For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘నా మరదలిని మరచిపోలేకపోతున్నా.. తన మీదే ద్యాసంతా.. కానీ నా భార్య...’

తన మరదలిని మరచిపోలేకపోతున్నానంటున్న బావ సమస్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

తనకు పెళ్లై రెండు సంవత్సరాలు పూర్తయ్యింది. పెద్దలు కుదర్చిన పెళ్లి కావడంతో ఇద్దరూ ఒకరినొకరు పూర్తిగా తెలుసుకోకుండానే ఏడడుగులు వేశారు.

I am attracted to my sister-in-law, please help me to come out of it

పెళ్లయ్యాక ఇద్దరి మనసులు కలుస్తాయని భావించారు. కానీ మన జీవితంలో మనం ఒకటి తలిస్తే.. అది తప్ప అన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భమే ఓ కుర్రాడి జీవితంలో కూడా జరిగింది. తన భార్యతో కాకుండా ఆమె చెల్లెలిపై మనసు పడ్డాడు.

I am attracted to my sister-in-law, please help me to come out of it

తను కూడా బావతో బాగా సరదాగా ఉండేది. ఇలా ఓ రోజు బలహీన క్షణంలో ఓ చిన్న తప్పు జరిగిపోయిందట.. ఇంతకీ ఏం జరిగింది.. తన సమస్యకు పరిష్కారం దొరికిందా లేదా అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఇలాంటి మగాళ్లతో జాగ్రత్త సుమా...! లేదంటే మీ జీవితంలో నరకమే...!ఇలాంటి మగాళ్లతో జాగ్రత్త సుమా...! లేదంటే మీ జీవితంలో నరకమే...!

మనసులు కలవలేదు..

మనసులు కలవలేదు..

హాయ్ ‘నా పేరు రాంబాబు. నా వయసు 28 ఏళ్లు. నాకు రెండు సంవత్సరాల క్రితం మా దూరపు బంధువులలో ఒకమ్మాయితో పెళ్లి జరిగింది. నాకు ఈ పెళ్లి అంటే ఇష్టం లేదు. కానీ పెద్దలకు నో చెప్పలేక అయిష్టంగానే పెళ్లి చేసుకున్నాను. పెళ్లి తర్వాత నా భార్యను ప్రేమిద్దామనుకున్నా.. కానీ మా ఇద్దరి మనసులు కలవలేదు.

సంతోషం లేదు..

సంతోషం లేదు..

నాకు పెళ్లి జరిగి రెండు సంవత్సరాలవుతున్నా.. నేను ఏ రోజు సంతోషంగా లేను. నేను తనకు ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నించినా.. తను నాకు ఏ మాత్రం కోఆపరేట్ చేసేది కాదు. అయితే పెళ్లి జరిగినప్పటి నుండి నాకు నా మరదలు బాగా కనెక్ట్ అయ్యింది.

ఇద్దరి ఇష్టాలు ఒక్కటే..

ఇద్దరి ఇష్టాలు ఒక్కటే..

ఎందుకంటే నాకు తనతో పరిచయం అయిన నాటి నుండి బాగా మాట్లాడేది. నా అభిప్రాయాలు, ఆలోచనలు తనకు బాగా నచ్చేది. తన అలవాట్లు, అభిరుచులు కూడా నాకు బాగా నచ్చేవి. ఈ నేపథ్యంలో వాళ్ల అక్కతో ఉన్న దూరం గురించి తనతో షేర్ చేసుకున్నాను.

బెడ్రూమ్ లో బోర్ కొట్టకుండా రెచ్చిపోవాలంటే... ఈ పద్ధతులు ఫాలో అవ్వండి...!బెడ్రూమ్ లో బోర్ కొట్టకుండా రెచ్చిపోవాలంటే... ఈ పద్ధతులు ఫాలో అవ్వండి...!

బాగా దగ్గరయ్యాం..

బాగా దగ్గరయ్యాం..

అలా ప్రతిరోజూ మా వ్యక్తిగత వివరాలు మాట్లాడుకుంటూ మేమిద్దరం మాకు తెలియకుండానే ఒకరికొకరం బాగా దగ్గరయ్యాం. అలా ఓ రోజు ఇంట్లో ఎవ్వరూ లేని క్షణంలో ఓ తప్పు జరిగిపోయింది. తనను నేను కిస్ చేశాను. దీంతో తనపై రోజురోజుకు ఆసక్తి పెరిగిపోతోంది.

ఇప్పుడేం చేయాలి..

ఇప్పుడేం చేయాలి..

