Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
మీ బంధం కలకాలం ఉండాలంటే ఈ నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాల్సిందే
సంబంధం ద్వారా చాలా ప్రయోజనాలు ఉంటాయి. కష్ట సమయంలో వారు అండగా ఉంటారు. ప్రేమ, అనుబంధం, సాన్నిహిత్యం ఉంటాయి. వాటిని సక్రమంగా అందుకోవాలంటే కొన్ని నైపుణ్యాలు అలవర్చుకోవాలి.
సంబంధం అంటే నల్లేరు మీద నడకేం కాదు. సాధకబాధకాలు చాలా ఉంటాయి. సంబంధాన్ని విజయతీరాలకు చేర్చడం అనుకున్నంత సులువేం కాదు. ఒక కొత్త వ్యక్తిని జీవితంలోకి ఆహ్వానించి వారితో జీవితంలోని ప్రతి ఒక్కటి పంచుకోవాల్సి ఉంటుంది. బంధం అనే సుదీర్ఘ ప్రయాణంలో మలుపులు మజిలీలు ఎన్నో ఉంటాయి. సంబంధాన్ని విజయవంతంగా సాగించాలంటే కొన్ని నైపుణ్యాలు అలవర్చుకోవాలని అంటారు రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్.

సంబంధం ద్వారా చాలా ప్రయోజనాలు ఉంటాయి. కష్టనష్టాలు, సుఖదుఃఖాలు పంచుకునేందుకు జీవిత భాగస్వామి ఎప్పుడూ తోడుగా ఉంటారు. కష్ట సమయంలో వారు అండగా నిలబడతారు. సంబంధంలో ప్రేమ ఉంటుంది, మంచి అనుబంధం ఉంటుంది, సాన్నిహిత్యం ఉంటుంది.. వాటిని సక్రమంగా అందుకోవాలంటే కొన్ని నైపుణ్యాలు అలవర్చుకోవాలి.
మీ స్వంత అవసరాలతో పాటు మీ భాగస్వామి అవసరాలు, భావాలు, ప్రవర్తనల గురించి అర్థం చేసుకోవడం, గౌరవించడం లాంటివి చాలా ఉంటాయి. ఈ అంతర్దృష్టులను ఉపయోగించడం ద్వారా, మీరు మీ భాగస్వామికి మరియు మీ సంబంధానికి సాధ్యమైనంత ఉత్తమమైన మార్గాల్లో సహాయం చేయవచ్చు. అందరూ తమ సంబంధం ఆనందదాయకంగా ఉండాలనే కోరుకుంటారు. కానీ అలాంటి సంబంధాన్ని కొనసాగించడానికి సరైన టూల్స్ లేక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఏ సంబంధమూ పరిపూర్ణంగా ఉండదు. బంధం కొనసాగడానికి ఇద్దరు భాగస్వాములు తమ సమయాన్ని, కృషిని పెట్టుబడి పెట్టాలి.
సంబంధం విజయవంతంగా ముందుకు సాగించాలంటే ప్రతి ఒక్కరూ ఈ నైపుణ్యాలు తప్పనిసరిగా నేర్చుకోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. భావోద్వేగ నియంత్రణ
సంబంధంలో ఉన్నప్పుడు వివిధ పరిస్థితులలో మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా చాలా ముఖ్యం. మనుషులు అన్నాక కొన్ని తప్పులు జరుగుతుంటాయి. పొరపాట్లు చేసినప్పుడు కోపం, ఆవేశం రావడం సహజం. కానీ కోపంలో భాగస్వామిపై అరవడం అస్సలే మంచి పద్ధతి కాదు. భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవడం ప్రతి ఒక్కరూ చేయాల్సిన అతి ముఖ్యమైన పని. కోపం, ఆవేశం మాత్రమే కాకుండా ఇతర భావోద్వేగాలనూ మన చెప్పు చేతల్లో ఉంచుకోవాలి.

2. పరస్పరం
సంబంధంలో నిర్ణయం తీసుకునేటప్పుడు, మీరు మీ అవసరాలను మరియు మీ భాగస్వామి అవసరాలను పరిగణనలోకి తీసుకుంటారు. సంబంధంలో ఉన్న వ్యక్తులు ఇద్దరూ సమానంగా ముఖ్యమైనవారు. వారి అవసరాలు కూడా అంతే ముఖ్యమైనవి.

3. అంతర్దృష్టి
ఇది ఒక ముఖ్యమైన నైపుణ్యం. ఇది మీరెవరు, మీకేం కావాలి, మీరు చేస్తున్న పని నుండి ఏం ఆశిస్తున్నారు లాంటి ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఏం కావాలన్నది క్లారిటీ ఉంటే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీకేం కావాలో సూటిగా చెప్పినప్పుడు అక్కడ అపార్థాలకు, చికాకులకు చోటు ఉండదు.



Click it and Unblock the Notifications