For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మీరు ఎలాంటి వివాహం చేసుకుంటారో మీకు తెలుసా?

మీ రాశి చక్రం ప్రకారం మీరు ప్రేమ పెళ్లి చేసుకుంటారా లేదా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారా అనే విషయాలను తెలుసుకుందాం.

|

పెళ్లికి.. జాతకాలకు చాలా అవినాభవ సంబంధం ఉంది. అది ప్రేమ వివాహమైనా.. పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా.. జాతకాలు చూడటం అనేది ఎప్పటినుండో ఆనవాయితీగా వస్తోంది.

Kind of marriage you will have per your zodiac sign

ఎందుకంటే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, జాతకాలను బట్టి వధూవరుల గుణగణాలు ఆధారపడి ఉంటాయని, జన్మరాశులు, నక్షత్రాలు కుదిరితేనే వారి వివాహం సక్రమంగా జరిగి, భవిష్యత్తులో వారు ఆనందంగా కలిసి కాపురం చేసుకుంటారని పెద్దల నమ్మకం.

Kind of marriage you will have per your zodiac sign

అయితే జాతకాలు కుదరకపోతే మాత్రం పెళ్లిళ్లను కూడా రద్దు చేసేసుకుంటారు. ఇక ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా చాలా మంది పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటూ వచ్చారు.

Kind of marriage you will have per your zodiac sign

మరోవైపు ఆషాఢ మాసం కూడా. ఈ సమయంలో వర్షాలు ఎక్కువగా కురవడంతో పాటు.. పూర్వకాలం నుండి ఈ మాసంలో శుభకార్యాలేవీ చేసేవారు కాదు. అయితే మరికొద్ది రోజుల్లో ఆషాఢ మాసం ముగియబోతోంది. శ్రావణ మాసం రాబోతోంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఇప్పటినుండే పెళ్లిళ్ల గురించి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మీ జన్మరాశిని బట్టి మీరు ఎలాంటి వివాహం చేసుకుంటారో మనం ముందే తెలుసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

మన దేశంలో ఫస్ట్ నైట్ రోజు తెల్లని దుస్తులే ఎందుకు ధరిస్తారో తెలుసా?మన దేశంలో ఫస్ట్ నైట్ రోజు తెల్లని దుస్తులే ఎందుకు ధరిస్తారో తెలుసా?

మేషరాశి..

మేషరాశి..

ఈ రాశి వారు ఎంతో విలాసవంతమైన వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరు వివాహం కోసం అంతగా మెరిసిపోయే రంగులను కాకుండా, లైట్ కలర్ క్లాత్స్ ను ఎంచుకుంటారు.

వృషభరాశి..

వృషభరాశి..

ఈ రాశి వారు ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరు వివాహ వేడుకలను చాలా ఘనంగా చేసుకోవాలని ఆశిస్తారు. వీరు ప్రతి ఒక్కదానిలో అత్యుత్తమంగా ఉండాలని కోరుకుంటారు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. మీరు మీ పెళ్లిని పెద్ద పెద్ద హోటళ్లలో జరుపుకోవాలని ఆశిస్తారు. అరుదైన పురాతన కట్టడాలలో.. ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రదేశంలో మీ వివాహం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. పెళ్లికూతురు వివాహ సమయంలో వేసుకునే కాస్ట్యూమ్స్ ప్రముఖ డిజైనర్లతో రూపొందించబడినవి అయ్యుంటాయి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారికి వివాహం చాలా సరదాగా మరియు మంచి వాతావరణంలో జరుగుతుంది. ఎందుకంటే ఈ రాశి వ్యక్తులు చాలా ఉన్నతంగా ఉండటానికి ఇష్టపడతారు. భాజభజంత్రీలు, డప్పు వాయిద్యాలు, భోజనాలు, బంధు మిత్రులతో కలిసి వీరు ఆరోజునంతా చాలా ఉత్సాహంగా గడుపుతారు. ఇది మీ జీవితంలోని ఒక చిరస్మరణీయ రోజుగా మిగిలిపోతుంది.

ఫస్ట్ నైట్ తర్వాత కొత్త పెళ్లికూతురు మదిలో మెదిలే ప్రశ్నలేంటో తెలుసా?ఫస్ట్ నైట్ తర్వాత కొత్త పెళ్లికూతురు మదిలో మెదిలే ప్రశ్నలేంటో తెలుసా?

