For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘నా భర్త అస్తమానం పాస్ వర్డ్ మారుస్తున్నాడు.. అలా చేస్తే నాకెందుకో...’

నా భర్త అస్తమానం ఫోన్ నెంబరు మారుస్తుంటే.. నాకెందుకో తేడా కొడుతోంది.

|

ఆలుమగలు అన్నాక తరచుగా ఏదో గొడవలు వస్తూనే ఉంటాయి. అయితే అలాంటి సమయంలో ఎవరో ఒకరు సర్దుకుపోతే ఎలాంటి సమస్యా ఉండదు.

My Husband always keeping her smart phone password protected

అలా కాకుండా చిన్న చిన్న విషయాలకే గ్యాప్ వస్తే.. అది కూడా స్మార్ట్ ఫోన్ల నుండే అది చిలికి చిలికి గాలివానలా మారే ప్రమాదముంది. ఎందుకంటే చాలా మంది ఎంతగా కలిసి జీవిస్తున్నా సరే.. తమ ఫోన్ కాంటాక్ట్స్ ను, ఫోన్ హిస్టరీని సీక్రెట్ గా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తారు.

My Husband always keeping her smart phone password protected

అయితే ఇలాంటివి నచ్చని ఓ భార్య, తనకు నచ్చని ఈ విషయాల గురించి ఇలా వివరించింది. అందుకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

'నా ప్రియురాలితో నా మిత్రులు ఇలా చేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది...!''నా ప్రియురాలితో నా మిత్రులు ఇలా చేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది...!'

రెండేళ్లుగా..

రెండేళ్లుగా..

హాయ్ నాకు పెళ్లి జరిగి పదేళ్లు పూర్తవుతోంది. మాకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఒకరికి ఎనిమిదేళ్లు.. మరొకరికి ఏడేళ్లు. పెళ్లైన నాటి నుండి మేమిద్దరం చాలా విషయాల్లో ఓపెన్ గా ఉండేవాళ్లం. కలిసి మాట్లాడుకునేవాళ్లం.. ఇద్దరం కలిసే నిర్ణయాలు తీసుకునేవాళ్లం. అయితే గత రెండేళ్ల నుండి నా భర్త తన స్మార్ట్ ఫోన్ కు పాస్ వర్డ్ లేదా ప్యాటర్న్ లాక్ పెట్టుకోవడం ప్రారంభించాడు.

సడన్ గా సర్ ప్రైజ్..

సడన్ గా సర్ ప్రైజ్..

అప్పటిదాకా మేమిద్దరం ఎవ్వరి ఫోన్లకు లాక్ వేసుకోవడం గానీ.. ప్యాటర్న్ లాక్ వంటివి అస్సలు పెట్టుకునేవాళ్లం కాదు. ఎందుకంటే మా ఇద్దరి మధ్య అంత మంచి అండర్ స్టాండింగ్ ఉండేది. ఎప్పుడైనా సడెన్ గా నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోతే వెంటనే తన ఫోన్ తీసి వాడుకునేంత స్వేచ్ఛ ఉండేది. అయితే ఇటీవల తన ఫోన్ ను అస్సలు టచ్ చేయనియ్యట్లేదు. కొత్తగా తన స్మార్ట్ ఫోన్ పాస్ వర్డ్, లాక్ పెట్టి సర్ ప్రైజ్ చేస్తున్నాడు.

ఇటీవల ఫోన్ నెంబర్లు..

ఇటీవల ఫోన్ నెంబర్లు..

ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఫోన్ నెంబర్లను కూడా అస్తమానం మారుస్తూ ఉన్నాడు. ఇప్పటికే రెండు, మూడు సార్లు నంబర్లు మార్చేశాడు. ఫోన్లు కూడా సంవత్సరానికొకసారి మారుస్తూనే ఉన్నాడు. ఫోన్ల వరకు అయితే ఒకే కానీ.. నెంబర్లు మార్చాల్సినంత అవసరం ఏమొచ్చిందా అని బుర్రలో ఒకటే ఆలోచన కలుగుతోంది. దీంతో నాకు ప్రెజర్ పెరుగుతోంది' అని ఓ వివాహితురాలు తన సమస్యను చెప్పుకొచ్చింది. ఇందుకు నిపుణులు ఏమి సమాధానం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం.

సింపుల్ గా చెప్పేస్తాం..

సింపుల్ గా చెప్పేస్తాం..

మనలో చాలా మంది ఇతరుల గురించి లేదా భాగస్వామి గురించి చాలా సింపుల్ గా జడ్జిమెంట్ చెప్పేస్తుంటాం. ముఖ్యంగా వారి ప్రవర్తన మార్చుకోవాలని.. మీలో ఇది బాలేదని.. అది బాలేదని.. మీ ఆటిట్యూడ్ మార్చుకోవాలని చెబుతూ ఉంటాం. కానీ ఇలాంటి విషయాలు వారిని చాలా బాధపెడతాయి.

బయటకు చెప్పుకోరు..

బయటకు చెప్పుకోరు..

ఇలాంటి సందర్భాల్లో చాలా మంది తమ వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పుకోలేరు. వారు ఏం చేసినా చాలా సీక్రెట్ గా చేయాలని డిసైడ్ అవుతారు. కాబట్టి మీ పార్ట్ నర్ విషయంలో కూడా అలాంటి పరిస్థితే ఉండొచ్చు. మీ పార్ట్ నర్ తన ఫోన్ కు పాస్ వర్డ్ పెట్టుకోవడం వల్ల మీ బుర్రలో ఏమనిపిస్తుందో తనకు చెప్పి చూడండి.

శ్రద్ధగా వినండి..

శ్రద్ధగా వినండి..

అదే సమయంలో వారు చెప్పేది కూడా శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ రిలేషన్ లో నమ్మకం అనేది ఇద్దరి మధ్య కచ్చితంగా ఉండాలి. సంబంధం విషయంలో ఏదైనా సమస్య వస్తే.. ఇద్దరూ చర్చించుకుని పరిష్కరించుకోవాలి. ఎందుకంటే.. మీకు ఎదిగే పిల్లలు ఉన్నారు. ఇలాంటి విషయాల గురించి మీరు వారి ఎదుట గొడవ పడటం మంచిది కాదు.

English summary

My Husband always keeping her smart phone password protected

Here we are talking about the my husband always keeping her smart phone password protected. Read on
Story first published:Tuesday, March 16, 2021, 19:02 [IST]
Desktop Bottom Promotion