For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే.. ఈ రూల్స్ ఫాలో అవ్వండి...!

మీ వివాహ జీవితం హ్యాపీగా కావాలంటే బంగారం లాంటి ఈ నియమాలను పాటించండి. అవేంటో తెలుసుకోవడానికి ఇక్కడ ఓ లుక్కేయండి.

|

పెళ్లయిన ప్రతి ఒక్క జంట తాము జీవితాంతం ఆనందంగా జీవించాలని కోరుకుంటారు. కానీ అది కేవలం కొందరికే సాధ్యమవుతుంది.

Golden Rules for a Happy Marriage in Telugu

అందరికీ జీవితాంతం సంతోషంగా జీవించడం అనేది సాధ్యం కాదు. అయితే ఆలుమగలిద్దరూ ఆనందంగా కలిసి ఉండటానికి.. కలకాలం కాపురం కలహాలు లేకుండా కొనసాగించడానికి రహస్యాలేమీ లేవు.

Golden Rules for a Happy Marriage in Telugu

భార్యభర్తలిద్దరికీ చాలా విషయాల్లో అవగాహన, నమ్మకం, సంరక్షణ మరియు కొన్ని నియమాలు ఉంటే చాలు. ఈ సందర్భంగా సంతోషకరమైన వివాహ జీవితం కోసం ఉన్న గోల్డెన్ రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

పడకగదిలో మీ మూడ్ పెంచడంలో చాక్లెట్ ఎంతలా హెల్ప్ చేస్తుందో తెలుసా...పడకగదిలో మీ మూడ్ పెంచడంలో చాక్లెట్ ఎంతలా హెల్ప్ చేస్తుందో తెలుసా...

భిన్నంగా ఉంటే..

భిన్నంగా ఉంటే..

సాధారణంగా వివాహం చేసుకున్న జంటల్లో ఏ ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు, అలవాట్లు ఒకే మాదిరిగా ఉండవు. చాలా విభిన్నంగా ఉంటాయి. అంతేకాదు ఆలోచనా ధోరణి కూడా వేరుగా ఉంటుంది. అయితే ఎవరైతే దంపతులు వారి బిన్నమైన అభిప్రాయాలను గౌరవించుకుంటారో.. వారి రిలేషన్ షిప్ పై ఎలాంటి ప్రతికూల ప్రభావం అనేదే పడదు.

మార్పులు అక్కర్లేదు..

మార్పులు అక్కర్లేదు..

చాలా మంది వివాహం అయ్యాక భాగస్వామి తాము చాలా విషయాల్లో మారాలని అనుకుంటూ ఉంటారు. లేదంటే తమ వైవాహిక జీవితం ఆనందంగా ఉండదనుకుంటారు. అయితే ఇదంతా నిజం కాదు. మీరు పెళ్లికి ముందు ఎలా అయితే ఉంటారో.. పెళ్లి తర్వాత కూడా అలానే ఉండాలి. అయితే మీరు ఎప్పుడైతే మీ భాగస్వామి కోసం మారాలని ఆలోచిస్తే.. అప్పుడే అసలు సమస్య ఎదురవుతుంది. అయితే మీరు కొన్ని విషయాల్లో రాజీపడాల్సి ఉంటుంది. దీని వల్ల మీకు చాలా ప్రయోజనాలు ఉంటాయి.

మీ ఇద్దరి ప్రేమ..

మీ ఇద్దరి ప్రేమ..

రాజీ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో సహజమైన ఒక భాగం. ఇది ఎలాంటి బంధంలోనైనా తప్పనిసరిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కొందరు వ్యక్తులు తాము రాజీలపై ఆధారపడకుండా ఒకరినొకరు ప్రేమించుకోవడానికి మాత్రమే కట్టుబడి ఉన్నప్పుడు, ఆ వివాహం విజయవంతమవుతుంది. కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఎదురయ్యే అడ్డంకులతో సంబంధం లేకుండా ఒకరినొకరు పూర్తి స్థాయిలో ప్రేమిస్తామని ప్రతిజ్ణ చేయొచ్చు.

ఈ పనులు చేస్తే.. మీ భాగస్వామి మిమ్మల్ని జీవితాంతం ప్రేమిస్తారని తెలుసా...!ఈ పనులు చేస్తే.. మీ భాగస్వామి మిమ్మల్ని జీవితాంతం ప్రేమిస్తారని తెలుసా...!

తప్పు జరిగినప్పుడు..

తప్పు జరిగినప్పుడు..

కేవలం వివాహ బంధం లోనే కాదు.. వేరే ఇతర బంధాల్లోనూ తప్పులు అనేవి సాధారణంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే తప్పును ఒప్పుకుంటామో.. క్షమాపణ చెప్పడం వంటివి చేస్తే సమస్యకు అక్కడే పరిష్కారం దొరుకుతుంది. అలా కాకుండా ఒకరిపై ఒకరు నెపాన్ని నెట్టేసుకుంటే సమస్య పెద్దదవుతుంది తప్ప.. పరిష్కారం మాత్రం కాదు. ఎందుకంటే కొందరు తమ అహంకారానికి కట్టుబడి ఉంటారు. కానీ ఇలాంటి ఈగోలను పక్కనబెట్టి ఇద్దరూ కలిసి అడుగు ముందుకేస్తే.. మీ భవిష్యత్తు బంగారు మయం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

పవిత్ర బంధం..

పవిత్ర బంధం..

వివాహం అనేది పవిత్ర బంధంగా భావిస్తారు. కాబట్టి ఈ బంధంలో వ్యక్తిగత జీవితాలను ఆస్వాదించలేరా? అంటే కచ్చితంగా చెప్పలేం. అయితే వివాహ జీవితం ప్రకారం, ఒక జంట తమ జీవితమంతా మరియు వ్యక్తిత్వానికి విరుద్ధంగా ఉండకూడదు. అయితే మీ సొంత ఆసక్తులను మాత్రం కొనసాగించొచ్చు మీరు మీ భాగస్వామి మద్దతుతో వారి సొంత అభిప్రాయాలను కలిగి ఉంటారు.

ఇవి మరచిపోవాలి..

ఇవి మరచిపోవాలి..

మనలో చాలా మందికి పెళ్లికి ముందు కొన్ని ప్రేమ కథలు లేదా బ్రేకప్ లు ఉంటాయి. కాబట్టి మీ ప్రియుడిని లేదా ప్రియురాలిని సాధ్యమైనంత త్వరగా మరచిపోవాలి. అయితే ఇందులో మీరు మీ భాగస్వామి సహాయం తీసుకవచ్చు. వారు మీతో మరీ బద్దకస్తు్ల్లా ఉంటే మాత్రం మీరు వారికి కొంచెం గట్టిగా చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ సోషల్ మీడియాను ఫిల్టర్ చేసేయండి. మీ పాత జ్ణాపకాలలో నెగిటివ్ గా ఉండే వాటికి గుడై్ చెప్పండి.

English summary

Golden Rules for a Happy Marriage in Telugu

Here are the goldern rules for a happy marriage in Telugu. Take a look
Story first published:Friday, August 6, 2021, 16:22 [IST]
Desktop Bottom Promotion