For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లి తర్వాత హ్యాపీగా ఉండాలంటే.. ఈ చిట్కాలను ఫాలో అవ్వండి...

పెళ్లి తర్వాత హ్యాపీగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి.

|

మనలో చాలా మంది పెళ్లైన తర్వాత నిరుత్సాహంగా ఉంటారు. చిన్న చిన్న విషయాలకే పార్ట్ నర్ తో గొడవ పడుతూ ఉంటారు. దీనంతంటికి కారణం ఇద్దరి మధ్య సాన్నిహిత్యం లేకపోవడం.

How Do You Stay in Love Forever? Married Readers Share Their Tips

అయితే కొందరు జంటలు పెళ్లైన కూడా తమ మధ్య బంధాన్ని మరింత బలపరచుకుంటారు. వారి మధ్య ఏ చిన్న గొడవ వచ్చినా.. చర్చించుకుని లేదా సర్దుకుపోవడం, రాజీపడటం వంటివి చేస్తూ చాలా హ్యాపీగా ఉంటున్నారు. అయితే మరికొందరు జంటలు మాత్రం తమ బంధంలో భాగస్వామిని అపార్థం చేసుకుని విడిపోవడానికి మొగ్గు చూపుతున్నారు.

How Do You Stay in Love Forever? Married Readers Share Their Tips

ఇంకా కొందరు నిత్యం మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే వివాహ జీవితంలో మానసిక సమస్యలను అధిగమించాలంటే ఏం చేయాలి.. ఆ సమస్యలను ఎలా ఎదుర్కోవాలో కొందరు దంపతులు చెబుతున్నారు. తమ అనుభవాల గురించి Quoraలో వివరించారు. ఆ ఆసక్తికరమైన విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఆలుమగల మధ్య అనుబంధం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే...ఆలుమగల మధ్య అనుబంధం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే...

పెళ్లి తర్వాత..

పెళ్లి తర్వాత..

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక మధురమైన ఘట్టం. పెళ్లి తర్వాత తమ జీవితం సంతోషంగా సాగిపోవాలని ఊహించుకుంటారు. అయితే ఆలుమగలిద్దరూ తమ బాధ్యతలను సమానంగా పంచుకోవాలి. అప్పుడే జంటల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. అయితే వివాహ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ప్రాబ్లమ్ అనేది సహజంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఆ సమస్యలను అధిగమించాలంటే.. చాలా ధైర్యంగా ఉండాలి. కానీ చాలా మంది తడబడుతూ ఉంటారు.

అందరికీ దూరంగా..

అందరికీ దూరంగా..

‘నేను పెళ్లి చేసుకున్న తర్వాత 30 ఏళ్ల వయసులో తొలిసారిగా తీవ్రమైన ఒత్తిడి, నిరాశ, నిరుత్సాహానికి గురయ్యాను. అప్పటిదాకా నాకు భయం ఏంటో తెలీదు. నా భర్త ప్రవర్తన వల్ల నేను దూరంగా ఉంటూ వచ్చాను. నా వల్ల భర్త ఇబ్బంది పడకూడదని అనుకున్నాను. అందుకే బయటకు రావడం కూడా తగ్గించాను. అయితే నా పరిస్థితిని చూసి నా భర్త అర్థం చేసుకున్నాడు. నాకు అండగా నిలిచాడు. తను నన్ను అర్థం చేసుకున్నాడని, తను నన్ను ప్రేమిస్తున్నాడని, అది నాపై ఎంతో ప్రభావం చూపింది. ఈ కారణంగానే నేను ఒత్తిడి, నిరాశ, ఆందోళన నుండి బయటపడ్డాను' అని ఓ వివాహిత వివరించారు.

స్పష్టతగా ఉండాలి..

స్పష్టతగా ఉండాలి..

