For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పార్ట్ నర్ ఫోన్ ను చెక్ చేస్తున్నారా? అది కరెక్టేనా?

ఏ సమయంలో పార్ట్ నర్ ఫోన్ ను చెక్ చేయొచ్చు. అసలు అలా చేయడం కరెక్టేనా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

ప్రస్తుత సమాజంలో పెళ్లి చేసుకున్న వారైనా.. ప్రేమించుకునే వారైనా.. సరే ఏదో ఒక సమయంలో పార్ట్ నర్ ఫోన్ చెక్ చేయాలన్న ఆలోచనలు రావడం చాలా చాలా సహజమే.

Is it ever ok to check your partners phone

ముఖ్యంగా వారు ఎవరితో అయినా ఛాటింగ్ చేస్తున్నారా? లేదా ఎవరితో కాల్స్ మాట్లాడి రికార్డింగ్స్ చేసుకుంటున్నారా? లేదా డేటింగ్ యాప్స్ ఉపయోగిస్తున్నారా? అని తెలుసుకోవాలని భావిస్తుంటారు.

Is it ever ok to check your partners phone

అయితే కొంతమంది అమ్మాయిలు లేదా అబ్బాయిలు మాత్రం తమ భాగస్వామి వద్ద ఫోన్ విషయంలో ఎలాంటి రూల్స్ అనేవే పెట్టరు. అయితే కొందరు మాత్రం తమ ఫోన్ విషయంలో చాలా ప్రైవసీని మెయింటెన్ చేస్తుంటారు.

Is it ever ok to check your partners phone

అలాంటి సమయంలో పార్ట్ నర్ కు అప్పుడప్పుడు అనుమానం వచ్చి ఫోన్ ను చెక్ చేస్తుంటారు.. అయితే ఇది కరెక్టేనా? కాదా అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం పదండి...

సాధారణ శృంగారం కంటే BDSM సెక్స్ లో నే ఎక్కువ మజా ఉంటుందా?సాధారణ శృంగారం కంటే BDSM సెక్స్ లో నే ఎక్కువ మజా ఉంటుందా?

ప్రైవసీకి భంగం..

ప్రైవసీకి భంగం..

మీరు మీ పార్ట్ నర్ ఫోన్ చెక్ చేసే ముందు ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకవాలి. అదేంటంటే వారి అనుమతి లేకుండా వారి ఫోన్ చూడటం అనేది వారి ప్రైవసీకి భంగం కలిగించడమే అవుతుంది. ఇలా మీ పార్ట్ నర్ మీ ఫోన్ కూడా చేయాలని భావిస్తే, మీ బంధంలో ఏదో తప్పు జరిగిందని అర్థం.

ఏదో సీక్రెట్ గా.

ఏదో సీక్రెట్ గా.

మీరు మీ పార్ట్ నర్ తో కొనసాగిస్తున్న బంధంలో, మీరు ఏదైనా విషయంలో తప్పుగా అర్థం చేసుకుని లేదీ మీ పార్ట్ నర్ మీ వద్ద ఏదో దాచి పెడుతున్నారని మీకు సందేహం కలిగిప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. అలాంటి సమయంలో పార్ట్ నర్ ఫోన్ తీసుకుని చెక్ చేయాలనుకోవడం సహజమే. అయితే అది అప్పటికి మాత్రం సరైనదే. అయితే దీని వల్ల కొంత కాలం తర్వాత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

తప్పుగా అర్థం చేసుకోవడం..

తప్పుగా అర్థం చేసుకోవడం..

వారు ఏ విషయం గురించి మాట్లాడారో తెలియకుండానే.. మీరు సరిగా వాటిని అర్థం చేసుకోకుండా.. తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.

పెళ్లి తర్వాత ఈ ప్రశ్నలెదురైతే... ఇలా స్మార్ట్ గా సమాధానాలివ్వండి....పెళ్లి తర్వాత ఈ ప్రశ్నలెదురైతే... ఇలా స్మార్ట్ గా సమాధానాలివ్వండి....

స్వేచ్ఛ ఉంటుంది..

స్వేచ్ఛ ఉంటుంది..

అయితే ప్రతి ఒక్కరికి బంధం ఒకే రకంగా ఉండదు. కొన్ని బంధాల్లో ఒకరి వస్తువులు మరొకరు వాడుకునే స్వేచ్ఛ పూర్తిగా ఉంటుంది. చాలా మంది తమ పార్ట్ నర్ తో కలిసి పాస్ వర్డ్స్ వంటివన్నీ పంచుకుంటూ ఉంటారు. మరికొందరు అన్ని విషయాలను పంచుకుంటూ ఉంటారు. కొందరికి మాత్రం తమభాగస్వామి పక్కన లేనప్పుడు కూడా ఫోన్ చూసేంత స్వేచ్ఛ ఉంటుంది.

