కరోనా లాక్ డౌన్ సమయంలో కలయికలో పాల్గొనవచ్చా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూడండి...

ఇంట్లో వారితో.. అది కూడా కట్టుకున్న వారితో కూడా సామాజిక దూరం పాటించాలంటే చాలా కష్టం. ఒకరోజు కాకపోయినా ఏదో ఒకరోజు అయినా పడకగదిని వారితో పంచుకోవాల్సిన సమయం వస్తుంది.

కోవిద్-19 దెబ్బకు మన దేశంలో చాలా మంది ఇళ్లకే పరిమితమవ్వాల్సి వచ్చింది. లాక్ డౌన్ విధించి దాదాపు 10 రోజులు అవుతున్నప్పటికీ కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

Is it safe to romance during the coronavirus what we need to know

దీంతో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచిస్తోంది. ఎందుకంటే ఈ వైరస్ అంటువ్యాధిలా ఒకరి నుండి మరొకరికి చాలా వేగంగా వ్యాపిస్తోంది. అయితే ఇంట్లో వారితో.. అది కూడా కట్టుకున్న వారితో కూడా సామాజిక దూరం పాటించాలంటే చాలా కష్టం.

Is it safe to romance during the coronavirus what we need to know

ఒకరోజు కాకపోయినా ఏదో ఒకరోజు అయినా పడకగదిని వారితో పంచుకోవాల్సిన సమయం వస్తుంది. అందుకే చాలా మంది జంటల్లో అనేక అనుమానాలు వస్తున్నాయి. వారి అనుమానాలకు, ప్రశ్నలకు ఎక్కడైనా సరైన సమాధానం దొరకడం లేదు. అయితే అందులో ముఖ్యమైన ప్రశ్న ఈ సమయంలో కలయికలో పాల్గొనడం, కరోనా వైరస్ సమయంలో రొమాన్స్ చేయవచ్చా? ఈ సమయంలో సంభోగంలో పాల్గొంటే కరోనా వైరస్ వ్యాపిస్తుందా? అయితే ఇది సోకకుండా ఎలా పాల్గొనాలి అనే ప్రశ్నలు చాలా మంది మనసులో మెదలుతున్న ప్రశ్నలు. ఇవే అనుమానాలు మీకు కూడా నిపుణులు ఏమంటున్నారో మీరే చూడండి...

కిస్ చేస్తే కరోనా వస్తుందా?

కిస్ చేస్తే కరోనా వస్తుందా?

కరోనా వైరస్ గురించి జాగ్రత్తలు, నివారణలు ఇప్పటికే అందరికీ బాగా తెలుసు. లాక్ డౌన్ సమయంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు, డాక్టర్లు సూచిస్తున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే ఈ వైరస్ ఎవరికి సోకిందో తెలీదు కాబట్టి. అయితే కరోనా నేపథ్యంలో తమ భాగస్వామిని కిస్ పెట్టుకోవచ్చా అంటే ప్రముఖ సెక్సాలజిస్టులు ఏమంటున్నారంటే.. కరోనా వైరస్ కలయికల వల్ల సంక్రమించినట్లు ప్రస్తుతానికి ఎక్కడా ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. అయితే ఇది నోటి ద్వారా వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు మీ భాగస్వామిని కిస్ చేయడం అంత సురక్షితం కాదని చెబుతున్నారు.

లాలాజలం ద్వారా...

లాలాజలం ద్వారా...

కరోనా వైరస్ శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి, మీ భాగస్వామి దగ్గినపుడు, తుమ్మినపుడు వెలువడే తుంపర్ల ద్వారా ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతే కాదు ఓరల్ సెక్స్ ద్వారా కూడా ఈ వైరస్ ప్రభావితం అవుతుందని చెబుతున్నారు. ఈ వైరస్ మీ నోరు లాలాజలంలో ఉంటుంది కాబట్టి, ఓరల్ సెక్స్ కూడా సురక్షితం కాదని హెచ్చరిస్తున్నారు. ఎవరైనా కలయికలో పాల్గొంటే కిస్ వంటి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

శానిటిజైన్ వాడకం తర్వాతే..

శానిటిజైన్ వాడకం తర్వాతే..

