For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షాక్! కలయికలో టూత్ పేస్ట్ వాడుతున్న కపుల్స్... అలా వాడితే డేంజరంటున్న డాక్టర్లు...!

|

శృంగారంలో చాలా మంది కపుల్స్ పాల్గొంటారు. అయితే అందరూ ఆనందాన్ని పొందలేరు. ఒకవేళ ఆనందాన్ని పొందాలంటే ఏమి చేస్తారు.. మహా అయితే ఫోర్ ప్లే చేస్తారు... లేదా ఇంకేదైనా మెడిసిన్ ను వాడుతుంటారు. కానీ ఈ మధ్యన శృంగారం గురించి విచిత్రమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి... కొందరికి కలయిక విషయంలో ఆనందాన్నిచ్చిదేంటో తెలిస్తే షాకవుతారు...

ఎందుకంటే కొన్ని నెలలుగా కొంతమంది జంటలు తాము శృంగారంలో పాల్గొన్నప్పుడు టూత్ పేస్ట్ వాడుతున్నామని చెప్పేశారట. దీంతో చాలా మంది వైద్యులు ఇతర జంటలను ఇదే ప్రశ్నలు వేస్తున్నారట.

అయినా శృంగారానికి, టూత్ పేస్టుకు ఉన్న లింకేంటి? దాన్ని వాడితే ఆ కార్యంలో అంతలా ఆస్వాదించొచ్చా? అనే కదా మీ డౌట్. అయితే ఈ విషయం ప్రస్తుతం తెగ వైరల్ అయిపోయింది. దీనికి సంబంధించి విషయాలేంటో మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. వీటి గురించి తెలుసుకోకుండా మీరు కూడా ఇలాంటి లేని పోని ప్రయోగాలు చేస్తే మాత్రం మీకు సమస్యలు రావడం మాత్రం ఖాయం..

అయితే శృంగారంలో పాల్గొనేవారు టూత్ పేస్ట్ ఎందుకు వాడతారు? దీని వల్ల వచ్చే ప్రయోజనాలేంటి.. దీని గురించి డాక్టర్లు ఏమి చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం రండి...

సర్వే! 'స్మార్ట్'గా మత్తెక్కించడమే ఆ మగువల పనంట...! అపరిచితులతో వారికి మజా వస్తోందంట...!

అది కష్టమైతే..

అది కష్టమైతే..

కొంతమంది కపుల్స్ లో యోనిలోకి అంగ ప్రవేశం కష్టమవుతుంది. దీంతో కొన్ని లూబ్రికేంట్లను వాడుతూ ఉంటారు. ఇంకా కొంతమంది అక్కడ నూనెలు, వ్యాసిలిన్, కోల్డ్ క్రీమ్స్ తదితర వాటిని వాడుతూ ఉంటారు. అయితే వీటి స్థానంలో ఇటీవల టూత్ పేస్టులను వాడుతున్నారట. దీని వల్ల సులభంగా అంగప్రవేశం జరుగుతుందని, అంతేకాదు.. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవనే ప్రచారం జరిగింది. దీంతో చాలా మంది దీన్ని వాడటం మొదలుపెట్టారట...

ఇది ప్రమాదకరమా?

ఇది ప్రమాదకరమా?

అయితే ఇలా చేయడం వల్ల ఏదైనా ప్రమాదం ఉందా అంటే.. కచ్చితంగా చాలా ప్రమాదం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. టూత్ పేస్టులో కందెన లేదా నూనెలు మాదిరిగా జారుడు స్వభావం ఉండదని.. వీటిని ప్రైవేట్ భాగాలకు రాసి కలయికలో పాల్గొంటే.. ఆ రాపిడికి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు.

మంట పుడతాయి..

మంట పుడతాయి..

ఈ టూత్ పేస్టులలో చాలా వాటికి పిండి స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఇవి అక్కడ అంటించుకోవడం వల్ల రాపిడి సమయంలో గాయాలవుతాయి. అయితే అవి ఆ సమయంలో పెద్దగా తెలియకపోయినా.. మీ మొత్తం కార్యం అయిపోయిన తర్వాత అవి ఎర్రగా మారి మంట పుడతాయి. ఇవి మన శరీరంలోనే అత్యంత సున్నితమైన భాగాలు కావడం వల్ల.. వీటికి అయిన గాయాలు అంత త్వరగా మానవు.

కరోనా నుండి కోలుకున్న వెంటనే ఆ కార్యంలో పాల్గొనొచ్చా?

సోషల్ మీడియాలో..

సోషల్ మీడియాలో..

ఈ చిట్కాలను ఆన్ లైనులో.. సోషల్ మీడియాలో చూసి చాలా మంది వీటిని ట్రై చేస్తున్నారట. ఇప్పుడు చాలా మంది ఇదే ట్రెండుగా భావించారట. అయితే తమకు అయిన గాయాలను... చేదు అనుభవాలను సోషల్ మీడియా వెబ్ సైట్ ‘రెడిట్' ద్వారా పంచుకుని.. తమలా ఎవ్వరూ ఇబ్బందిపడొద్దని చెబుతున్నారు. ఎవ్వరు కూడా టూత్ పేస్టు లూబ్రికెంట్ గా వాడొద్దని సూచిస్తున్నారు.

దంతాలకు మాత్రమే..

దంతాలకు మాత్రమే..

టూత్ పేస్టును కేవలం దంతాల మాత్రమే ఉపయోగించాలని.. శరీరంలోని ఏ ఇతర భాగాలపై టూత్ పేస్టును వాడకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు. ఒకవేళ టూత్ పేస్టును ప్రైవేట్ భాగాలకు వాడితే అంటు వ్యాధులు లేదా కెమికల్ బర్న్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

ఆనందాన్ని ఆస్వాదించలేరు..

ఆనందాన్ని ఆస్వాదించలేరు..

టూత్ పేస్టులో ఉండే బ్లీచింగ్, పిప్పర్మెంట్ లేదా సుగంధ నూనెలు శరీరంలో దద్దుర్లు ఏర్పడేలా చేస్తాయి. అంతేకాదు దీని నుండి వచ్చే ఫంగస్ వల్ల బ్యాక్టీరియాల కారణంగా కలయిక అంటేనే విరక్తి వచ్చేలా చేస్తాయి. వీటిలో ఉండే గరుకుదనం వల్ల యోని భాగంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీని వల్ల శృంగారంలో మజాను ఆస్వాదించలేరు అని డాక్టర్లు చెబుతున్నారు.

సంతానంపై ప్రభావం..

సంతానంపై ప్రభావం..

శృంగారంలో పాల్గొనే జంటలు ఎవరైనా టూత్ పేస్టులనే కాదు.. బాత్రూమ్ లో వాడే ఇతర ఉత్పత్తులను లూబ్రికెంట్లుగా అస్సలు వాడకూడదు. ఎందుకంటే అవి మన బాడీని క్లీన్ చేసుకోవడానికి మాత్రమే రూపొందించారు. సున్నితమైన ప్రాంతాల్లో వీటిని వాడితే సంతానంపై ప్రభావం పడుతుంది.

English summary

Love Hurts People are using toothpaste as lube - it's a really bad idea, docs warn

Here we talking about the love hurts people are using toothpaste as lube-it's really bad idea, docs warn. Read on.
Story first published: Wednesday, September 23, 2020, 18:04 [IST]