For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెద్దలు చేసే పెళ్లిలో మనం గుర్తించని ఆసక్తికరమైన విషయాలేంటో తెలుసా...

|

మన దేశంలో పూర్వ కాలం నుండి కుటుంబంలోని పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటాయి. దీనికి కారణం మన పూర్వీకులు పెళ్లి విషయంలో కొన్ని బలమైన పునాదులు ఏర్పాటు చేసి వెళ్లారు.

దీంతో కొన్ని యుగాలు, తరాల వారు అదే ఆనవాయితీని, సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. ఇది పిత్రుస్వామ్య వ్యవస్థను ప్రోత్సహిస్తుందని కొందరు అభ్యర్థనలు చెబుతున్నప్పటికీ, వివాహ సంప్రదాయాలు అలాగే కొనసాగుతున్నాయి.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. వివాహం సమయంలో మీరు ఇప్పటివరకూ గమనించని కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీ కోసం తీసుకొచ్చాం.. అవేంటో మీరు చూసెయ్యండి...

ఆ నగరంలో అందరూ అందమైన కన్యలే... కానీ కళ్యాణం కావట్లేదట... ఎందుకో తెలుసా...

కొంత వ్యతిరేకత..

కొంత వ్యతిరేకత..

పెద్దలు కుదిర్చిన పెళ్లి గురించి చాలా మందికి కొంత వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే తమ జీవితంలో జరిగే అతి ముఖ్యమైన ఘట్టంగా భావిస్తారు. ఈ విషయంలో కూడా తమ నిర్ణయం కాదని, తల్లిదండ్రుల ఇష్టం ప్రకారం నడుచుకోవాలంటే.. చాలా మందికి ఇష్టముండదు. అయితే పెళ్లి అనేది పెద్దలు కుదిర్చినా.. ప్రేమించి చేసుకున్నా.. భార్యభర్తల మధ్య అర్థం చేసుకొనే తత్వం, వారిద్దరి మధ్య అనురాగం ఉంటే చాలు.. ఆ బంధం పది కాలాల పాటు పచ్చగా ఉంటుంది.

పెద్దలు చేసే పెళ్లిలో..

పెద్దలు చేసే పెళ్లిలో..

పెద్దలు చేసే పెళ్లిళ్లలో వధూవరులిద్దరికీ దాదాపు కుటుంబ కట్టుబాట్లు, సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాలకు దగ్గరగా ఉండేవారినే మీకు భాగస్వామిగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. దీంతో మీ భాగస్వామి చాలా త్వరగా అందరితో కలిసిపోతారు. ఈ విషయాన్ని మీరే నమ్మలేకపోతారు. కనీసం గుర్తించరు కూడా.

వారసత్వం, ఆర్థిక అంశాలు..

వారసత్వం, ఆర్థిక అంశాలు..

పెద్దలు కుదిర్చిన పెళ్లి వల్ల మీకు ఆర్థిక పరంగా సురక్షితమైన భవిష్యత్తు లభిస్తుంది. అయితే ఈ విషయాన్ని మీరు మీకు తెలియకుండానే మరచిపోతారు. మీ తల్లిదండ్రులు మీకు సరైన జోడిని నిర్ణయించినప్పుడు, వారు మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ పరిస్థితులను విడిచిపెట్టరు. కాబట్టి ఒక జంటగా, పూర్వీకుల వారసత్వం మీకు అందేలా చూసుకోండి.

‘త్వరలో నా పెళ్లి... కానీ నా ఎక్స్ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ...'

సంప్రదాయాలను సజీవంగా..

సంప్రదాయాలను సజీవంగా..

పెద్దలు చేసే పెళ్లిళ్లలో ఎక్కువగా సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు, కట్టుబాట్లను పాటిస్తారు. దీని కంటే ముందు కులం, మతం, ప్రాంతం ఇతర విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటారు. దీంతో నూతన వధూవరులకు సంప్రదాయం మరియు సంస్క్రుతిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఇవ్వబడుతుంది. ఇది విలువలు, సూత్రాలు, నమ్మకాలు మరియు సంప్రదాయాలను సజీవంగా ఉంచుతుంది.

మీ టైమ్ సేవ్..

మీ టైమ్ సేవ్..

ఆధునిక ప్రపంచంలో, ప్రతి ఒక్కరూ మరింత విజయవంతం కావడానికి కాలంతో పోటీ పడుతూ ఉంటారు. దీంతో రిలేషన్ షిప్ విషయంలో ఇబ్బందులు పడుతు ఉంటారు. ఈ కారణంగా తమ పనులపై సరిగ్గా శ్రద్ధ వహించలేరు. వీటన్నింటి నుండి తప్పించుకోవడానికి.. చాలా మంది తమ జీవిత భాగస్వామి కోసం వారి పెద్దలను అనుమతిస్తారు. మరో విషయమేమిటంటే.. వీరు పెళ్లికి ముందు తీసుకునే అనూహ్యమైన నిర్ణయాల వల్ల వారికి రక్షణ లభిస్తుంది.

చిన్న విషయాలకే గొడవలు..

చిన్న విషయాలకే గొడవలు..

సాధారణంగా ప్రేమ వివాహం చేసుకున్న వారు హనీమూన్ కాలం తర్వాత లేదా కొంత కాలం ముగిశాక కుటుంబ విషయంలో చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతూ ఉంటారు. అయితే పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలో భాగస్వాములిద్దరికీ విలువలు తెలిసే ఉంటాయి.. ఒకవేళ ఏదైనా గొడవలు వచ్చినా సర్దుకుపోతారు లేదా పెద్దల వద్దకు వెళ్లి పరిష్కరించుకుంటారు. దీని వల్ల విడాకుల వంటి అంశం, విడిపోవడం అనేది తక్కువగా జరుగుతుంది.

మరింత రక్షణ..

మరింత రక్షణ..

మీ జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలలలో వివాహ సమస్య ప్రధానమైంది. అయితే పెద్దలు చేసే పెళ్లిళ్లలో ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం లేదా భరోసా అనేవి వస్తుంటాయి. మీరు స్థిరమైన జీవనశైలిని పొందుతారు. దీని వల్ల మీరు ఇంట్లో స్థిరంగా, మానసికంగా మరియు శారీరకంగా మంచి అనుభూతి చెందుతారు.

English summary

Interesting Facts About Arranged Marriages, You Never Noticed in Telugu

Here are the interesting facts about arranged marriages, you never noticed in telugu. Take a look
Story first published: Tuesday, April 6, 2021, 15:16 [IST]