చెక్ చేయకపోవడమే బెటర్..

చెక్ చేయకపోవడమే బెటర్..

మీ ఆరోగ్యకరమైన బంధంలో ఇద్దరూ ఒకరినొకరు నమ్మాల్సి ఉంటుంది. అలా కాకుండా ఫోన్ పాస్ వర్డ్ లు, ఒకరితో మరొకరు పంచుకోకపోతే.. కాస్త ఆలోచించాలి. ఇలాంటి సమయాల్లో మీ పార్టనర్ అనుమతి లేనిదే ఫోన్ చెక్ చేయకపోవడమే బెటర్.

పరిమితులు పెట్టుకున్నా..

పరిమితులు పెట్టుకున్నా..

మీ పార్ట్ నర్ వారి ప్రైవసీ విషయంలో పరిమితులు పెట్టుకున్నప్పటికీ, తన ఫోన్ చెక్ చేయాలని మీకు అనిపిస్తుంటే, మీకు మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. మీకెందుకు అలా చేయాలనిపిస్తుంది. అది మీ బంధాన్ని మరింత బలపరుస్తుందా? మీరు మీ రిలేషన్ లో అనుమానం కంటే నమ్మకాన్ని పెంచుకునేందుకు నేను ఏం చేస్తాను? చెక్ చేసేముందు తన పర్మిషన్ తీసుకుంటే ఏమవుతుంది లాంటి ప్రశ్నలను మీకు మీరే వేసుకోవడం మంచిది.

ఇలాంటి ప్రేమ బంధాలు ఎందుకు విఫలమవుతాయో తెలుసా?ఇలాంటి ప్రేమ బంధాలు ఎందుకు విఫలమవుతాయో తెలుసా?

వింతగా ప్రవర్తిస్తుంటే..

వింతగా ప్రవర్తిస్తుంటే..

మీ పార్ట్ నర్ మీ నుండి ఏదో దాస్తున్నారని మీకు అనిపిస్తే, మీతో వింతగా ప్రవర్తిస్తే.. మీరిద్దరూ కలిసి ఆనందంగా మాట్లాడుకునే సమయంలో ఆ విషయాలను లేవనెత్తడం మంచిది. అలాగే మీరు ఏమనుకుంటున్నారో వారికి నిజాయితీగా చెప్పడం మంచిది. ఎందుకంటే సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది.

పార్ట్ నర్ ఆన్సర్..

పార్ట్ నర్ ఆన్సర్..

భార్యభర్తలు లేదా లవర్స్ ఎప్పటికప్పుడు ఇలా చర్చించుకోవడం వల్ల ఏవేవో అనుమానాలు, సందేహాలతో సతమతం అవ్వడం అనేది జరగదు. అలాగే మీ భాగస్వామి మీకు తగిన సమాధానం చెప్పేందుకు ఇలాంటివి ఉపయోగపడతాయి.

మెచ్యూరిటీతో ఉండాలి..

మెచ్యూరిటీతో ఉండాలి..

కపుల్స్ లేదా లవర్స్ మధ్య బంధం అనేది వివిధ రకాలుగా ఉంటుంది. కొందరు తమ భాగస్వామి గురించి, తమ వ్యక్తిగత విషయాల గురించి తెలిస్తే, తాము ఫ్రీగా ఉండేందుకు వీలవుతుందని భావిస్తారు. అయితే ఇలా చేయాలంటే, ఇద్దరూ మెచ్యూరిటీతో ఉండాలి.

దానికి చోటివ్వకండి..

దానికి చోటివ్వకండి..

మీ పార్ట్ నర్ చేసే ఏ పనులను చూసి అయినా మీకు భరించే శక్తి ఉంటేనే, మీరు స్వేచ్ఛ కోరుకోవాలి. మీ బంధంలో ఏదైనా అనుమానం ఉంటే, తన ఫోన్ చెక్ చేయాలనే ఆశ పుడుతుంది. కాబట్టి దానికి చోటివ్వకండి. కొన్ని పరిస్థితుల కారణంగా మీ పార్ట్ నర్ మీతో సరిగ్గా ఉండకపోయినా తనతో చర్చించి దాన్ని అర్థం చేసుకోండి. అంతేకాదు మీ ఇద్దరు మీకిష్టమైన వాటిలో కొన్ని పరిమితులను పెట్టుకోవడం మంచిది.

English summary

Is it ever ok to check your partners phone

Here we talking about is it ever ok to check your partners phone. Read on.
Story first published:Saturday, June 27, 2020, 17:10 [IST]
Desktop Bottom Promotion