ఇప్పుడు వివాహం అనే పంజరంలో ఉండి నేను ఇబ్బంది పడకూడదనుకుంటున్నా.. నా మరదలితో నేను రిలేషన్ కొనసాగించాలని ఆలోచిస్తున్నా.. అయితే ఇప్పుడు నేను నా భార్యతో కలిసి జీవించాలా? వద్దా అనే తేల్చుకోలేకపోతున్నా.. ఏమి చేయాలో నాకిప్పుడు అర్థం కావడం లేదు. ఎందుకంటే నా మరదలిని విడిచి నేను ఉండలేకపోతున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలి' అని ఓ యువకుడు తన బాధను చెప్పుకున్నాడు. తనకు నిపుణులు ఏం సమాధానం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ పెళ్లిలో..

మీ పెళ్లిలో..

కొన్నిసార్లు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలో పరిస్థితులు సెట్ కావడానికి కొంత సమయం పడుతుంది. ఏ బంధమైనా బలంగా మారేందుకు కాస్త ఎక్కువ సమయం పట్టొచ్చు. అయితే మీ విషయంలో మాత్రం పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. మీరు పెళ్లి చేసుకుని రెండేళ్లు పూర్తయినా.. మీరు మీ భాగస్వామితో సంతోషంగా లేరని అర్థమవుతోంది.

ఒకసారి ఆలోచించండి..

ఒకసారి ఆలోచించండి..

మీ భాగస్వామికి దగ్గరలేదనే కారణంతో మీరు మీ మరదలిపై మనసు పడ్డారా? లేక మనస్ఫూర్తిగా తనను ఇష్టపడుతున్నారా? అనే విషయాల గురించి మీరే ఒకసారి బాగా ఆలోచించాలి. ఎందుకంటే ఓ బలహీన క్షణంలో మీరు మీ మరదలికి దగ్గరయ్యానంటున్నారు. తన నుండి మీరు ఇంకా వేరే ఏమైనా ఆశిస్తున్నారా లేదా అనే విషయాలను తెలుసుకోవాలి.

భావోద్వేగ మద్దతు..

భావోద్వేగ మద్దతు..

మీకు మీ భాగస్వామిపై ఎలాంటి ఫీలింగ్ కలగలేదంటున్నారు. దానికి కారణం మీరు పెళ్లికి ముందు ఏవైనా అంచనాలు పెట్టుకున్నారా? పెళ్లి తర్వాత అలా లేకపోవడం వల్ల నిరుత్సాహానికి గురయ్యారా? ఆ సమయంలోనే మీకు మీ మరదలితో భావోద్వేగ మద్దతు లభించిందా అనే దానిపై మీరే ఓ స్ఫష్టత తెచ్చుకోవాలి.

భవిష్యత్తులో సమస్యలు..

భవిష్యత్తులో సమస్యలు..

మీ భార్యపై బంధం సక్రమంగా లేని కారణంగా.. మీ మరదలిపై మనసు పడ్డారు. అయితే ఈ విషయం గురించి ముందుకెళ్లాలని భావిస్తే.. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయనే విషయం గురించి ఆలోచించాలి. మీరు ఈ బంధం గురించి భయపడుతుంటే.. మీ మరదలితో మరోసారి స్పష్టంగా మాట్లాడి పరిమితుల్లో ఉండటం మంచిది. దీని కంటే ముందు మీ భార్యతో ఏర్పడిన దూరాన్ని తగ్గించుకునేందుకు మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ తీసుకొని ముందుకెళ్లండి.

అలా కాకుండా..

అలా కాకుండా..

మీరు మరో విషయాన్ని కూడా లేవనెత్తారు. మీ మరదలిపైనే ద్యాస వెళ్తోందంటున్నారు కాబట్టి.. తనతో కలిసి జీవించాలని అంటున్నారు కాబట్టి.. మీరు ప్రస్తుత వివాహ బంధానికి విడాకులతో ముగింపు పలకొచ్చు. ఆ తర్వాత మీ మరదలితో కలిసి జీవించడంపై నిర్ణయం తీసుకుంటే.. ముందుగా మీరు మానసికంగా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అయితే ఆకర్షణ వల్ల మీరు విడిపోవాలనుకుంటున్నారా? అనే దానిపై క్లారిటీగా ఉండాలి. మీరు మీ మరదలిపై నమ్మకంతో కొత్త జీవితాన్ని ఆరంభిస్తే.. మీరు కుటుంబ పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

English summary

'I am attracted to my sister-in-law, please help me to come out of it'

Read on to know the 'I am attracted to my sister-in-law, please help me to come out of it'
Desktop Bottom Promotion