For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పార్ట్ నర్ తో పొట్లాటే కాదు.. రాజీ పడటమూ ముఖ్యమే...!

రిలేషన్ షిప్ లో ఎప్పుడు తగ్గాలి.. ఎప్పుడు నెగ్గాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కరి జీవితంలో పరిచయమయ్యే వారితో మనకు ఒక బంధం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అది ప్రేమ, స్నేహం, వివాహం ఇలా రకరకాల సంబంధాలు ఉంటాయి.

Know When To Compromise In A Relationship & When Not To!

అయితే అన్నింటికంటే వివాహ బంధానికి మన దేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఆలుమగల జీవితం ఆనందంగా సాగాలంటే.. కొన్ని సందర్భాల్లో రాజీ పడాల్సి ఉంటుంది..

Know When To Compromise In A Relationship & When Not To!

కానీ కొన్ని విషయాల్లో మాత్రం అస్సలు తగ్గకూడదట. అలా జీవించినప్పుడే వారి బంధం మరింతగా పెరుగుతుంది.

Know When To Compromise In A Relationship & When Not To!

ఈ నేపథ్యంలో రిలేషన్ షిప్ లో ఉండే వారు ఏ విషయాల్లో తగ్గాలి.. ఏ విషయాల్లో తగ్గేదే లే అనాలి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

స్త్రీలకు పడకగదిలో సుఖం లేకపోవడానికి కారణాలేంటి... వాటిని అధిగమించేందుకు గల మార్గాలేంటో చూసెయ్యండి..స్త్రీలకు పడకగదిలో సుఖం లేకపోవడానికి కారణాలేంటి... వాటిని అధిగమించేందుకు గల మార్గాలేంటో చూసెయ్యండి..

అదొక్కటే సరిపోదు..

అదొక్కటే సరిపోదు..

భార్యభర్తల మధ్య కొత్తలో రిలేషన్ షిప్ అంత సాన్నిహిత్యంగా ఉండదు. అయితే కాలం మారుతున్న కొద్దీ.. ఆలుమగలిద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. అంతేకాదు ఇద్దరి మధ్య ప్రేమ కూడా ఉప్పొంగుంతుంది. ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా బంధం బలపడుతుంది. అయితే కేవలం ప్రేమ ఒక్కటే ఉంటే.. మీ బంధం బలంగా మారుతుందనుకుంటే మీరు పొరబడినట్టే.. మీ దీర్ఘకాలిక జీవితానికి సంబంధించిన కొన్ని విషయాల్లో మీ ఇద్దరి మధ్య ఒకే అభిప్రాయం ఉండాలనే నియమం ఏమీ లేదు.

తప్పేమీ లేదు..

తప్పేమీ లేదు..

భార్యభర్తల సంబంధంలో ఉన్నప్పుడు ఏదో ఒక సందర్భంలో గొడవలు లేదా వాదనలు జరుగుతూ ఉంటాయి. అయితే ఎప్పుడూ మీ వాదనే సరైందని మీరు వాదించకూడదు. ఒక్కోసారి మీ భార్య చెప్పిన విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అంతేకాదు ఒకసారి తన సలహాను పాటిస్తే తప్పేమీ లేదు. మీరు వారి భావాలకు, ఆలోచనలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు ఒక మెట్టు తగ్గొచ్చు.

‘నేను బాస్ తో క్లోజ్ గా ఉన్నానని... కొలీగ్స్ నా గురించి..'‘నేను బాస్ తో క్లోజ్ గా ఉన్నానని... కొలీగ్స్ నా గురించి..'

సమానంగా పని చేయాలి..

సమానంగా పని చేయాలి..

ఈ లోకంలో ఎవరైనా ఒంటరిగా రిలేషన్ షిప్ లో ఉండలేరు. కాబట్టి మీరు మీ భాగస్వామితో బంధాన్ని సజీవంగా ఉంచాలంటే మీరిద్దరూ సమానమనే భావన ఉండాలి. అంతేకాదు ఇద్దరూ సమానంగా పని చేయాలి. మీరు ఒకరి నిర్ణయానికి మరొకరు గౌరవం ఇవ్వాలి. అలాంటి సమయంలోనే మీ రిలేషన్ షిప్ హాయిగా కొనసాగుతుంది. అంతేకానీ మీరిద్దరూ ఎల్లప్పుడూ గొడవ పడితే.. అది చిలికి చిలికి గాలి వానలా మారి పెద్దదయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మీకు అలాంటి అనుమానం ఏదైనా వస్తే.. మీరు రాజీపడటం ఉత్తమం.

ప్రతి విషయంలోనూ..

ప్రతి విషయంలోనూ..

అయితే దాంపత్య జీవితంలో కొన్ని తగ్గకూడని విషయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది తమ భాగస్వామి మనసును బాధపెట్టలేక.. ప్రతి విషయానికి రాజీపడిపోతూ ఉంటారు. అయితే మీ వైపు న్యాయం ఉంటే.. అలాంటి సందర్భంలో మీ మాట నెగ్గకపోతే.. అప్పుడు మీరు తగ్గితే.. మీ విలువ తగ్గిపోతుంది. కాబట్టి మీరు ఎక్కడ నెగ్గాలో.. ఎక్కడ తగ్గాలో తెలుసుకోవడం బెటర్.

కాంప్రమైజ్ తోనూ కష్టాలు..

కాంప్రమైజ్ తోనూ కష్టాలు..

అయితే రిలేషన్ షిప్ లో ఎక్కువగా కాంప్రమైజ్ కు చాన్సులుంటే.. మీ ముందు ఉన్న సమస్యను పరిష్కరించకపోతే, మీరు మరింత బాధపడతారనే విషయాన్ని గుర్తించాలి. మీరు ఎంతగా ప్రయత్నించినప్పటికీ మీ సమస్యకు పరిష్కారం దొరకకపోతే.. మీరు విడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

English summary

Know When To Compromise In A Relationship & When Not To!

Here we are talking about the know when to compromise in a relationship & when not to! Take a look
Story first published:Wednesday, May 19, 2021, 9:40 [IST]
Desktop Bottom Promotion