‘మీరు వైవాహిక జీవితంలో ఏదైనా తప్పు చేస్తే.. దాన్ని భాగస్వామి ముందు నిజాయితీగా ఒప్పుకోవాలి. చాలా విషయాల్లో క్లారిటీగా ఉండాలి. మీరు ఏదైనా సరైన పని చేసినప్పుడు అది మీ భాగస్వామికి తప్పుగా అనిపిస్తే.. నెమ్మదిగా చెప్పేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా జంటల మధ్య జరిగే ప్రతి విషయాలన్నీ స్పష్టతతో ఉండాలి. తొలి రోజుల్లో నాకు, నా భార్యకు నిత్యం గొడవలు జరుగుతూ ఉండేవి. కానీ.. తర్వాత నేను నా భార్యతో వాదించడం మానేశాను. ఏదైనా తప్పు జరిగినప్పుడు మాట్లాడటం తగ్గించి.. గోడపై స్టిక్ పేపర్లపై దాని గురించి రాసేవాడిని. అలా కొన్నిరోజులకు మా మధ్య గొడవలు తగ్గిపోయాయి. ముందుగా గొడవలు రాకుండా ఉండాలంటే.. ఏం చేయాలనే దాని గురించి కూర్చుని మాట్లాడుకునేవాళ్లం. దీంతో అప్పటి నుండి ఆనందంగా ఉన్నాం' అని ఓ వ్యక్తి తన అనుభవాన్ని వివరించారు.

పెళ్లికాని ప్రసాదులు పెరిగిపోవడానికి ప్రధాన కారణాలివే...!పెళ్లికాని ప్రసాదులు పెరిగిపోవడానికి ప్రధాన కారణాలివే...!

నిర్ణయాల విషయంలో..

నిర్ణయాల విషయంలో..

‘మీరు పెళ్లి చేసుకున్న తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. నేను, నా భార్య మాట్లాడుకునేవాళ్లం. ఎలాంటి విషయంలో అయినా.. నిజాయితీగా ఉండాలని డిసైడ్ అయ్యాం. అసత్యాలు అస్సలు చెప్పకూడదని ఒకరికొకరు మాట ప్రామీస్ చేసుకున్నాం. ఇప్పటికి దాన్నే ఫాలో అవుతున్నాం. దీని వల్ల మా ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు రాకుండా ప్రశాంతంగా, హ్యాపీగా ఉంటున్నాం' అని మరో పెళ్లైన వ్యక్తి వివరించారు.

అభిప్రాయాలను గౌరవిస్తే..

అభిప్రాయాలను గౌరవిస్తే..

‘ఒక జంట కలిసి ఉండటంలో వారి కుటుంబ నేపథ్యం, పెరిగిన వాతావరణం కీలక పాత్ర పోషిస్తాయి. కపుల్స్ మధ్య పెళ్లి తర్వాత ఏదో ఒక విషయంలో గొడవలు రావడం అనేది చాలా సహజం. ఎంత గొడవ జరిగినా మేమిద్దరం సంతోషంగా ఉండటానికి కారణం, నేను, నా భర్త ఒకరి అభిప్రాయాలను, నిర్ణయాలను గౌరవించుకుంటాం. తప్పులను, లోపాలను ఎలా సరిదిద్దుకోవాలో ప్రయత్నిస్తాం' అంటూ ఓ భార్య చెప్పారు.

నేను చాలా లక్కీ..

నేను చాలా లక్కీ..

పెళ్లికి ముందు నాకు ఎన్నో ఆలోచనలుండేవి. నేను చేసుకోబోయే వ్యక్తి మనస్తత్వం ఎలా ఉంటుందోనని? నన్ను హ్యాపీగా ఉంచుతాడో లేదననే అనుమానం ఉండేది. కానీ ఇప్పుడు ఆ భయాలేవీ లేవు. ఎందుకంటే.. పెళ్లికి ముందు నా లైఫ్ లో పెద్దగా వచ్చిన మార్పుల్లేవు. నేను చెప్పే ఏ విషయమైనా సరే నా భర్త చాలా ఓపికగా వింటారు. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇంటి పనుల్లో కూడా సాయం చేస్తారు. అందుకే నేను చాలా లక్కీ అని ఫీలవుతుంటాను' ఓ వివాహిత వివరించారు.

English summary

How Do You Stay in Love Forever? Married Readers Share Their Tips

Here we are talking about the how do you stay in love forever? Married readers share their tips. Read on
Story first published:Friday, June 18, 2021, 12:21 [IST]
Desktop Bottom Promotion