Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
తమ కంటే చిన్న వారిని పెళ్లి చేసుకున్న ప్రముఖలెవరో తెలుసా...
తమ కంటే వయసు తక్కువ ఉన్న వారిని పెళ్లి చేసుకున్న ఇండియన్ సెలబ్రిటీలెవరో తెలుసుకోవడానికి ఇక్కడ ఓ లుక్కేయండి.
సాధారణంగా వివాహం అంటే.. అమ్మాయి వయసు తక్కువగా.. అబ్బాయి వయసు ఎక్కువగా ఉండేలా చూసుకుంటారు. ఇదే పద్ధతిని ఎన్నో సంవత్సరాల నుండి చాలా మంది ఫాలో అవుతున్నారు.

అయితే ప్రేమ పెళ్లిళ్లలో మాత్రం వయసు గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇందులో ముందు వరుసలో ఉంటున్నారు మన సినీ ప్రముఖులు. వీరంతా వయసును కేవలం ఒక నెంబర్ గానే భావిస్తారట. అది వాస్తవమని చాలా మంది జంటలు నిరూపించారు. అంతేకాదు ఇప్పటికీ తమ వివాహ బంధాన్ని ఎంతో విజయవంతంగా గడుపుతున్నారు.

ఇదిలా ఉండగా.. గత రెండు వారాలుగా బాలీవుడ్ అందాల భామ కత్రినా కైఫ్, బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ పెళ్లి సందడి నెలకొంది. డిసెంబర్ 9వ తేదీన రాజస్థాన్‌లోని పురాతన కోటలో వీరి వివాహం జరిగింది. అయితే కత్రినా కైఫ్‌ని పెళ్లాడిన విక్కీ కౌశల్ ఆమె కంటే 5 ఏళ్లు చిన్నవాడనే విషయం మీకు తెలుసా.. ఈ కపుల్ మాత్రమే కాదు.. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు మరియు సెలబ్రిటీలు వయసుతో సంబంధం లేకుండా తమ కంటే వయసు తక్కువ ఉన్న కుర్రాళ్లను పెళ్లి చేసుకున్నారు. ఆ హీరోయిన్లెవరో మీరే చూసెయ్యండి...

కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్
ఇటీవలే పెళ్లి చేసుకున్న కత్రినా కైఫ్ వయసు 38 సంవత్సరాలు. అయితే వరుడు విక్కీ కౌశల్ వయసు కేవలం 33 సంవత్సరాలే. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఏకంగా 5 సంవత్సరాలు ఉన్నప్పటికీ.. వీరిద్దరూ ఏడడుగులు వేసేందుకు ఆసక్తి చూపారు. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ లోని పురాతనమైన కోటలో డిసెంబర్ 9వ తేదీన ఘనంగా వివాహం చేసుకున్నారు. ఈ కపుల్ కూడా కలకాలం సంతోషంగా జీవించాలని మనమంతా కోరుకుందాం.

ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్
బాలీవుడ్ నటి మరియు ఇంటర్నేషనల్ ఐకాన్ ప్రియాంక చోప్రా 2018లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఏకంగా పది సంవత్సరాలు. ప్రియాంక చోప్రాకు 37 సంవత్సరాలు.. నిక్ జోన్స్ కు 27 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. దీంతో వీరి పెళ్లి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. వీరి పెళ్లిపై అనేక విమర్శలు కూడా వచ్చాయి. పెళ్లయిన తర్వాత అనేక ఇబ్బందులొస్తాయన్నా.. వీరు వాటి గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా హ్యాపీగా మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

