For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెగాస్టార్ చిరంజీవిని అలా బుట్టలోకి లాగేశారట... అయితే పెళ్లికి ముందే చిరు అహం దెబ్బతిందట...!

నేను వారి ఇంట్లోకి అడుగుపెట్టిన తొలిసారి సురేఖనే కాఫీ పెట్టింది. కానీ అప్పుడు మేము ఇద్దరం ఒకరినొకరు చూసుకోలేదు.

|

ప్రస్తుతం మన దేశంలో ప్రేమ వివాహాలు బాాగా పెరిగిపోయాయి. ఆరేంజ్డ్ మ్యారేజ్ లు చాలా వరకు తగ్గిపోతున్నాయనే చెప్పొచ్చు. అయితే ప్రేమ వివాహంలో ప్రేమికులిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని.. ప్రేమతో రెండు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకుంటే వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలే రావని చాలా మంది అంటూ ఉంటారు.

Shocking facts about marriage

అయితే అర్థం చేసుకునే తత్వం.. ప్రేమించే గుణం ఉంటే చాలు ప్రేమ పెళ్లిళ్లే కాదు.. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలోనూ ప్రేమ నిండి ఉంటుందని ఎన్నో జంటలు నిరూపిస్తున్నాయి. అలాంటి జంటలో అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది మెగాస్టార్ చిరంజీవి-సురేఖ జంట.

Shocking facts about marriage

వీరిద్దరికీ వివాహం జరిగి నలభై ఏళ్లు పూర్తయినా.. వీరి మధ్య ఇప్పటి వరకు ఎలాంటి పొరపచ్చా రాలేదంటే వీరి వివాహ బంధం ఎంత బలమైనదో ఇట్టే అర్థమవుతోంది. అయితే మెగాస్టార్ చిరంజీవికి కూడా పెళ్లికి ముందు ఓ విషయంలో అహం దెబ్బతిందంట. అలా ఎందుకు జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం...

RRR డైరెక్టర్ రాజమౌళి రియల్ లైఫ్ లవ్ స్టోరీ తెలిస్తే కచ్చితంగా హ్యాట్సాఫ్ చెబుతారు.. ఎందుకంటే...RRR డైరెక్టర్ రాజమౌళి రియల్ లైఫ్ లవ్ స్టోరీ తెలిస్తే కచ్చితంగా హ్యాట్సాఫ్ చెబుతారు.. ఎందుకంటే...

చూపులు కలవలేదు..

చూపులు కలవలేదు..

చిరంజీవి-సురేఖ పెళ్లి జరిగి ఫిబ్రవరి 20వ తేదీతో నలభై సంవత్సరాలు పూర్తయ్యింది. అయితే వీరి పెళ్లి గురించి చిరంజీవి ఓ ఇంటర్య్వూలో అనేక విషయాలను వెల్లడించారు. తమ పెళ్లికి ముందు జరిగిన అనేక సంఘటనలను వివరించారు.

అప్పటివరకు..

అప్పటివరకు..

‘నేను చెన్నైలో కోడంబాకం వారధిపై కారులో వెళ్తున్న సమయంలో నా క్లాస్ మేట్ సత్య నారాయణ కనిపించాడు. అతడిని వారి ఇంట్లో దించేందుకు నా కారులో ఎక్కించుకున్నా. అయితే వారి పెదనాన్న ఎవరో కాదు అల్లురామలింగయ్య గారు. వారి ఇంటి దగ్గర చేరుకున్నాక, తను వారి ఇంట్లోకి ఆహ్వానించాడు. అప్పుడు ఆయన ఇంట్లో లేడు.

నా గురించి ఆరా తీశారు..

నా గురించి ఆరా తీశారు..

నేను వారి ఇంట్లోకి అడుగుపెట్టిన తొలిసారి సురేఖనే కాఫీ పెట్టింది. కానీ అప్పుడు మేము ఇద్దరం ఒకరినొకరు చూసుకోలేదు. అయితే వారి కుటుంబ సభ్యులు అప్పటికే నా గురించి డిస్కషన్ మొదలు పెట్టారు. సురేఖ నా గురించి ఫ్రెండ్స్ తో ఆరా తీసింది. అయితే అప్పటికే నేను కేవలం మూడు సినిమాలే చేశాను.

ఏడడుగుల బంధాన్ని ఏడేళ్లలో ముగించింది.. అయితే కొడుకు ఎదుటే రెండోపెళ్లి చేసుకుందీ స్టార్ హీరో కూతురు..ఏడడుగుల బంధాన్ని ఏడేళ్లలో ముగించింది.. అయితే కొడుకు ఎదుటే రెండోపెళ్లి చేసుకుందీ స్టార్ హీరో కూతురు..

ఐఏఎస్ ఆఫీసర్ కు ఇచ్చి..

ఐఏఎస్ ఆఫీసర్ కు ఇచ్చి..

