For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలా చేస్తే మీ ప్రియురాలు లేదా భార్యతో హ్యాపీగా గడపొచ్చు...!

రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు గొడవలు వస్తే.. వాటిని ఎలా ఆపగలరనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

మనలో ఏ ఒక్కరూ పర్ఫెక్ట్ కాదు.. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక విషయంలో వీక్ నెస్ అనేది కచ్చితంగా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క జంట వంద శాతం జీవితాంతం ఆనందంగా, హాయిగా జీవించడం అనేది చాలా కష్టం.

How To Stop Fighting In a Relationship in Telugu

భార్యభర్తలన్నాక పలు సందర్భాల్లో గొడవలు, వాదనలు జరగడం అనేది చాలా సహజం. అయితే కొందరు తరచుగా గొడవ పడుతుంటారు. మరికొందరు అప్పుడప్పుడు గొడవ పడుతుంటారు. అలాంటి సమయంలో భాగస్వామిపై చిరాకు, కోపం వంటివి కలుగుతాయి.

How To Stop Fighting In a Relationship in Telugu

అలాంటి వారితో కాపురం కలకాలం చేయలేమని అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులు మీకు కూడా ఎదురయ్యాయా? అయితే మీ ప్రియురాలితో లేదా భార్యతో గొడవలు రాకుండా ఉండాలంటే ఏమి చేయాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆలుమగల మధ్య దూరం... మరింత పెరిగే విరహం... అదెలాగో మీరే చూడండి...ఆలుమగల మధ్య దూరం... మరింత పెరిగే విరహం... అదెలాగో మీరే చూడండి...

నిజాలను చెప్పండి..

నిజాలను చెప్పండి..

మీరు మీ భాగస్వామితో దీర్ఘకాలిక సంబంధం కోరుకుంటూ ఉంటే.. మీరు వారి ప్రతికూలతల గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. కాబట్టి మీరు సాధ్యమైనంత మేరకు మీ భార్యతో లేదా ప్రియురాలితో నిజాలనే మాట్లాడండి. అయితే వాటి వల్ల కొన్నిసార్లు వారికి కోపం రావచ్చు. అప్పుడు మీరు కూడా వారిపై కోపం చూపితే.. అది మీ ఇద్దరి మధ్య బంధాన్ని దూరం చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు నిజాలను మాట్లాడటం వల్ల దూరాన్ని పెంచే సమస్యలను అధిగమించొచ్చు. అయితే కొన్ని విషయాల్లో రాజీ కుదిరితేనే మీ మ్యారేజ్ లైఫ్ లో సంతోషంగా ఉండగలరు.

సానుకూలంగా ఉండాలి..

సానుకూలంగా ఉండాలి..

మీరు ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించాలి. ముఖ్యంగా మీ భాగస్వామితో ఉన్నప్పుడు ప్రతిదీ పాజిటివ్ గా తీసుకోవాలి. ఒకవేళ మీ పార్ట్నర్ మీ గురించి ప్రతికూలంగా ఉంటే.. వారికి మీ వైపు ఆసక్తి కలిగేలా సానుకూలంగా వ్యవహరించాలి. ముఖ్యంగా మీరు వారితో ఉన్నప్పుడంతా హ్యాపీగా ఉండేందుకు ప్రయత్నించండి. దీని వల్ల మీ భాగస్వామి కూడా హ్యాపీగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. మీరు సంతోషంగా ఉంటేనే మీ పార్ట్నర్ కూడా హ్యాపీగా ఉంటారనే విషయాన్ని గ్రహించండి.

కారణాలేంటో తెలుసుకోండి..

కారణాలేంటో తెలుసుకోండి..

మీ ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయా? అయితే అందుకు గల కారణాలేంలో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నించండి. గొడవకు దారి తీసిన పరిస్థితులేంటో తెలుసుకోండి. గొడవ తర్వాత వారితో ప్రేమగా, ఆప్యాయతగా మాట్లాడి.. గొడవలకు గల కారణాలేంటో తెలుసుకోండి. వారు ఎంతకీ చెప్పకపోతే.. అప్పుడు మీరో మరో రకంగా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే ఫలితం ఉంటుంది. ఇలా చేస్తే మీరు మీ భాగస్వామితో బంధాన్ని మరింత బలంగా మార్చుకోవచ్చు.

