For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు పెరిగితే.. బెడ్ రూమ్ లో భాగస్వామిని సుఖపెట్టలేమా?

మీ పడకగదిలో రొమాన్స్ చేసే సమయంలో మీ బరువు ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే వివరాలను ఇప్పడు తెలుసుకుందాం.

|

ఈరోజుల్లో చాలా మంది సులువుగా బరువు పెరిగిపోతున్నారు. కరోనా కారణంగా చాలా మంది ఇంటి నుండే పని చేయడం ద్వారా బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఊబకాయం పెరిగిపోతోంది.

How Your Weight Plays a Role in the Bedroom

అయితే ఇలా మీరు బరువు పెరుగుతూ పోతే.. భాగస్వామిని బెడ్ రూమ్ లో సుఖపెట్టడం కష్టమే అంటున్నారు నిపుణులు. విపరీతంగా బరువుపెరగడం వల్ల మీరు పడకగదిలో మీ పార్ట్నర్ ను సుఖపెట్టలేరని..

How Your Weight Plays a Role in the Bedroom

అది మీ లైంగిక జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఇంతకీ బరువు పెరగడం వల్ల మీ రొమాంటిక్ జీవితంపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

chaysam divorce:సమంత-చైతూ నిజంగానే విడిపోతున్నారా? విడాకులు తీసుకునేందుకు గల కారణాలేంటి?chaysam divorce:సమంత-చైతూ నిజంగానే విడిపోతున్నారా? విడాకులు తీసుకునేందుకు గల కారణాలేంటి?

పెళ్లి తర్వాత..

పెళ్లి తర్వాత..

సాధారణంగా పెళ్లి చేసుకున్న తర్వాత పడకగదిలో రొమాన్స్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరి శరీరంలో మార్పులు రావడం సహజమే. అయితే పిల్లలు పుట్టిన చాలా మంది శరీరంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇదంతా హార్మోన్లు బ్యాలెన్స్ లేకపోవడం వల్లే జరుగుతుంది. దీంతో కొందరు చాలా వేగంగా వెయిట్ పెరిగిపోతారు. మరికొందరు చాలా నీరసంగా మారిపోతారు. ఇంకా కొందరు తరచుగా ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల వెయిట్ అమాంతం పెరిగిపోతారు.

తీవ్రమైన సమస్యలు..

తీవ్రమైన సమస్యలు..

అయితే ఇలా అనూహ్యంగా బరువు పెరగడం వల్ల బాడీలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీంతో ఆరోగ్య పరంగా.. పడకగదిలో కలయిక పరంగా తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. బెడ్ రూమ్ లో భాగస్వామితో ఆ కార్యాన్ని ఆసాంతం ఆస్వాదించడం కష్టమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రతి క్రీడకు ఆటంకం..

రతి క్రీడకు ఆటంకం..

మీరు ఎక్కువగా బరువు పెరిగితే.. ఆరోగ్య సమస్యలతో పాటు మీ రతి క్రీడకు కూడా అనేక అడ్డంకులు వస్తాయట. అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరి బాడీలోనూ కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల ఇది రతి క్రీడకు సంబంధించిన ఇబ్బందులకు గురి చేస్తుందట. ఎందుకంటే బరువు పెరగడం వల్ల టెస్టో స్టెరాన్ స్థాయి తగ్గిపోతుందట. దీని వల్ల మీరు లైంగిక క్రీడను ఎక్కువగా ఆస్వాదించలేరట.

రతిక్రీడలో పాల్గొన్నప్పుడు నొప్పిగా ఉంటోందా? అయితే ఇలా ప్రయత్నించండి...రతిక్రీడలో పాల్గొన్నప్పుడు నొప్పిగా ఉంటోందా? అయితే ఇలా ప్రయత్నించండి...

కోరికలు తగ్గిపోతాయి..

కోరికలు తగ్గిపోతాయి..

మీ శరీరంలో టెస్టో స్టెరాన్ స్థాయి తక్కువగా విడుదల కావడం వల్ల మీ ఇద్దరిలోనూ ఆ కార్యంపై ఆసక్తి తగ్గిపోవడమే కాదు.. కోరికలు కూడా తగ్గిపోతాయి. ఎక్కువ కొలెస్ట్రాల్, ఇన్సులిన్ నిరోధకత అమ్మాయిల్లో నాళాల నిరోధానికి దారి తీస్తుంది. ఇది యోని భాగానికి రక్త ప్రసరణను తగ్గిస్తుంది. అలాంటి సున్నితమైన ప్రాంతంలో రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల రతి క్రీడలో పాల్గొన్నప్పటికీ.. ఆ కార్యాన్ని పూర్తిగా ఆస్వాదించలేరని నిపుణులు చెబుతున్నారు.

అబ్బాయిల్లో కలిగే సమస్యలు..

అబ్బాయిల్లో కలిగే సమస్యలు..

ఇక బరువు విపరీతంగా పెరిగే అబ్బాయిల్లో అంగ స్తంభన సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య ఎక్కువ కాలం పాటు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మీరు పడకగదిలో ఎంతగా ప్రయత్నించినా.. అంగ స్తంభన సమస్య మాత్రం తగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయట. ఇదంతా మీకు అధిక కొవ్వు కారణంగానే జరుగుతుందట.

ఒకటే యాంగిల్ లో..

ఒకటే యాంగిల్ లో..

మీరు వెయిట్ పెరగడం వల్ల ఆ కార్యాన్ని ఒకటే యాంగిల్ లోనే చేయాల్సి వస్తుందట. అంతేకాదు ఎంజాయ్ మెంట్ కూడా చాలా వరకు తగ్గిపోతుందట. ఇతర యాంగిల్ లో కలయికలో పాల్గొనేందుకు అవకాశాలు ఉండవట. ఒకవేళ మీరు ఎక్కువ వెయిట్ ఉన్నా అలాంటి ప్రయోగాలు చేస్తే.. లేనిపోని ఇబ్బందులు వస్తాయట. దీంతో మీ రొమాంటిక్ లైఫ్ బోరింగ్ గా మారిపోతుందట.

బరువు తగ్గితే బెటర్..

బరువు తగ్గితే బెటర్..

మీరు అధిక బరువు కలిగి ఉండటం వల్ల మీ పార్ట్నర్ కు కూడా పడకగదిలో ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు సాధ్యమైనంత త్వరగా బరువు తగ్గేందుకు ప్రయత్నించడం బెటర్. అంతేకాక ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రతిరోజూ తేలికపాటి వ్యాయమాలు చేయండి. కచ్చితమైన డైట్ పాటిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

English summary

How Your Weight Plays a Role in the Bedroom

Here we are talking about how your weight plays a role in the bedroom. Have a look
Desktop Bottom Promotion