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారు ఫ్యామిలీ మెంబర్స్ మరియు క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య మాత్రమే పెళ్లి చేసుకుంటారు. వీరు సరదాలకు మరియు విలాసవంతమైన వాటిని అస్సలు ఇష్టపడరు. మరో విశేషమేమిటంటే వీరు ఏదైతే ఎక్కువగా ఇష్టపడతారో అక్కడే వివాహం చేసుకోవాలని కోరుకుంటారు.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారు అన్ని రాశులకు రాజు. కాబట్టి వీరు రాజు మాదిరిగా.. అత్యంత ఘనంగా వీరి వివాహం జరుపుకోవడానికి ఇష్టపడతారు.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారి వివాహం చాలా విచిత్రంగా జరుగుతుంది. అది ప్రేమ వివాహమైనా.. పెద్దలు కుదిర్చిన వివాహమైనా సరే.. వీరు చేసుకునే పెళ్లి గురించి పది మంది పది రకాలు చర్చించుకుంటారు.

సర్వే! మగవారికి అంగం చిన్నగా ఉంటే కలయికలో కష్టమేనా? ఏది నిజమో తెలుసుకోండి...సర్వే! మగవారికి అంగం చిన్నగా ఉంటే కలయికలో కష్టమేనా? ఏది నిజమో తెలుసుకోండి...

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారు వివాహం చేసుకోవడానికి కొన్ని సాహసాలు చేస్తారు. వీరి వివాహంలో ఊహాజనితమైన అలంకరణ, విదేశాల నుండి తెప్పించిన పూలు మరియు కొవ్వొత్తుల వెలుగులో అత్యంత ఖరీదైన వివాహం జరిగే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారు వారి వివాహాన్ని అత్యంత ఘనంగా జరుపుకుంటారు. వివాహానికి వచ్చిన అతిథులను మెప్పించడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. ఈ రాశి వరుడు లేదా వధువు అతిథులను చూపుతిప్పుకోనికుండా చేస్తారు. ఎందుకంటే వీరు చాలా అందంగా ముస్తాబై ఉంటారు.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారు వివాహం కోసం ఎంతో సాహసం చేస్తారు. అందుకే వీరి వివాహాన్ని అందరికీ దూరంగా ఉండే ప్రదేశాల్లో చేసుకుంటారు. ఆరోజు మొత్తం చాలా సరదాగా గడిపేస్తారు. అంతేకాదు వివాహానికి వచ్చిన వారందరినీ ఎంతో ఆనందపరుస్తారు.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారు ఆచారాలకు, కట్టుబాట్లకు ఎక్కువ విలువ ఇస్తారు. వీరి వివాహ రోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు. వీరి వివాహాన్ని అందరూ మెచ్చే.. అందరికీ నచ్చే వారసత్వ ప్రదేశాల్లో వివాహం చేసుకుంటారు. ఈ రాశి వారు వివాహ సమయంలో వారసత్వ దుస్తులను ధరించడానికి ఇష్టపడతారు.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారు పెళ్లి విషయంలో చాలా ఉత్సాహంగా ఉంటారు. కానీ సంప్రదాయాలకు మాత్రం చాలా దూరంగా ఉంటారు. వీరు హైందవ ఆచారాలకు దూరంగా వెళ్లి మరీ వివాహం జరుపుకుంటారు. ఉదాహరణకు ఎక్కువగా ఆడంబరాలు లేకుండా సాదాసీదా దుస్తులు ధరించి పెళ్లి చేసుకుంటారు.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారు పెళ్లి గురించి ఏవేవో ఊహించుకుంటూ ఉంటారు. అచ్చం సినిమాల్లో జరిగే వివాహంలాగా తమ పెళ్లి కూడా జరగాలని ఆశిస్తారు. అయితే వీరి ఊహాలన్నీ నిజమయ్యే అవకాశం ఉంది. మరోవైపు వీరి వివాహం సాహసోపేతమైన కథలకు అత్యంత దగ్గరగా ఉన్నట్టు అనుభూతి కలిగించే విధంగా ఉంటుంది.

English summary

Kind of Marriage You Will Have per Your Zodiac Sign

Here we talking about kind of marriage you will have per your zodiac sign. Read on.
Desktop Bottom Promotion