శ్రద్ధగా వినాలి..

శ్రద్ధగా వినాలి..

ఆలుమగల జీవితం అన్నాక ఏదో ఒక సందర్భంలో ఏవో కొన్ని సమస్యలు అనేవి సాధారణంగానే వస్తున్నాయి. అలాంటి సమయంలో మీ పార్ట్నర్ మీతో సమస్య గురించి ఏదైనా చెప్పుకుంటుంటే.. మీరు శ్రద్ధగా వినాలి. కొన్నిసార్లు మీ భాగస్వామి కొన్ని విషయాలను ఓపెన్ గా చెప్పకపోవచ్చు. కానీ వారు మీకు ఒక చిన్న సూచన చేయొచ్చు. అప్పుడు మీరు వారి ప్రాబ్లమ్స్ కు సొల్యూషన్ వెతికే ప్రయత్నం చేయండి. మీ సమస్య తెలిసిన తర్వాత వారికి అన్ని విధాలుగా సహాయం చేయడానికి ప్రయత్నించాలి.

ఆ కార్యం గురించి అబ్బాయిలకు ఉండే అపొహలేంటో తెలుసా...ఆ కార్యం గురించి అబ్బాయిలకు ఉండే అపొహలేంటో తెలుసా...

హద్దుల్లో ఉండండి..

హద్దుల్లో ఉండండి..

మీ దాంపత్య జీవితంలో ఆనందంగా ఉండాలంటే.. మీరు ఆరోగ్యకరమైన హద్దుల్లో ఉండాలి. దీని వల్ల మీరు జీవితాంతం సంతోషంగా గడిపేందుకు అవకాశం ఉంటుంది. మీపై ప్రతికూల ప్రభావం కూడా పెద్దగా ఉండకపోవచ్చు. అయితే మీరు ప్రతికూల ప్రవర్తన వల్ల ప్రభావితమైతే మీ మధ్య సరిహద్దులు శ్రుతి మించొచ్చు.

వాదనలు రాకుండా..

వాదనలు రాకుండా..

మీ వైవాహిక జీవితంలో కమ్యూనికేషన్ అనేది చాలా కీలకం. అయితే అది సానుకూలంగా ఉండాలి. మీరు పాజిటివ్ గా మాట్లాడితే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. కానీ మీరు నెగిటివ్ గా మాట్లాడినప్పుడే వాదనలు వస్తాయి. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే.. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు స్వార్థపూరితంగా ఉండే విషయాలను వదిలిపెట్టాలి.

కలిసే ఉండాలి..

కలిసే ఉండాలి..

వైవాహిక జీవితంలో ఎన్ని గొడవలు వచ్చినా.. ఎన్ని వాదనలు జరిగినా.. ఎవరు పై చేయి సాధించినా.. ఎవరు ఓడిపోయినా.. ఇద్దరూ కలిసే ఉండాలి. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య కేవలం ఐక్యత అనేది ఉంటుంది. ఇందుకోసం మీరు మీ జీవిత భాగస్వామి గురించి పట్టించుకోవడం తప్ప రహస్యంగా దాచిన విషయాలు లేదా ఉద్దేశాలు లేవని మీరు ఒప్పించడానికి ప్రయత్నించాలి.

ఎక్కువగా గడపండి..

ఎక్కువగా గడపండి..

మీ భాగస్వామితో మీకు ఎక్కువగా గొడవలు రాకుండా సంతోషంగా ఉండాలంటే.. మీరు వారితో సాధ్యమైనంత ఎక్కువ సమయం గడపండి. ముఖ్యంగా వారానికొకసారైనా బయటకు తీసుకెళ్లండి. ఏదైనా సినిమాకు లేదా షాపింగ్ మాల్ కు తీసుకెళ్లండి. దీని వల్ల మీరు మీ వైవాహిక జీవితంలో ప్రతికూలతలను సులభంగా అధిగమించొచ్చు. దీని వల్ల మీ భాగస్వామికి మీపై మరింత ప్రేమ పెరుగుతుంది.

English summary

How To Stop Fighting In a Relationship in Telugu

Here we are talking about the how to stop fighting in a relationship in Telugu. Have a look
Story first published:Wednesday, August 4, 2021, 11:23 [IST]
Desktop Bottom Promotion