Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
Jaspit Bumrah marriage: బుమ్రా పెళ్లాడిన సంజనా ఎవరు? ఏ టీవీలో ప్రెజెంటరో తెలుసా...
బుమ్రా పెళ్లాడిన సంజనా గణేశన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండియన్ క్రికెట్ టీమ్ ఫేస్ బౌలర్ జస్ పీత్ బుమ్రా మార్చి 15వ తేదీన ఓ ఇంటివాడయ్యాడు. స్పోర్ట్స్ టీవీ ప్రెజెంటర్ సంజనా గణేశన్ తో సిక్కు సంప్రదాయంలో పెళ్లాడాడు. తమ పెళ్లి విషయాలను ఇప్పటివరకు ఎవరితోనూ షేర్ చేసుకోకుండా.. సడన్ గా సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలను షేర్ చేసి అందరికీ షాకిచ్చారు.

'ప్రేమ విలువైనదని గుర్తిస్తే.. అదే మీకు మార్గనిర్దేశం చేస్తుంది' అనే సందేశం కూడా ఇచ్చి అభిమానులను ఆశ్చర్యపరిచారు. 'ప్రేమికులుగా ఉన్న మేము కొత్త జర్నీ స్టార్ట్ చేశాం. మా లైఫ్ లో బ్యూటిఫుల్ డేస్ లో ఇదొకటి. మా వివాహ సమాచారాన్ని, మా సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవడాన్ని ఆనందంగా భావిస్తున్నాం' అని బుమ్రా, సంజన తమ సోషల్ మీడియాలో పేజీల్లో వివరించారు. అయితే జస్పీత్ బుమ్రా ఎలాంటి హంగు, హడావుడి, ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా మ్యారేజ్ చేసుకున్నారు.

ఇంగ్లాంగ్ తో నాలుగో టెస్టు నుండి సడన్ గా మాయమైన బుమ్రా గురించి బిసిసిఐ వ్యక్తిగత కారణాల వల్లే అని వివరించింది. ఎక్కడా పెళ్లి ఊసే ఎత్తలేదు. అయితే, గత రెండురోజులుగా బుమ్రా వివాహ సమాచారం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇదిలా ఉండగానే.. సంజనాను పెళ్లాడినట్లు బుమ్రా సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు షేర్ చేయడంతో అందుకు తెరపడింది.
వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. బుమ్రా పెళ్లాడిన సంజనా గణేశన్ ఎవరు? అందరూ టీవీ ప్రెజెంటర్ అని చెబుతున్నారు కానీ.. తను ఏ ఛానెల్ లో పని చేస్తుంది? అనే సమాచారం కోసం నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇక్కడున్నాయి.. అవేంటో మీరే చూసేయ్యండి...

సంజనా స్వస్థలం..
సంజనా గణేశన్ మహారాష్ట్రలోని పూణేలో 1991 మే 6వ తేదీన జన్మించారు. పుణేలోనే ఇంజనీరింగ్ వరకూ చదువుకున్నారు. ఆ తర్వాత టీవీ జర్నలిస్ట్ గా మారారు. అనంతరం 2014లో ఎంటీవిలోని ఓ ప్రముఖ షో ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. సన్నీ లియోనీ, నిఖిల్ చిన్నప్ప హోస్ట్ చేసిన ఈ షో మధ్యోలనే గాయం కారణంగా సంజన తప్పుకున్నారు.

స్టార్ స్పోర్ట్స్..
ప్రస్తుతం సంజనా గణేశన్ స్టార్ స్పోర్ట్స్ టీవీ ప్రెజెంటర్ గా పని చేస్తున్నారు. తన ఇన్ స్టా బయోగ్రఫీలో ‘టీవి ప్రెజెంటర్ ఫర్ స్టార్ స్పోర్ట్స్ ఇండియా, డిజిటల్ హోస్ట్, దట్ మిస్ ఇండియా గర్ల్' అనే వివరాలను పొందుపరిచారు.

మోడలింగ్ గా కెరీర్..
మోడలింగ్ లో తన కెరీర్ ను మొదలుపెట్టిన సంజన.. ‘ఫెమినా అఫిషియల్లీ గార్జియస్' టైటిల్ ను కూడా సొంతం చేసుకున్నారు. ఫెమినా మిస్ ఇండియా 2013 పూణే పోటీల్లోనూ పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఫైనల్ వరకూ వెళ్లారు. తను క్రికెట్ మాత్రమే కాకుండా బ్యాడ్మింటన్, ఫుట్ బాల్ వంటి ఇతర స్పోర్ట్స్ ఈవెంట్స్ ను కూడా సంజన హోస్ట్ చేశారు.

వరల్డ్ కప్ లో..
సంజనా గణేశన్ 2019లో పలు స్పోర్ట్స్ షోలకు హోస్ట్ గా వ్యవహరించారు. అదే ఏడాది వరల్డ్ కప్ లో ‘మ్యాచ్ పాయింట్', ‘చీకీ సింగిల్స్'ప్రోగ్రామ్ కు కూడా హోస్ట్ గా పని చేశారు.

ఐపీఎల్ లో కూడా..
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ టీమ్ కోల్ కత్తా నైట్ రైడర్స్ తోనూ సంజన అగ్రిమెంట్ చేసుకున్నారు. వారి తరపున కమర్షియల్ షో ‘ద నైట్ క్లబ్'కు యాంకర్ గా వ్యవహరించారు.

బుమ్రాతో పరిచయం..
ఐపీఎల్ యాంకర్ గా ఉంటున్న సమయంలోనే ఇండియన్ క్రికెట్ టీమ్ ఫేస్ బౌలర్ బుమ్రాతో పరిచయం ఏర్పడింది. అది అనతి కాలంలో ప్రేమగా మారిపోయింది. వీరి ప్రేమను కూడా ఇరు కుటుంబాలు ఒకే అనడంతో సింపుల్ గా మ్యారేజ్ కు సిద్ధమయ్యారు.

గోవాలో వివాహం..
అయితే అప్పటివరకు బుమ్రా అనుపమ పరమేశ్వరన్ ను పెళ్లి చేసుకుంటాడని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. కానీ వాటన్నింటినీ ఫుల్ స్టాప్ పెడుతూ బుమ్రా గోవాలో సంజనా గణేశన్ ను అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లన్నీ అవాస్తవమని బుమ్రా, తన తల్లి క్లారిటీ ఇచ్చేశారు.
All Images Credited to Twitter



Click it and Unblock the Notifications