For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

How to Avoid Divorce:వివాహ జంటలు విడాకుల వరకు వెళ్లకూడదంటే...!

|

పెద్దలు కుదర్చిన పెళ్లయినా.. ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం బలపడాలంటే వారి మధ్య శారీరక సాన్నిహిత్యం, కమ్యూనికేషన్ గ్యాప్ అనేవి అస్సలు ఉండకూడదు.

అలా ఉన్నప్పుడే ఆలుమగలిద్దరూ జీవితాంతం ఆనందంగా, హాయిగా ప్రశాంతాంగా వైవాహిక జీవితాన్ని గడుపుతారు. అంతేకాదు అనేక విషయాల్లో భార్యభర్తలిద్దరిలో ఎవరో ఒకరు సర్దుకుపోవాలి. ఇలాంటివి జరగకపోతే.. ఆ బంధంలో చీలికలు ప్రారంభమవుతాయి.

సాధారణంగా ఎవరైనా కొత్త జంటలు ఏదైనా విషయంలో గొడవ పడితే.. వారి బంధాన్ని నిలబెట్టేందుకు పెద్దలు తమ వంతు ప్రయత్నం చేస్తారు. కొన్ని సందర్భాల్లో స్నేహితులు కూడా సహాయం చేస్తారు. అయితే ఇలాంటి గొడవలు కొన్నిసార్లు తమ బంధాన్ని మరింత బలంగా మారుస్తాయి.

కానీ తరచుగా గొడవలు పడితేనే ఆ బంధం విడిపోయేంత దూరం వెళ్తుంది. అయితే కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా ఆలుమగలిద్దరూ అనునిత్యం గొడవపడుతూ ఉంటారు. ఆ కోపంలోనే విడిపోదామనుకుని.. విడాకులు తీసుకోవాలని ఆలోచిస్తారు. అయితే ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవి ప్రయత్నించడం వల్ల మీ ఇద్దరి మధ్య ప్రేమను మరింత పెంచుతాయట. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Shikhar Dhawan Divorce;భార్యకు విడాకులిచ్చిన స్టార్ బ్యాట్స్ మెన్.. 9 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు..Shikhar Dhawan Divorce;భార్యకు విడాకులిచ్చిన స్టార్ బ్యాట్స్ మెన్.. 9 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు..

రీజన్స్ తెలుసుకోండి..

రీజన్స్ తెలుసుకోండి..

మీ వైవాహిక జీవితంలో గొడవలకు, సమస్యలకు గల ప్రధానమైన రీజన్స్ ఏంటో తెలుసుకోండి. మీరు మీ సమస్య యొక్క మూల కారణం గుర్తిస్తే.. దాన్ని మొదట్లోనే గుర్తించి పరిష్కరించుకుంటే చాలు. కొన్ని సందర్భాల్లో మీ ఇద్దరిలో ఎవరో ఒకరు సర్దుకుపోతే చాలు మీ వివాహ జీవితంలో విడాకుల అనే మాటే రాదు.

సమయం కేటాయించండి..

సమయం కేటాయించండి..

మీకు వివాహం జరిగి చాలా కాలం అయ్యిందా? మీ వివాహ జీవితంపై బోర్ కొడుతున్నట్టు అనిపిస్తోందా? మీకు ఇప్పటిదాకా ఉన్న భాగస్వామితో ఇబ్బందిగా ఉంటే.. అలాంటి సమస్యలను అధిగమించేందుకు మీరు వారి కోసం కొంత సమయాన్ని కేటాయించండి. వారితో సరదాగా గడపండి. మీ షెడ్యూల్ లో మీ భాగస్వామి ప్రత్యేక సమయాన్ని కేటాయించి.. తనను సర్ ప్రైజ్ చేస్తే.. మీ రిలేషన్ షిప్ ఎప్పటికీ బోర్ కొట్టదు.

ప్రేమను అందించండి..

ప్రేమను అందించండి..

