Latest Updates
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు!
‘నా భార్య ఎదుటే.. నన్ను అలా చేసింది.. నాకు చాలా అన్ ఈజీగా అనిపించింది..’
‘నా భార్య స్నేహితుడు తన కళ్ల ముందే నాతో సరసాలాడుతున్నాడు’.
మన సమాజంలో రోజురోజుకు సిటీ కల్చర్ పెరిగిపోతోంది. ముఖ్యంగా వీకెండ్ వస్తే చాలు పబ్ లు, పార్టీల పేరుతో తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇదంతా పెళ్లికి ముందు వరకు బాగానే ఉంటుంది.

పెళ్లి తర్వాతే కాస్త కష్టంగా మారుతుంది. అయితే పెళ్లి తర్వాత కూడా అలానే ఎంజాయ్ చేస్తున్న జంటలు కొందరు ఉన్నారు. అయితే అలాంటి వారికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి.. వాటికి పరిష్కారాలేంటి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పెళ్లికి ముందే..
హాయ్! నా పేరు గిరీష్ (పేరు మార్చాం). నా వయసు 30 సంవత్సరాలు నాకు పెళ్లి జరిగి ఆరు నెలలే పూర్తయ్యింది. అయితే నా భార్యకు పెళ్లికి ముందే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. తను సిటీలో పుట్టి పెరిగిన కారణంగా తను వీకెండ్ వస్తే చాలు చాలా పార్టీలు చేసుకుంటూ ఉంటుంది. పెళ్లికి ముందు ఈ విషయం నాకు తెలీదు. అయితే పెళ్లి తర్వాత నన్ను కూడా తనతో పాటు పార్టీలకు తీసుకెళ్లేది.

కొంచెం తేడాగా..
అలా పార్టీల్లో తన ఫ్రెండ్స్ కు పరిచయం చేసేది. అయితే వారిలో పరిచయమైన వారిలో ఒక ఆమె ఆరోజు నుండి నన్ను కొంచెం తేడాగా చూడటం మొదలెట్టింది. నేను ఎంత దూరంగా ఉన్నా.. నాతో క్లోజ్ గా మూవ్ అయ్యేందుకు ట్రై చేస్తుంది. ఇదే విషయాన్ని నేను నా వైఫ్ కు కూడా చెప్పాను.

లైట్ తీసుకుంది..
అయితే తను నీతో జోక్ చేస్తుందిలే అని లైట్ తీసుకుంది. అయితే రీసెంట్ జరిగిన పార్టీలో తను లిమిట్స్ క్రాస్ చేసింది. ఏకంగా నా భార్య ముందే నాకు కిస్ చేసేసింది.

నా భార్యంటే ఇష్టం..
అయినా కూడా నా భార్య ఏమీ అనకపోవడంతో నేను ఆశ్చర్యపోయాను. నా వైఫ్ ఫ్రెండ్స్ లో ఇతరుల ప్రవర్తన కూడా ఇంచుమించు అలానే ఉంది. అయితే నాకు నా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం. తనకు కూడా నేనంటే ఎంతో ఇష్టం. కానీ, ఇలాంటివి నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఈ సంఘటనతో నేను చాలా నిరాశకు గురయ్యాను.

నేనేం చేయాలి..
ఇప్పుడేం నేను ఏమి చేయాలి.. నాకు పరిష్కారం చెప్పగలరు' అని ఓ యువకుడు తన సమస్యను మానసిక నిపుణులతో చెప్పుకున్నాడు. దీనికి నిపుణులు ఏమి సమాధానం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం...

ఓపెన్ గా ఉండాలి..
మీ ప్రాబ్లమ్ ఏంటో మాకు అర్థమైంది. మీరు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. పెళ్లి అంటే ఏడడుగులు.. మూడు ముళ్లు.. నలుగురి అక్షింతలే కాదు.. వందేళ్ల కాపురం. అలాంటి బంధం బలంగా ఉండాలంటే.. మీ ఇద్దరి మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదు.

మీ వైఫ్ కు మీ ఇబ్బందిని..
ముఖ్యంగా అలాంటి విషయాల్లో అస్సలు మోహమాటపడకూడదు. మీరు ఎంతలా ఇబ్బందికి గురవుతున్నారనే విషయాన్ని తనకు తెలియజేయాలి.

ఫ్రెండ్ అయితే..
మీ భార్యకు ఫ్రెండ్ కావచ్చు. కానీ, తన బిహేవియర్ గురించి మీరిద్దరూ గొడవ పడకుండా చూసుకోవాలి. మీరిద్దరూ కలిసి కూల్ గా మాట్లాడుకోవాలి. ముఖ్యంగా మీ వైఫ్ కు మీరే అర్థమయ్యేలా వివరించాలి.

పాత అలవాట్లు..
ఎందుకంటే మీ కంటే ముందే వారితో బాగా పరిచయం మరియు క్లోజ్ గా ఉండటం అలవాటు అయ్యి ఉంటుంది కాబట్టి.. పెళ్లైన కొత్తలో వెంటనే వారితో రిలేషన్ కట్ చేయమంటే కష్టమవుతుంది. అదే కల్చర్ ను వారు పెళ్లి తర్వాత కూడా కంటిన్యూ చేయొచ్చు.

ఇంకోసారి అలా జరగకుండా..
అయితే మీకు అలాంటి కల్చర్ ఇష్టం లేదని.. మీరు అలాంటి సంఘటనల పట్ల ఎంతలా ఇబ్బంది పడుతున్నారో మీ భార్యకు అర్థమయ్యేలా చెబితే.. తను కూడా మీకు కోఆపరేట్ చేయొచ్చు. అంతేకాదు ఇంకోసారి పార్టీల్లో అలా జరగకుండా జాగ్రత్త పడొచ్చు.



Click it and Unblock the Notifications











