Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
ఈ రాశుల వారిని పెళ్లి చేసుకుంటే అన్ని అద్భుతాలే... ఎందుకంటే..!
ఈ రాశుల వారిని పెళ్లి చేసుకుంటే ఆ విషయంలో అస్సలు తగాదాలే ఉండవట.
పెళ్లి(Marriage).. అంటే ఆడవారైనా.. మగవారైనా ఇద్దరి జీవితంలో అది ఒక పెద్ద పండుగలాంటిదని చెప్పొచ్చు. చాలా మంది తమ వివాహం గురించి ఎన్నో కలల్ని కంటూ ఉంటారు.

కొంతమందైతే చిన్నప్పుడే బొమ్మల పెళ్లి చేసే సమయంలో, భవిష్యత్తులో తమకు కాబోయే పెళ్లిలో తమకు కావాల్సిన భాగస్వామి ఎలా ఉండాలో ఊహించుకుంటారు. అయితే ప్రస్తుతం చాలా మంది పెళ్లిళ్లు ఎంత వేగంగా చేసుకుంటున్నారో.. అంతే వేగంగా విడిపోతున్నారు.. దీనికి ప్రధాన కారణం తగాదాలు..

చిన్న చిన్న విషయాలకే గొడవ పడటం. అయితే మీ విషయంలో ఇలా జరగకుండా ఉండాలంటే మీరు జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని వివరాలను తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ బంధం అయినా తగాదాలు అనేవి చాలా కామన్.

మీ జాతకం బట్టి మీరు కొన్ని రాశుల వారితో మీ జీవితాన్ని పంచుకుంటే మీ లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది. అయితే ఆ రాశిచక్రాలేవో.. ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే ఎలాంటి తగాదాలు లేకుండా, మీ జీవితం సంతోషకరంగా సాగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...

కన్య రాశి..
ఈ రాశి వారికి వివాహం విషయంలో తప్పు అనేది దాదాపు జరగకపోవచ్చు. ఎందుకంటే వీరు ప్రతి ఒక్క విషయాన్నీ చాలా లోతుగా, శ్రద్ధగా పరిశీలించి, అధ్యయనం చేసి నిర్ణయాలను తీసుకుంటారు. ఇక ప్రేమకు సంబంధించిన విషయాల్లో అయితే కచ్చితంగా ఆబ్జెక్టివ్ గా ఉంటారు. అయితే, వారు సంబంధంలో ఉండే సమస్యలను చాలా సహనంతో ఎదుర్కొంటారు. వారిలో ఉన్న ఆకర్షణకు ఇది కూడా ఒక కారణం కావచ్చు.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు చాలా సెన్సిబుల్ గా ఉంటారు. వీరికి భావోద్వేగాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు మనసుకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. వీరు సందర్భాన్ని బట్టి ఎలా ప్రవర్తించాలో తెలుసుకుంటారు. ఇక రిలేషన్ షిప్ విషయంలో ఏదైనా సమస్య వస్తే దాని యొక్క మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అక్కడి నుండి ఒక పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు.

మకర రాశి..
ఈ రాశి వారు లైఫ్ లో చాలా విషయాల్లో ఎక్కువగా ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు. అందుకే వీరికి ఎంత కష్టమైన పరిస్థితులు ఎదురైనా, అలాంటి వాటిని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు. వీరి ఆలోచనా ధోరణి చాలా భిన్నంగా ఉంటుంది. వీరు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు. ఇతరులను వీరి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి అవకాశం ఇవ్వరు. ఇక రిలేషన్ షిప్ విషయానికొస్తే, ఎంతో అనుభవం ఉన్న వారిలా డీల్ చేస్తుంటారు. వీరు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడంలో చాలా ప్రావీణ్యం కలవారు.

కుంభ రాశి..
ఈ రాశి వారికి మేధాశక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా విషయాల్లో తెలివిగా వ్యవహరిస్తారు. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు చాలా చమత్కారంగా మాట్లాడతారు. అదే సమయంలో రిలేషన్ షిప్ లో ఉండే ఎమోషన్స్ వంటి విషయంలో వారు ఎంతో నిజాయితీతో, పరిపక్వతతో వ్యవహరిస్తారు. వీరు ఎవ్వరి విషయంలో అనవసరంగా వేలు పెట్టరు. అది భాగస్వామి అయినా సరే. వీరు ఎల్లప్పుడూ ఎక్కువ ఫ్రీడమ్ కోరుకుంటారు.

తుల రాశి..
ఈ రాశి వారు ఎల్లప్పుడూ బ్యాలెన్స్ గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా రిలేషన్ షిప్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటారు. వీరి భాగస్వామితో బంధం ఎంత బలంగా.. సన్నిహితంగా ఉన్నా.. ఎక్కువ అతివిశ్వాసం, అహంకారం వంటివి ప్రదర్శించరు. మరో విశేషమేమిటంటే.. వీరు తమ భాగస్వామిని చాలా బాగా అర్థం చేసుకుంటారు. వీరి బంధాన్ని బలంగా మార్చుకునేందుకు, తమ అభిప్రాయాలను ఎప్పుడు ఎవరితో పంచుకోవాలో.. ఎలా పంచుకోవాలో.. అలాగే ఎలాంటి విషయాలను దాచుకోవాలో అనే విషయాలు వీరికి బాగా తెలుసు.

వృషభ రాశి..
ఈ రాశి వారు ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక రిలేషన్ షిప్ విషయంలో అయితే ప్రాక్టికల్ గా కనిపించినప్పటికీ.. అర్థం చేసుకునే మైండ్ సెట్ వీరికి ఉండదు. అయితే బంధాలు..అనుబంధాల విషయంలో వీరు చాలా సెన్సిబుల్ గా ఉంటారు. కానీ పరిస్థితిని, సందర్భాన్ని బట్టి వీరు ప్రతి ఒక్క విషయాన్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నిస్తారు. అంతేకాదు క్లిష్ట పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో... అందరినీ తమ దారికి ఎలా తెచ్చుకోవాలో వీరికి బాగా తెలుసు. వీరు మైండ్ లో అనుకున్న దాని కంటే ప్రాక్టికల్ గా పరిస్థితులను మరింత బాగా హ్యాండిల్ చేస్తారు.



Click it and Unblock the Notifications