ప్రేమికుల మధ్య ప్రేమ ఎలా చిగురిస్తుందో.. వివాహం తర్వాత మీ భాగస్వామిపై కూడా మీరు అంతే ప్రేమ చూపించాలి. తనకు మీపై నమ్మకం కలిగేలా చేయాలి. దీని కోసం అనునిత్యం తను మీ గురించే ఆలోచించేలా కొన్ని పనులు చేయాలి. అందుకోసం టెక్నాలజీని వాడుకోండి. మీరు తనతో భౌతికంగా దూరంగా ఉన్నప్పుడు.. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్విట్టర్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా తనతో టచ్ లో ఉండండి. రెగ్యులర్ ఫోన్లో మాట్లాడండి. ఫన్నీ ఎమోజీలు, ఇంట్రస్టింగ్ స్టిక్కర్లు పంపండి.

ఈ వయసులో ఉండే మగువలు ఎక్కువ రొమాన్స్ కావాలని కోరుకుంటారట...!ఈ వయసులో ఉండే మగువలు ఎక్కువ రొమాన్స్ కావాలని కోరుకుంటారట...!

శారీరక సాన్నిహిత్యం..

శారీరక సాన్నిహిత్యం..

భార్యభర్తల బంధాన్ని బలోపేతం చేయడంలో శారీరక సాన్నిహిత్యం కీలకపాత్ర పోషిస్తుంది. మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం లేకపోతే అది పోరాటాలకు దారి తీస్తుంది. కాబట్టి మీరిద్దరూ సాన్నిహిత్యంగా ఉండటం అలవాటు చేసుకోండి. మీరు రెగ్యులర్ గా తనతో రొమాన్స్ చేయండి. వారంలో కనీసం రెండు లేదా మూడు సార్లయినా తనతో కలవండి. మీ భాగస్వామిని సుఖపెట్టేందుకు ప్రయత్నించండి. అప్పటి నుండి తను మీపై మరింత ఇష్టాన్ని పెంచుకుంటుంది.

పెద్దల సలహాలు..

పెద్దల సలహాలు..

మీ వివాహ జీవితంలో తరచుగా గొడవలు జరుగుతూ ఉంటే.. మీరు వాటిని భరించలేని సందర్భంలో ఆ బంధాన్ని వదులుకోవాలని భావిస్తారు. అయితే అలా కాకుండా మీ గొడవల గురించి మీ పెద్దలకు, బంధువులకు, స్నేహితులతో షేర్ చేసుకోండి. వారి సలహాలు, సూచనలు తీసుకోండి. మీ ఇద్దరి మధ్య జరిగే గొడవలకు పుల్ స్టాప్ పెట్టేయండి. అంతే మీకు విడిపోదామనే ఆలోచనలు దాదాపు దూరమవుతాయి.

గ్యాప్ లేకుండా..

గ్యాప్ లేకుండా..

మీరు ప్రేమ బంధంలో ఉన్నా.. వివాహ బంధంలో ఉన్నా.. మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎంతో ముఖ్యమైనది. మీ ఇద్దరి మధ్య పెద్దగా మాటలు లేకపోతే.. మీ ఇద్దరి మధ్య బంధం బలపడటం అనేది అస్సలు జరగదు. కాబట్టి మీరు ముందుగా ఒకరినొకరు బాగా మాట్లాడుకోవాలి. మీ గురించి ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి. ప్రతి విషయం గురించి మాట్లాడుకోవాలి.

ఆర్థిక సమస్యలు..

ఆర్థిక సమస్యలు..

చాలా మంది జంటలు విడిపోవడానికి.. గొడవ పడటానికి ముఖ్యమైన కారణాల్లో ఆర్థిక పరమైన సమస్య ఒకటి. మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా ఖర్చు చేస్తారు.. ఎవరు ఎక్కువ పొదుపు చేస్తారనే విషయాల గురించి వివాదాలు జరగొచ్చు. ఇలాంటి విషయాల గురించి గొడవపడకుండా.. ఇద్దరూ కలిసి చర్చించుకోవాలి. ఒకరి అవసరాలు మరొకరు తెలుసుకోవాలి. మీ ఇద్దరు ఆదాయం, ఖర్చులపై ఓ ఆర్థిక పరమైన ప్రణాళిక రూపొందించుకోవాలి.

English summary

How to Avoid Divorce: Tips to Save Your Failing Marriage

Here we are talking about the how to avoid divorce:Tips to save your failing marriage. Have a look
Story first published: Wednesday, September 8, 2021, 16:48 [IST]