తర్వాత తనతో విడాకులు తీసుకుని. మళ్లీ నిజమైన ప్రేమ మురళీతో ఉందని గ్రహించి.. తనను వివాహం చేసుకుంది.

ఆరోన్ ఫించ్-అమీ గ్రిఫత్స్..

ఆరోన్ ఫించ్-అమీ గ్రిఫత్స్..

ఆర్సీబీ ఓపెనర్ ఆరోన్ ఫించ్ తన ఎంగేజ్ మెంట్ అమీ గ్రిఫత్స్ తో జరిగినట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఈ ఐపిఎల్ సీజన్లో ఈ ఆటగాడు పెద్దగా రాణించలేదు.

హార్దిక్ పాండ్య-ఎల్లీ అవ్రమ్..

హార్దిక్ పాండ్య-ఎల్లీ అవ్రమ్..

ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య - ఎల్లీ అవ్రమ్ లతో ప్రేమలో ఉన్నట్లు పుకార్లు వచ్చినప్పటికీ వీరిద్దరూ ఎక్కడా ఓపెన్ కాలేదు. కానీ వీరిద్దరూ ఓసారి అకస్మాత్తుగా ఎంగేజ్ మెంట్ అంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు. మరో విశేషమేమిటంటే.. హార్దిక్ పెళ్లికి ముందే తనని తల్లి చేశాడు. వీరికి ఓ బిడ్డ కూడా జన్మించింది.

పోలార్డ్ - జెన్నా అలీ..

పోలార్డ్ - జెన్నా అలీ..

ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్, వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ కీరన్ పోలార్డ్ జెన్నా అలీని ఆగస్టు 25, 2012న వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ వివాహానికి ముందు సుమారు ఏడేళ్ల పాటు ప్రేమాయణం కొనసాగించారు. 2020లో వీరు ఎనిమిదో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.

భువీ-నుపూర్

భువీ-నుపూర్

హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తనకు 27 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నోయిడాలోని నుపూర్ తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ తర్వాత వీరి వివాహ కార్యక్రమంలో సన్నిహితులు మరియు కుటుంబసభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఈ యువ క్రికెటర్ కూడా ముందు ప్రేమాయణం కొనసాగించాడు.

జడేజా-రివాబా..

జడేజా-రివాబా..

చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజా మెకానికల్ ఇంజనీర్ అయిన రివాబాను వివాహం చేసుకున్నాడు. రివా మరియు నైనా (అతని సోదరి) పరిచయస్తులని, అందువల్ల వీరి మ్యాచ్ కు కుటుంబసభ్యులు ఎలాంటి అడ్డంకులు చెప్పలేదట. వీరిద్దరూ ఒకటి కావడానికి పూర్తిగా సహకరించారట.

All Images Credits

English summary

Girlfriends and Wives of IPL Cricketers

Here are the girlfriends and wives of ipl cricketers. Take a look
Desktop Bottom Promotion