మీరు మీ భాగస్వామితో కలయికలో పాల్గొనాలనుకుంటే.. మీరు ఆ ఘట్టంలో పాల్గొనే ముందు మీరు కచ్చితంగా శానిటైజర్ లేదా సబ్బుతో మీ శరీరాన్ని శుభ్రం చేసుకోండి. ముఖ్యంగా మీరు పాల్గొనే ప్రదేశాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోండి. అయితే శానిటైజర్ తో పాటు ఐసోప్రొపైల్ ఆల్కహాల్ విషయం చాలా జాగ్రత్తలు పాటించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారమే మీరు వీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. మీ జననేంద్రియాలను శుభ్రం చేసుకునేందుకు తేలికగా ఉండే, వాసనలేని సబ్బులను వాడండి.

కలయికలో పాల్గొనవచ్చా?

కలయికలో పాల్గొనవచ్చా?

కోవిద్-19 అనే వైరస్ కలయిక ద్వారా వ్యాపించినట్లు ఇప్పటివరకూ ఎక్కడా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ వ్యక్తిని తాకడం ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి మీరు మీ భాగస్వామితో మాట్లాడటం లేదా తాకకుండా కలయికలో పాల్గొనడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే మీ ఇద్దరిలో ఎవరో ఒకరికి వైరస్ ఉంటే, ఇది చాలా సులభంగా మీకు వ్యాపిస్తుంది. మీరు, మీ భాగస్వామికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్న లేక ఈ వైరస్ బారిన పడినా మీరు కలయిక వంటి వాటికి దూరంగా ఉండటం మంచిదని మరికొందరు నిపుణులు చెబుతున్నారు.

మొదట్లో కష్టంగానే..

మొదట్లో కష్టంగానే..

ముఖ్యంగా కరోనా వైరస్ కు సంబంధించి సామాజిక దూరం అంటే, సుమారు ఆరు అడుగుల దూరం పాటించడం మంచిది. మొదట్లో మీ భాగస్వామితో సామాజిక దూరాన్ని పాటించడం మీకు కష్టంగా అనిపించొచ్చు. అయితే ఈ వైరస్ ఎప్పుడు ఎవరి నుండి వ్యాపిస్తుందో తెలియదు కాబట్టి సామాజిక దూరాన్ని పాటించడాన్ని ఎంత త్వరగా ప్రారంభిస్తే, ఆ వైరస్ బారిన పడే ప్రమాదాన్ని అంత తగ్గించవచ్చు.

భౌతిక దూరం పాటించాలి..

భౌతిక దూరం పాటించాలి..

కరోనా వైరస్ సంక్రమించకుండా భాగస్వాములిద్దరూ భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా సాధ్యమైనంత మేరకు ఇంట్లోనే ఉండాలని చెబుతున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాలు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో మీరు ఎట్టి పరిస్థితిలో బయటకు వెళ్లాలనే ఆలోచన చేయడం కాదని కూడా చెబుతున్నారు. మీ ఇద్దరికీ ఇన్ఫెక్షన్ లేనందున, మీరు బయటికి వెళితే, ఆ వైరస్ వచ్చే ప్రమాదం ఉంది. ఎవరితో అయినా మాట్లాడాలనుకుంటే, కనీసం ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.

కలయికలో పాల్గొనాలంటే...

కలయికలో పాల్గొనాలంటే...

అయితే మీ ఇద్దరికీ కరోనా వైరస్ లక్షణాలు లేకుండా మీరిద్దరూ ఇంటి లోపలే ఉంటే, మీరు నిరంభ్యతరంగా కలయికలో పాల్గొనవచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు.

ఈ పనులు బెటర్...

ఈ పనులు బెటర్...

ముఖ్యంగా కిరాణ వస్తువులు, కూరగాయాల కోసం ఇతర అత్యవసర పరిస్థితులలో బయటక వెళ్లాల్సి వస్తే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ వేసుకోవడం.. చేతులకు శానిటైజర్ వాడటం వంటివి మరవకండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వీడియో కాల్స్, రొమాంటిక్ పుస్తకాలు చదవడం, హస్త ప్రయోగం వంటి చర్యలు చేయడానికి ఇది మంచి సమయం అని చెబుతున్నారు నిపుణులు. అయితే మీరు క్రమం తప్పకుండా మీ చేతులను శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోండి.

Desktop Bottom Promotion