For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శోభనం గదిలో భార్య మగాడిగా మారిపోతే... వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం...!

|

కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు ఫస్ట్ నైట్ కోసం ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఆ ఘట్టంలో తాము ఎప్పుడెప్పుడు పాల్గొంటామా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే ఓ వ్యక్తి ఫేస్ బుక్ లో చూసి ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇక రోజూ చాటింగ్ చేస్తూ.. తన ప్రేమ గురించి ఎన్నో కవితలు, కథలను షేర్ చేసుకున్నారు.

అయితే ఎన్నాళ్లిలా ఛాటింగ్ చేసుకుంటాం.. అనుకుని.. తర్వాత నేరుగా కలుసుకుందాం అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఇద్దరూ ఒక కేఫ్ లో కలుసుకున్నారు. అలా చూపులు కలిసిన శుభవేళలో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

కొన్ని వారాల పాటు ఇద్దరూ కలిసి బాగా చెట్టపట్టాలేసుకుని మరీ తిరిగారు. ఇద్దరూ కలిసి ఒకరిని వదిలి మరొకరు ఒక్క క్షణం కూడా ఉండలేకపోయారు.

దీంతో ఒక రోజు కాఫీ షాపులో తన మనసులో మాటను బయటపెట్టేశాడు ఆ వ్యక్తి.

త్వరగా పెళ్లి చేసుకుందాం అనే ప్రపోజల్ పెట్టడంతో అందుకు ఆమె కూడా ఒప్పుకుంది.దీంతో వారి పెద్దలకు చెప్పి చకచకా పెళ్లి ఏర్పాట్లు చేశారు. జాంజాం అంటూ పెళ్లి కూడా చేసేసుకున్నారు. అక్కడి సంప్రదాయం ప్రకారం కొంత సొమ్మును కట్నంగా కూడా తీసుకున్నాడు.

ఆ తర్వాత అసలు సినిమా స్టార్టయ్యింది. ఫస్ట్ నైట్ రోజు ఆమెతో రతి క్రీడలో రెచ్చిపోదామనుకున్న ఆ కొత్త పెళ్లికొడుక్కి ఆమె బ్రేకులేసింది. తనకు ఇప్పుడు మూడ్ లేదని, తనకు ఇబ్బందిగా ఉందని చెప్పడంతో ఆ రాత్రి ఎలాంటి కార్యం జరగకుండానే గడిచిపోయింది. అయితే రెండో రోజు రాత్రి సేమ్ సీన్ రిపీట్. ఇక ముచ్చటగా మూడో రోజు రాత్రి మాంచి మూడ్ తో ఉత్సాహంతో రెఢీ అయిన భర్త ఆమెపై పడటంతో అసలు సంగతి బయటపడింది. తాను పెళ్లి చేసుకున్నది మగాడినని తెలిసి అవాక్కయ్యాడు.

ఒకే మహిళపై మనసు పారేసుకున్న తండ్రీ కొడుకులు... చివరికి ఏం జరిగిందంటే...

శోభనం రాత్రి మూడో రోజు

శోభనం రాత్రి మూడో రోజు

ఇండోనేషియాకు చెందిన 31 ఏళ్ల ముహ్ అనే వ్యక్తి ఫేస్ బుక్ లో మిటా అనే అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అసలే ఎండాకాలం. అప్పటికే రెండురోజుల పాటు కంట్రోల్ చేసుకున్న అతను మూడో రోజు మాత్రం ఆగలేదు. మాంచి వేడి మీద ఉన్న అతను ఆమె మీద పడిపోయాడు.

సేమ్ సీన్...

సేమ్ సీన్...

అయితే ఆమె మాత్రం ఫస్ట్ నైట్ రోజు.. రెండోరోజు చెప్పిన డైలాగులనే మళ్లీ రిపీట్ చేయడంతో, ముహ్ అవేవీ పట్టించుకోలేదు. తనతో బలవంతంగా రొమాన్స్ చేద్దామని ప్రయత్నించాడు.

‘అమ్మాయి కాదు అబ్బాయిని’

‘అమ్మాయి కాదు అబ్బాయిని’

ఇక ఆమెకు పరిస్థితి అర్థమైంది. తను ఆగేలా లేడని తెలుసుకుని, తాను ఆడపిల్లను కాదని.. మగాడినని అసలు విషయం చెప్పేసింది. అంతే ఆ పెళ్లికొడుక్కి ఒక్కసారిగా షాక్ కొట్టినంత పనైంది.

మీ భాగస్వామిని ముద్దుల్లో ముంచెత్తే ముందు ఈ విషయాలను మరవొద్దు సుమా...!

కోపంగా వెళ్లిపోయాడు..

కోపంగా వెళ్లిపోయాడు..

నిజం తెలుసుకన్న ఆ పెళ్లి కొడుకు కోపంతో శోభనం గదిలోంచి వెళ్లిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులకు,పెద్దలకు ఆ విషయాన్ని చెప్పాడు. వెంటనే వారితో మాట్లాడి తనకు విడాకులిచ్చేశాడు.

మోసపోయానని తెలిసి..

మోసపోయానని తెలిసి..

ముహ్ విడాకులు ఇచ్చిన అనంతరం ఆమెను వదిలేయలేదు. తర్వాత పోలీసుస్టేషన్ కు వెళ్లి ఆమెపై కాదు కాదు అతనిపై కేసు పెట్టాడు. అప్పుడు మీటా అసలు పేరు వేరే అని తేలింది. ‘ఆమె గొంతు కాస్త తేడాగా ఉన్నా ఆమె వంపుసొంపులు చూసి మోసపోయానని' ముహ్ వాపోయాడు.

ఇటీవలే ఈ సంఘటన..

ఇటీవలే ఈ సంఘటన..

ఇదంతా ఇండోనేషియాలోని సెంట్రల్ జావా కేదిరి పట్టణంలో జూన్ నెలలోనే జరిగింది. ఫేస్ బుక్ లో పరిచయమైనా.. ఇంట్లో పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటే, తన శోభనం రెండురోజులు వాయిదా పడి, మూడో రోజూ మొత్తానికి మోసం జరిగిందని ముహ్ తెగ బాధపడిపోతున్నాడు.

English summary

Man divorces wife two days after wedding atter finding out she was a man

Here we talking about man divorces wife two days after wedding atter finding out she was a man. Read on.
Story first published: Monday, June 15, 2020, 18:45 [IST]