Latest Updates
-
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి! -
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే.. -
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే.. -
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ -
ముంబై స్ట్రీట్ స్టైల్ చీజ్ పావ్ భాజీ.. ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
‘నాకు కొత్తగా పెళ్లయ్యింది.. కానీ ఇతర స్త్రీలను చూస్తే కంట్రోల్ చేసుకోలేకపోతున్నా...’
‘నాకు కొత్తగా పెళ్లయ్యింది.. కానీ ఇతర స్త్రీలను చూస్తే ఆగలేకపోతున్నా’
పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరిలోనూ కలిగే కోరికలను తీర్చుకోవడానికి తమ భాగస్వామితో రాత్రి, పగలు తేడా లేకుండా ఆ కార్యంలో పాల్గొంటూ ఉంటారు. అయితే పెళ్లికి ముందు ఎంతమందితో రిలేషన్ షిప్ లో ఉన్నా, పెళ్లి తర్వాత అలాంటి వాటికి ప్రతి ఒక్కరూ పుల్ స్టాప్ పెడుతూ ఉంటారు.

లేదంటే పెద్ద గొడవలైపోతాయని వారికి బాగానే తెలుసు. మన దేశంలో అలాంటి వ్యవహారాలు చట్టవిరుద్ధం కూడా. అయితే ఓ కొత్తగా పెళ్లి చేసుకున్న కుర్రాడికి ఓ చెడు అలవాటు ఉంది..

అదేంటంటే అందమైన అమ్మాయిలను చూస్తే ఆగలేకపోవడం. పెళ్లి తర్వాత కూడా అదే కంటిన్యూ చేస్తూ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడట. ఈ సమస్య నుండి తానేలా బయటపడాలో అర్థం కావట్లేదని నిపుణులను సంప్రదించాడట. దీనికి వారేమి సమాధానమిచ్చారు.. అసలు ఎందుకని అలా జరుగుతుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరు నెలల క్రితమే..
‘నా పేరు రాజేష్ (పేరు మార్చాం). నా వయసు 28 సంవత్సరాలు. నాకు ఆరు నెలల క్రితమే బంధువులందరి సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి జరిగింది. పెళ్లికి ముందే నాకు చాలా అఫైర్లు ఉండేవి.

పెళ్లి తర్వాత..
అయితే పెళ్లి తర్వాత వాటన్నింటికీ పుల్ స్టాప్ పెట్టి, మంచి వివాహ జీవితం గడుపుదామనుకున్నాను. కానీ నా భార్యతో పాటు ఇతర స్త్రీలను చూస్తే అస్సలు ఆగలేకపోతున్నాను. నాకు తెలియకుండానే నేను కంట్రోల్ తప్పుతున్నాను.

ఎందుకు జరుగుతుందో..
అసలు ఇలా ఎందుకు జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదు. ఈ సమస్య వారితో వివాహేతర సంబంధాలకు పెట్టుకునేందుకు దారి తీస్తోంది. ఇప్పటికే ఒకట్రెండు సార్లు ప్రయత్నించాను కూడా.

ఎన్నో ప్రయత్నాలు..
అయితే ఇలాంటి పనులు చేయడం తప్పని.. ఈ ప్రాబ్లమ్ నుండి బయటపడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ నా వల్ల కావట్లేదు. ఈ చెడ్డ అలవాటును ఎలా వదిలించుకోవాలి..

హ్యాపీ లైఫ్..
ఇలాంటి వాటిని పక్కనబెట్టి నేను నా మ్యారేజ్ లైఫ్ ని హ్యాపీగా గడపాలనుకుంటున్నాను. నాకెందుకో లైంగిక క్రీడకు బాగా బానిస అయ్యానేమోనని భయమేస్తోంది. ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావట్లేదు. నాకు సరైన పరిష్కారం చూపగలరు' అంటూ యువకుడు తన సమస్యను చెప్పుకున్నాడు.

తప్పులు చేయడం..
ఈ భూమి మీద ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో తప్పులు చేస్తుంటాడు. అలాగే పొరపాటు చేయడం కూడా మానవులకు చాలా సహజమే. అయితే వాటి గురించి తెలుసుకుని దాని నుండి బయటపడటమే మన ముందున్న మార్గం.

మళ్లీ జరగకుండా..
అయితే మనం గతంలో చేసిన తప్పుల నుండి గుణపాఠం నేర్చుకుని.. మంచి మార్పు వైపు అడుగులు వేస్తే ఎవ్వరి జీవితం అయినా సంతోషంగా ఉంటుంది.

మీ పార్ట్ నర్ తో ప్రాబ్లమ్ ఉంటే..
ఇక మీ సమస్య విషయానికొస్తే, మీ పార్ట్ నర్ తో మీకేమైనా సమస్యలున్నాయా? అవి మిమ్మల్ని ఇతర స్త్రీలవైపు ఆకర్షిస్తున్నాయా? ఒకవేళ తనతో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే.. ఇతరులతో శారీరక సంబంధాలు పెట్టుకోవడం వల్ల మీకు ఆరోగ్య సమస్యలతో పాటు కుటుంబంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే త్వరలో మీరు తండ్రి కాబోతున్నారు.

మంచి నిర్ణయమే..
అయితే మీరు అలాంటి అలవాటుకు గుడ్ బై చెప్పాలనుకోవడం నిజంగా మంచి నిర్ణయమే. ఎందుకంటే మీరు మీ బేబీకి ఒక రోల్ మోడల్ గా ఉండాలి. ఒక్కసారి మీ భవిష్యత్తు గురించి మిమ్మల్ని నమ్ముకుని మీతో వచ్చిన భార్య, బిడ్డల గురించి గురించి ఆలోచించండి. మీరు మీ కెరీర్ పై ఫోకస్ పెట్టాలి. ఆ తప్పు చేయాలనే ఫీలింగ్ వచ్చినప్పుడల్లా ఈ విషయాలను గుర్తుంచుకోండి.

ఆ ఉద్దేశంతో అడుగులు వేస్తే..
ఒకవేళ మీ భార్య ప్రెగ్నెన్సీగా ఉందని..మీరు స్వీయ నియంత్రణ కోల్పోవద్దు. మీరు అటువైపు అసలు అడుగులు వేయకండి. మీరు స్వయంగా త్రుప్తి పొందేందుకు ప్రయత్నించండి. అప్పటికీ మీ సమస్యకు పరిష్కారం దొరక్కపోతే.. మీరు మంచి సైకాలజిస్టుని సంప్రదించండి...



Click it and Unblock the Notifications