మలైకా అరోరా ఖాన్- అర్జున్ కపూర్
ఇక బాలీవుడ్ లో మరో పాపులర్ హీరోయిన్ మలైకా అరోరా ఖాన్ 48 సంవత్సరాల వయసులో దర్శక-నిర్మాత బోనీ కపూర్ కుమారుడు అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోంది. అర్జున్ కపూర్ వయసు కేవలం 36 సంవత్సరాలే. ఈ జంట మధ్య ఏకంగా 12 సంవత్సరాల వయసు తేడా ఉంది. అయినా వీరిద్దరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఊర్మిళ - మొహ్సిన్ అక్తర్
ఒకప్పుడు వెండితెరను ఏలిన ఊర్మిళ హఠాత్తుగా చాలా కాలం పాటు సినీ పరిశ్రమకు దూరమైంది. ఆ తర్వాత ఒకరోజు పెళ్లి వార్త బయటకు రావడంతో అందరూ షాకయ్యారు. ఎందుకంటే ఊర్మిళ తన కంటే పదేళ్లు చిన్న వయసు ఉన్న కాశ్మీరీ వ్యాపారవేత్త మరియు మోడల్ అయిన మొహ్సిన్ అక్తర్ మీర్‌ను వివాహం చేసుకుంది.

సుస్మితా సేన్-రోహ్మన్ షాల్
బాలీవుడ్ లో మరో హీరోయిన్ సుస్మితా సేన్(46) మరియు ఆమె ప్రియుడు రోహ్మన్ షాల్ మధ్య 15 సంవత్సరాల తేడా ఉంది. సుస్మితా సేన్ 31 ఏళ్ల రోహ్‌మన్ ఇన్‌స్టాగ్రామ్‌లో కలిశారు. ఆమె DMలో రోహ్‌మాన్ సందేశాన్ని చూసిన తర్వాతే వారి ప్రేమ కథ ప్రారంభమైందట. సుస్మిత, రోహ్మాన్ కొన్నేళ్ల క్రితం డేటింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత 2018లో ఇన్‌స్టాగ్రామ్‌లో తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు.

సోహా అలీ ఖాన్-కునాల్ కెమ్ము
కునాల్ కెమ్ము మరియు సోహా అలీ ఖాన్ ల ప్రేమకథ సంతోషకరమైన ముగింపుతో ఒక రకమైన అద్భుత కథను గుర్తుకు తెస్తుంది. కునాల్ గెమ్ము సోహా అలీ ఖాన్ కంటే 5 సంవత్సరాలు చిన్నవాడు. 2009లో ‘డుండే రే జావోకే' సినిమాలో కలిసి పనిచేసినప్పుడు వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.

ఫరా ఖాన్ - శిరీష్
బాలీవుడ్ పాపురల్ డైరెక్టర్ ఫరా ఖాన్ 'మై హూ నా' సెట్‌లో శిరీష్ గుండార్‌ను కలిశారు. అక్కడే వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. అంతే వీరిద్దరి మధ్య ఎనిమిది సంవత్సరాలు ఏజ్ గ్యాప్ ఉన్నా ఏ మాత్రం పట్టించుకోకుండా పెళ్లి చేసుకున్నారు. వీరికి అన్య మరియు దివా అనే ఇద్దరు కుమార్తెలు మరియు జార్ అనే కుమారుడు ఉన్నారు.

మహేష్ బాబు-నమ్రత..
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు.. తను సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే నమ్రతాను పెళ్లి చేసుకున్నారు. అయితే మహేష్ బాబు కంటే నమ్రతా రెండు సంవత్సరాలు పెద్దది. వీరిద్దరూ కూడా తమ వివాహ జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు సితార. మరొకరు గౌతమ్. వీరిద్దరిలో గౌతమ్ పెద్దొడు.
కత్రినా కైఫ్ తన కన్నా సుమారు ఐదేళ్లు తక్కువ వయసు ఉన్న కుర్రాడిని ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్ లోని చారిత్రక కోటలో డిసెంబర్ 9వ తేదీన వీరి వివాహం జరిగింది.
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు.. తను సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే నమ్రతాను పెళ్లి చేసుకున్నారు. అయితే మహేష్ బాబు కంటే నమ్రతా రెండు సంవత్సరాలు పెద్దది. వీరిద్దరూ కూడా తమ వివాహ జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నారు.
బాలీవుడ్ నటి మరియు ఇంటర్నేషనల్ ఐకాన్ ప్రియాంక చోప్రా 2018లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఏకంగా పది సంవత్సరాలు. ప్రియాంక చోప్రాకు 37 సంవత్సరాలు.. నిక్ జోన్స్ కు 27 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.



Click it and Unblock the Notifications