Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
ఈ 6 రాశుల మగాళ్లను అస్సలు మిస్సవ్వదు... వీరు ఉత్తమ భర్తలుగా నిలుస్తారట...!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ రాశుల వారు ఉత్తమ భర్తలుగా ఉంటారట. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి.
మనలో ప్రతి ఒక్కరికీ పెళ్లి అనేది జీవితంలో ఒకేసారి వచ్చే మధురమైన ఘట్టం. ఈ వివాహ వేడుక అద్భుతంగా జరగాలని.. తమకు మంచి భాగస్వామి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

ఇక మహిళలైతే తమ భర్త ఆరడుగులు ఉండాలి.. అందంగా ఉండాలి.. బాగా చదువుకుని.. ఎక్కువ సంపాదిస్తూ ఉండాలి.. తాము కోరిందల్లా నెరవేర్చాలి అనుకుంటూ ఉంటారు. అలాంటి భర్త దొరికితే ఈ జీవితంలో తమ కంటే లక్కీ ఎవరు ఉండరని అనుకుంటూ ఉంటారు. తమ భర్త అన్ని విషయాల్లో అందరికంటే ఒక అడుగు ముందుండాలని కోరుకుంటారు.

అలాంటి వారిని కనుక్కోవడం కొంచెం కష్టమే. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, కొన్ని రాశుల వారు ఉత్తమ భర్తలుగా ఉంటారట. వీరు తమ భాగస్వామి పట్ల ఎల్లప్పుడూ రక్షణగా ఉంటారట. అంతేకాదు పార్ట్నర్ ఆలోచనలకు, అభిప్రాయాలకు గౌరవం ఇస్తారట. ఎలాంటి సందర్భంలో అయినా కూల్ గా వ్యవహరిస్తారట. తమ భాగస్వామి ఐడియాలను ప్రోత్సహిస్తారట. మరి ఆ రాశి చక్రాల వ్యక్తులెవరు.. ఆ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి...

మేషరాశి
ఈ రాశి వారు కుటుంబ బాధ్యతలను స్వీకరించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. అందుకే వీరు ఉత్తమ భర్తలుగా మిగిలిపోతారు. ఆర్థిక పరమైన విషయాల్లో వీరు చాలా బ్యాలెన్స్ గా ఉంటారు. కొన్ని సందర్భాల్లో వీరు మొండిగా వ్యవహరించొచ్చు. కానీ అలా ఉండేందుకు కూడా బలమైన కారణం ఏదో ఒకటి ఉండే ఉంటుందట. అంతేకాదు వీరు తమ చమత్కారమైన మాటలతో, వ్యక్తిత్వంతో తమ భార్యను ఇట్టే ఆకట్టుకుంటారట.

మిధున రాశి
ఈ రాశి వారు తమ భాగస్వాముల పట్ల చాలా గౌరవం మరియు నిబద్ధత కలిగి ఉంటారు. వారు మీకు జీవితాంతం రక్షణగా నిలుస్తారు. గొడవ జరిగితే వారు కొన్నిసార్లు భావోద్వేగానికి లోనవుతారు, కానీ ప్రేమతో వారు మిమ్మల్ని మళ్లీ ఉత్సాహపరుస్తారు. అయితే, మీరు వారితో సరిగ్గా వ్యవహరించకపోతే, వారి ప్రాముఖ్యత మీకు తెలియనంత వరకు వారు మీ పట్ల ప్రేమను వ్యక్తం చేయరు.

కన్య రాశి..
ఈ రాశి మగాళ్లు తమ జీవిత భాగస్వామికి ఎలా సందర్భాల్లో అయినా పూర్తి మద్దతు ఇస్తారు. వీరు తమ భార్య లక్ష్యాలను, ఆశయాలను బాగా గౌరవిస్తారు. పెళ్లి అయిన తర్వాత తమ భార్య చదువుకోవడానికి ఆసక్తి చూపుతుంటే..దానికి కూడా సహాయం చేస్తారు. మీరు కెరీర్ పరంగా ఎదిగేందుకు ఎన్ని అవకాశాలు ఉంటే.. అన్నింటినీ సద్వినియోగం చేసుకునేందుకు మద్దతు ఇస్తారు. మీరు ఏదైనా ఉద్యోగాన్ని ఇష్టపడుతుంటే.. అందుకు పూర్తి సహకారం అందిస్తారు.

తులా రాశి..
ఈ రాశి వారు వివాహ జీవితం పట్ల చాలా సానుకూలంగా ఉంటారు. అయితే వీరి భాగస్వాముల జీవితాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోవాలని అనుకోరు. వారు తమ భాగస్వామిని ఎప్పుడూ అనుమానించరు. వారిపై గూఢచర్యం చేయరు. తమ జీవిత భాగస్వామికి తగిన గౌరవం ఉండాలని కోరుకుంటారు.

ధనుస్సు రాశి
ఈ రాశి పురుషులు చాలా హోమ్లీ మరియు ఫ్రెండ్లీగా ఉంటారు. ఎల్లప్పుడూ తమ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడతారు. వీరు ఎక్కువగా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండేందుకు ఇష్టపడుతారట. అంతేకాదు వీరికి జాలి, దయ వంటివి చాలా ఎక్కువగా ఉంటాయట. ఈ రాశి పురుషులు తమ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపడం వల్ల మంచి తండ్రులుగా మారే అవకాశం ఉంది.

మీన రాశి
ఈ రాశి వారు మంచి భర్తలుగా ఉంటారు. ఎందుకంటే వారు తమ భాగస్వామిని జాగ్రత్తగా చూసుకుంటారు. తమ పార్ట్నర్ కు ఎప్పుడు ఏది అవసరమైనా.. వెంటనే నెరవేర్చేందుకు ప్రయత్నిస్తారు. అంతేకాదు ప్రతిరోజూ ఇంటి పనులలో హెల్ప్ చేస్తారు. పిల్లల పెంపకంలో కూడా తమ వంతు ప్రయత్నం చేస్తారు. వీరు తమ భాగస్వామి మాటలను, నిర్ణయాలను గౌరవిస్తారు. వారితో చాలా సందర్భాల్లో ఏకీభవిస్తారు. అందుకే వీరు ఉత్తమ భర్తలుగా మారిపోతారు.
ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్క మహిళ తమకు మంచి మగాడు భర్తగా రావాలని కోరుకుంటారు. తమ భర్త అన్ని విషయాల్లో అందరికంటే ఒక అడుగు ముందుండాలని కోరుకుంటారు. అలాంటి వారిని కనుక్కోవడం కొంచెం కష్టమే. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అలాంటి వ్యక్తులను తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మేష రాశి, మిధున రాశి, కన్య రాశి, తుల రాశి, ధనస్సు రాశి, మీన రాశి వారు ఉత్తమ భర్తలుగా ఉంటారట.



Click it and Unblock the Notifications