అయితే అల్లు రామలింగయ్య గారికి వారి అమ్మాయిని ఓ ఐఏఎస్ ఆఫీసర్ కు ఇచ్చి పెళ్లి చేయాలని కోరిక ఉండేదట. కానీ ఎందుకు ప్రయత్నం చేయకూడదని వారు నా గురించి ఆరా తీయడం ప్రారంభించారు. ‘తను ఆంజనేయ స్వామి భక్తుడు, ఎలాంటి చెడు అలవాట్లు లేవు. బాగా చదువుకున్నాడు. చాలా కష్టపడతాడు. తన చేతిలో మంచి సినిమాలు కూడా ఉన్నాయి‘ అని నా గురించి నా ఫ్రెండ్ మంచిగా చెప్పాడు.

అలా బుట్టలో పడేశారు..

అలా బుట్టలో పడేశారు..

అల్లు రామలింగయ్య గారు అయితే ఏకంగా సుమారు 10 మంది నిర్మాతలను నా గురించి అడిగి ఓ నిర్ణయానికి వచ్చారట. అయితే అందరూ నా గురించి మంచిగా చెప్పడంతో వారు నన్ను లాగి బుట్టలో పడేశారు.

పెళ్లి వయసు కాదు..

పెళ్లి వయసు కాదు..

అయితే నాది పెళ్లి వయసు కాదని కరాఖండీగా చెప్పాను. కానీ, జయక్రిష్ణ గారు మా నాన్న గారితో ‘అబ్బాయి వేరే ఆకర్షణలకు లోనవుతాడేమో‘ అని చెప్పారేమో నాన్న భయపడిపోయి ‘నేను మా అబ్బాయిని ఒప్పిస్తా‘ అన్నారు.

పెళ్లిచూపులకు బలవంతంగా..

పెళ్లిచూపులకు బలవంతంగా..

దీంతో నన్ను పెళ్లిచూపులకు కూడా బలవంతంగా తీసుకెళ్లారు. అలా వారి ఇంటికి పెళ్లిచూపులకు వెళ్లిన సమయంలో సురేఖను, నన్ను ఒంటరిగా మాట్లాడుకోమని పెద్దలందరూ బయటకు వెళ్లారు. ఆమె డిగ్రీ వరకు చదువుకుందని తెలుసు. కానీ ఆ సమయంలో ఏం మాట్లాడాలో తెలియక ఏం చదువుకున్నారని అడిగా. అప్పుడే నాకు సురేఖ నచ్చేసింది.

ఆ సినిమా చూసి..

ఆ సినిమా చూసి..

చిరంజీవి గారి భార్య సురేఖ కూడా తమ పెళ్లిచూపుల గురించి ఇలా చెప్పారు. ‘మన ఊరి పాండవులు‘ చూసి ఈ గుండ్రని కళ్లబ్బాయి ఎవరో కానీ బాగానే ఉన్నాడు. కళ్లు పెద్దగా ఉంటాయి. మా అమ్మ అప్పటికే నటుడిని పెళ్లి చేసుకుంది. నేను కూడా నటుడినే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. అందుకే చిరంజీవితో పెళ్లికి మా నాన్నతో ఓకే చెప్పేశాను.

క్రికెటర్లతో మూడు ముళ్లు వేయించుకున్న బాలీవుడ్ అందాల భామలెవరో తెలుసా...క్రికెటర్లతో మూడు ముళ్లు వేయించుకున్న బాలీవుడ్ అందాల భామలెవరో తెలుసా...

అప్పుడు నా అహం దెబ్బతింది..

అప్పుడు నా అహం దెబ్బతింది..

అప్పుడు సెల్ ఫోన్లు లేవు కదా. ల్యాండ్ లైన్లే అప్పడు మాకు ఆధారం. ఓసారి సురేఖతో మాట్లాడాలనిపించింది. వారి ఇంటికి ఫోన్ చేస్తే సురేఖనే ఫోన్ తీసింది. ‘హలో నేను చిరంజీవి‘ అన్నాను. ‘నేను సురేఖ నండి. ఫోన్ ఎవరికివ్వమంటారు‘ అంది. అంతే నాతో కనీసం రెండు మాటలు కూడా మాట్లాడలేదు. అందుకే నా అహం దెబ్బతింది. ‘మీ అన్నయ్య ఉన్నాడా‘ అని అడిగాను. ‘లేరండీ‘ అంది. ‘వచ్చాక నేను ఫోన్ చేశానని చెప్పు‘‘ అని పెట్టేశాను.

పెళ్లి డేట్ గురించి..

పెళ్లి డేట్ గురించి..

అయితే ఇందుకు స్పందించిన సురేఖ *తను పెళ్లికి సంబంధించిన ముహుర్తాలు.. తేదీల గురించి అడిగేందుకు చేశారనుకున్నాను. నాతో మాట్లాడేందుకు అని నేను అనుకోలేదు‘ అని చెప్పింది.

1980లో వివాహం..

1980లో వివాహం..

ఆ తర్వాత 1980లో ఫిబ్రవరి 20వ తేదీన మా ఇద్దరికి పెళ్లి జరిగింది‘ అని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. అయితే చివరగా ఆ ఇంటర్వ్యూలో మరో జన్మంటే ఉంటే మీరే జంటగా ఉండాలనుకుంటున్నారా? అని అడగగా కచ్చితంగా మేమే ఉండాలనుకుంటున్నా అని చెప్పారు.

English summary

Megastar Chiranjeevi Shocking facts about marriage

Here are the shocking facts about megastar chiranjeevi marriage. Take a look
Desktop Bottom Promotion